వాట్సప్‌పై హై అలర్ట్ , భారీగా వైరస్ ఫైల్స్ షేర్

Written By:

వాట్సప్ ప్రమాదంలో పడింది. ఇందులో భాగంగా వాట్సప్ పై కేంద్ర భద్రతా ఏజన్సీలు హై అలర్ట్ జారీ చేశాయి. దేశంలోకి రెండు సంచలనాత్మక వైరస్ ఫైల్స్ వాట్సప్ లో భారీగా షేర్ అవుతున్నాయని ఇవి చాలా ప్రమాదంతో కూడుకున్నవని భద్రతా ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వటిపై అప్రమత్తంగా లేకుంటే మీ సమాచారం మొత్తం తస్కరించే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

ఈ ఏడాది షియోమి నుంచి దూసుకొస్తున్న ఫోన్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎన్‌డీఏ, ఎన్ఐఎ పేరుతో

దేశంలో రెండు సంచలనాత్మక వైరస్ ఫైల్స్ భారీగా షేర్ అవుతున్నాయని, ఎన్‌డీఏ, ఎన్ఐఎ పేరుతో హానికరమైన ఈ ఫైల్స్ షేర్ అవుతున్నాయని వీటిపై అప్రమత్తంగా ఉండాలని రక్షణా, భద్రతా సిబ్బందికి కేంద్ర భద్రతా ఏజెన్సీలు హెచ్చరికలు జారీ చేశాయి.

పోలీస్ విభాగంలోని సిబ్బందిని టార్గెట్ చేస్తూ

ముఖ్యంగా డిఫెన్స్, సెక్యూరిటీ పారామిలీటరీ, పోలీస్ విభాగంలోని సిబ్బందిని టార్గెట్ చేస్తూ ఈ అనుమానాస్పద ఫైల్స్ సర్క్యులేట్ అవుతున్నాయని భద్రా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.

ఎక్స్ ఎల్ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ లో

ప్రధానంగా ఎక్స్ ఎల్ ఫార్మాట్ లో ఉన్న ఫైల్ లో హానికరమైన వైరస్ ను జోడించినట్టు అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా యూజర్ల వ్యక్తిగత సమాచారంతోపాటు బ్యాంకింగ్ డేటాను హాక్ చేయొచ్చని తెలిపారు.

ఫోన్ మరియు డేటాపై దాడిచేసే

వినియోగదారుల ఫోన్ మరియు డేటాపై దాడిచేసే ఈ వైరస్ మెసేజ్ ల ద్వారా బ్యాంకింగ్ పాస్ వర్డ్స్, పిన్ తదితర వివరాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ హానికరమైన ఫైల్స్ ఎంఎస్ వర్డ్ 'లేదా' పీడీఎఫ్ ఫార్మాట్లలో కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

యూజర్లు వీటికి తొందరగా

దేశీయంగా అంతర్జాతీయ బాగా పాపులర్ సంస్థలు ఎన్ ఐఎ, ఎన్ డీఏ ఈ పేరుతో ఈ సందేశాలు చలామణి అవుతున్నట్టు, దీంతో యూజర్లు వీటికి తొందరగా ఆకర్షితమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

సందేశాలను స్వీకరించిన సిబ్బంది

ఇలాంటి సందేశాలను స్వీకరించిన సిబ్బంది వెంటనే సంబంధిత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలకు రిపోర్ట్ చేయాలని కోరుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
WhatsApp virus on the run: Indian defence, security forces send out high alert Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting