ఆపిల్ ఐఫోన్ 8పై సరికొత్త నిజాలు

DigiTimes రిపోర్టుల ప్రకారం ఐఫోన్ 8 కు అమోల్డ్ డిస్ ప్లేని శాంసంగ్ కంపెనీ సప్లయి చేయనున్నట్లు తెలుస్తోంది

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ తన తరువాతి తరం ఫోన్ ఐఫోన్ 8 పై భారీగానే కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లు కంటే అతి పెద్ద ఫోన్ ను బయటకు తీసుకురానుంది. దీంతోపాటు తొలిసారిగా అమోల్డ్ డిస్ ప్లే సపోర్ట్ తో ఐఫోన్ 8 రానున్నట్లు రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఆపిల్ ఈ ఫోన్ ను ఈ ఏడాది లాంచ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.

 

వాట్సప్‌పై హై అలర్ట్ జారీ, భారీగా వైరస్ ఫైల్స్ షేర్

అతి పెద్ద డిస్ ప్లేతో

అతి పెద్ద డిస్ ప్లేతో

అతి పెద్ద డిస్ ప్లేతో ఐఫోన్ 8ని తీసుకువచ్చేందుకు ఆపిల్ కంపెనీ కసరత్తు చేస్తోంది. దీంతో పాటు మూడు రకాల వేరియంట్లలో ఐఫోన్ 8 రానుందని సమాచారం.

శాంసంగ్ కంపెనీ

శాంసంగ్ కంపెనీ

DigiTimes రిపోర్టుల ప్రకారం ఐఫోన్ 8 కు అమోల్డ్ డిస్ ప్లేని శాంసంగ్ కంపెనీ సప్లయి చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఐఫోన్ సీరిస్ ఫోన్లకు శాంసంగ్ కంపెనీ ప్రధాన సప్లయిదారుగా ఉండే అవకాశం ఉందని DigiTimes చెబుతోంది.

8 మూడు రకాల సైజుల్లో
 

8 మూడు రకాల సైజుల్లో

రిపోర్టుల ప్రకారం రానున్న ఐఫోన్ 8 మూడు రకాల సైజుల్లో మార్కెట్లోకి రానుంది. రెగ్యులర్ గా వచ్చే 4.7 సైజ్, అలాగే 5.5 సైజ్ తో పాటు తొలిసారిగా 5.8 ఇంచ్ అమోల్డ్ డిస్ ప్లే ను తీసుకురానుందని తెలుస్తోంది. ఇప్పటిదాకా ఉన్న టీఎప్ టీ ఎల్ సీడి ప్యానల్స్ ను మారుస్తూ అమోల్డ్ డిస్ ప్లేతో దీనిని తీసుకురానున్నట్లు సమాచారం.

60-70 మిలియన్ యూనిట్లను

60-70 మిలియన్ యూనిట్లను

ఆపిల్ కంపెనీ ఐఫోన్ 8 ఫోన్లను దాదాపు 60-70 మిలియన్ యూనిట్లను మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డ్యూయెల్ కర్వడ్ ఎడ్జ్ డిస్ ప్లేతో వచ్చిన శాంసంగ్ ఎస్7ఎడ్జ్ అలాగే నోట్ 7ల మాదిరిగా ఐఫోన్ 8 కూడా రానున్నట్లు సమాచారం.

వైర్ లెస్ ఛార్జింగ్

వైర్ లెస్ ఛార్జింగ్

దీంతో పాటు వైర్ లెస్ ఛార్జింగ్ తో ఐఫోన్ 8 రానుంది. దీని ద్వారా ఛార్జింగ్ చాలా వేగవంతంగా అవుతుందని కంపెనీ చెబుతోంది. ప్రీక్వీన్సీ లో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ వైర్ లెస్ ఛార్జింగ్ పనిచేయనుంది.

కంపెనీ 10వ వార్షికోత్సవంలో

కంపెనీ 10వ వార్షికోత్సవంలో

అన్ని అనుకున్నట్లు జరిగితే ఆపిల్ కంపెనీ ఐఫోన్ 8 ను కంపెనీ 10వ వార్షికోత్సవంలో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ నుంచి తొలిసారిగా 2007లో ఫస్ట్ ఐఫోన్ వచ్చింది. రూమర్ మిల్ ప్రకారం ఆపిల్ కంపెనీ తన 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరపనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ఐఫోన్ 8 కూడా ఉండే అవకాశం ఉంది.

 

 

Best Mobiles in India

English summary
Apple working on iPhone 8 with bigger display, Samsung to be supplier: Report read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X