ఈ యాప్ జియో, వాట్సప్‍లను సైతం హడలెత్తిస్తోంది

Written By:

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించిన 'భీమ్' యాప్ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. డిసెంబర్ 30 న లాంచ్ అయిన భీమ్ 'భీమ్' ( 'భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ'.) యాప్ అత్యంత ప్రజాదారణ పొందిన వాట్సాప్, మై జియో, మెసెంజర్, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ యాప్‌లను తలదన్నుతూ ప్లే స్టోర్ నుంచి డోన్‌లోడ్ అవుతోంది.

ప్రధాని ఆవిష్కరించిన భీమ్ యాప్ గురించి పూర్తి సమాచారం..

ఈ యాప్ జియో, వాట్సప్‍లను సైతం హడలెత్తిస్తోంది

లాంచ్ అయిన మూడురోజుల్లోనే గూగుల్ ప్లే స్టోర్ చార్ట్ లో నెంబర్ 1 ప్లేస్ కొట్టేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో ఇప్పటికే ఇరవై లక్షల (రెండుమిలియన్ల) డోన్ లోడ్స్ సాధించింది. వినియోగదారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, చాలా తక్కువ సమయంలో రెండు మిలియన్లమంది ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

ఆపిల్ ఐఫోన్ 8పై సరికొత్త నిజాలు

ఈ యాప్ జియో, వాట్సప్‍లను సైతం హడలెత్తిస్తోంది

దీంతో భీమ్ విజయంపై ఆధార్ మాజీ ఛైర్మన్ నందన్ నీలేకని ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. డిజిటల్ ఆదారిత చెల్లింపుల కోసం మోడీ డిసెంబర్ 30న ఈ యాప్ ను ప్రారంభించారు. అంబేద్కర్ కు నివాళిగా వచ్చిన ఈయాప్ ద్వారా నేరుగా డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంది. ఈ యాప్ అద్భుతాలు సృష్టిస్తుందని కొనియాడిన సంగతి తెలిసిందే.

English summary
BHIM app becomes number one on Google Play Store chart in just 3 days of launch Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot