ఇంటర్నెట్ లేకుండానే వెబ్ సర్ఫ్ చేయవచ్చు,మీకోసం కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ డివైస్‌లు వాడుతున్నయూజర్లకు గూగుల్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అందుబాటులో ఇంటర్నెట్ లేకపోయినా క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్ సర్ఫ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఆండ్రాయిడ్ డివైస్‌లు వాడుతున్నయూజర్లకు గూగుల్ ఓ బంపర్ ఆఫర్ ఇస్తోంది. అందుబాటులో ఇంటర్నెట్ లేకపోయినా క్రోమ్ బ్రౌజర్‌లో వెబ్ సర్ఫ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇండియాతోపాటు మరో వంద దేశాల్లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మీరు ఏదైనా వైఫైకి కనెక్టయి ఉన్నపుడు మీ లొకేషన్‌ను బట్టి పాపులర్ అయిన కంటెంట్‌ను క్రోమ్ ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటుంది. ఆ తర్వాత మీకు నెట్ లేకపోయినా.. వీటిని చూసే వీలుంటుందని ఆండ్రాయిడ్ ఆఫ్‌లైన్ క్రోమ్ మేనేజర్ అమందా బాస్ వెల్లడించారు.

ఈ డౌన్‌లోడ్ అయిన డేటాను ఎప్పుడైనా, నెట్ కనెక్షన్ లేకపోయినా చూసుకోవచ్చు. ఇక మీ బ్రౌజింగ్ హిస్టరీ ప్రకారం కూడా మీకు అవసరమైన సమాచారాన్ని క్రోమ్ ఆటోమేటిగ్గా డౌన్‌లోడ్ చేసి పెడుతుంది అని బాస్ చెప్పారు. గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వర్షన్ క్రోమ్‌ను అప్‌డేట్ చేసుకుంటే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
సరికొత్త హంగులతో నోకియా 5.1 ప్లస్ వచ్చేస్తోంది
టాప్ 10 గూగుల్ క్రోమ్ చిట్కాలు తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఈ క్రోమ్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ మీకు తెలుసా
Ctrl బటన్ ను ప్రెస్ చేసి ఉంచి 1 నుంచి 8 లోపు ఏ నెంబరు బటన్ పై ప్రెస్ చేసినా ఆ సంఖ్యలో ఉన్న్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది.
Ctrl + 9 - చివరి ట్యాబ్‌లోకి వెళ్లటానికి
Ctrl + H - బ్రౌజర్ హిస్టరీని చూపిస్తుంది.
Ctrl + J - డౌన్‌లోడ్స్ విండో ఓపెన్ అవుతుంది.
Ctrl + K - కర్సర్‌ను అడ్రస్ బార్ లోకి తీసుకువెళుతుంది.
Ctrl + T - కొత్త ట్యాబ్‌ను ఓపెన్ చేసేందుకు.

గూగుల్ ఓమ్నిబాక్స్
గూగుల్ ఓమ్నిబాక్స్ ద్వారా యూఆర్ఎల్ ఆధారిత శోధనే కాకుండా గణిత సంబంధిత గణాంకాలను కూడా నిర్వహించుకోవచ్చు.

సెట్టింగ్స్, పాస్‌వర్డ్స్
మీ క్రోమ్ బ్రౌజర్‌లోని సెట్టింగ్స్, పాస్‌వర్డ్స్ అలానే బుక్‌మార్క్‌లను గూగుల్ అకౌంట్ కు సింక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ను సద్వినియోగం చేసుకోవటం ద్వారా వర్క్ అలానే హోమ్ కంప్యూటర్ ను సలువుగా మేనేజ్ చేయవచ్చు.

పిన్
తరచుగా ఓపెన్ చేసే ట్యాబ్‌లను పిన్ చేసుకోవచ్చు. నచ్చిన ట్యాబ్ లను పిన్ చేసుకోవటం ద్వారా వేగవంతమైన యాక్సిస్ ను ఆస్వాదించవచ్చు.
ట్యాబ్ ను పిన్ చేసేందుకు ట్యాబ్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసినట్లయితే పలు ఆప్షన్ లతో కూడిన మెనూ ప్రతక్ష్యమవుతుంది. వాటిలో Pin Tab ఆప్షన్ ను ఎంపిక చేసుకునంటే సరి.

ఆటో ఫిల్ ఫీచర్‌ను ఉపయోగించుకోండి
క్రోమ్ ఆటో ఫిల్ ఫీచర్, ప్రతిసారి మీరు నింపే ఆన్ లైన్ ఫామ్ లకు సంబంధించి సాధారణ ఖాళీలను ఈ ఆటో ఫిల్ ఫీచర్ నింపేస్తుంది. ఆటో ఫిల్ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే బ్రౌజర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి, Show advanced settingsను క్లిక్ చేసి Passwords and forms విభాగంలో కనిపించే Manage Autofill settingsను క్లిక్ చేసినట్లయితే ఆటోఫిల్ సెట్టింగ్స్ విండో ఓపన్ అవుతుంది. ఈ విండోలోని Add new street address బటన్ ను క్లిక్ చేసినట్లయితే ఓ అడ్రస్ పేజీ ఓపెన్ అవుతుంది. మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వివరాలను పూరించి అడ్రస్ సెట్టింగ్స్ సేవ్ చేయండి. ఆటో ఫిల్ ఫీచర్ యాక్టివేట్ అయినట్టే.

క్రోమ్ బ్రౌజర్‌లో ట్యాబ్‌ను వేగంగా క్లోజ్ చేసేందుకు
క్రోమ్ బ్రౌజర్‌లో టెక్స్ట్ బాక్సులను రీసైజ్ చేసుకోవచ్చు.
కీబోర్డ్ షార్ట్‌కట్స్ Ctrl + W లేదా Ctrl + F4

అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్:
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో అందుబాటులోన్న మరో ఎక్స్‌టెన్షన్ ‘అన్‌ఫ్రెండ్ నోటిఫికేషన్'. ఈ ఫీచర్ ద్వారా మన ఫేస్‌బుక్ ఖాతా నుంచి తొలగిపోతున్న వారి జాబితాను తెలుసుకునే వీలుంది.

పటిష్టమైన పాస్‌వర్డ్
పటిష్టమైన పాస్‌వర్డ్ కోసం ‘లాస్ట్ పాస్': గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో అందుబాటులో ఉన్న లాస్ట్‌పాస్ ఎక్స్‌టెన్షన్ తికమక పెట్టే గ్రామర్‌తో శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను తయారు చేస్తుంది.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫేస్‌బుక్ షార్ట్‌కట్స్
alt+m - new message
alt+0 - help center
alt+1 - homepage
alt+ 2- profile page
alt+3 - manage friends list
alt+4 - messages list
alt+5 - notification page
alt+6 - account settings
alt+5 - notification page
alt+6 - account settings
alt+7 - privacy settings
alt+8 - facebook fan page
alt+9 - facebook terms
alt+? - search box


Click it and Unblock the Notifications