ఈ ఏడాది షియోమి నుంచి దూసుకొస్తున్న ఫోన్లు ఇవే !

Written By:

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఈ ఏడాది తన ఆరంభాన్ని ఘనంగా ప్రారంభించేందుకు రెడీ అయింది. అత్యంత తక్కువ ధరలో అదిరే ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేస్తూ ఇతర ఫోన్లకు సవాల్ విసురుతూ వస్తోంది. ఈ ఏడాది మార్కెట్లో సిద్ధంగా ఉన్న షియోమి రెడ్ మి ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

షియోమి Mi 6

ఇది చూసేందుకు చాలా చిన్నగా కనిపిస్తుంది. ఈ మధ్యే లాంచ్ అయిన రెడ్ మి నోట్ 2 లాగా ఉండే అవకాశం ఉంది. ఇక ఈ ఫఓన్ డ్యూయెల్ కర్వ్ డ్ డిస్ ప్లే తో రానుంది. లీకయిన వివరాల ప్రకారం Mi 6 Snapdragon 835 SoC తో రానుంది. 128 జిబి, 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ లో ఈ ఫోన్ వస్తోంది. మూడు రంగుల్లో ఈఫోన్ వస్తుందని రూమర్స్ తెలియజేస్తున్నాయి.

ప్లెక్సిబుల్ డిస్ ప్లే ఫోన్

2016లో షియోమి కాన్సప్ట్ ఫోన్ మి మాక్స్ సిరామిక్ బాడీ , ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి షియోమి ఫ్లెక్సిబుల్ డిస్ ప్లే ఫోన్ లాంచ్ చేయనుందని లీకియన వివరాలు తెలియజేస్తున్నాయి.

షియోమి Mi 6s

ఈ ఫోన్ ఈ ఏడాది అఫిషియల్ గా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ కి సంబంధించి ఎటువంటి ఫీచర్లు ఇప్పటివరకు లీక్ కాలేదు. అయితే గతేడాది Mi 5 వచ్చిన నేపథ్యంలో ఆ ఫీచర్లకు అటుఇటూగా ఈ ఫోన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Xiaomi Mi 6s Plus

ఈ ఫోన్ Mi 6 కన్నా చాలా పెద్దగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఈ ఫోన్ లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Xiaomi Mi 5c

ఈ ఏడాది షియోమి నుంచి రానున్న మరో ఫోన్ ఇది. 5.2 ఇంచ్ అడోర్న్ ఎఫ్‌హెచ్‌డి 1080p డిస్ ప్లేతో రానుంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో , ఆక్టాకోర్ ప్రాసెసర్, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా తో రానున్నట్లు లీకయిన వివరాలు తెలియజేస్తున్నాయి.

షియోమి Redmi Note 5

రెడ్ మి నోట్ 3 అమ్మకాల్లో సరికొత్త సంచలనాలు సృష్టించిన నేపథ్యంలో కంపెనీ అదే ఊపులో రెడ్ మి నోట్ 5ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మీడియా టెక్ డెకా కోర్ ప్రాసెసర్ తో పాటు 3జిబి / 4జిబి ర్యామ్ తో ఫోన్ ఈ ఏడాది మార్కెట్లో కనువిందు చేయనుందని సమాచారం.

Xiaomi Mi Note 3

మి నోట్ 2 గతేడాది లాంచ్ అయిన నేపథ్యంలో ఈ ఏడాది దానికి అప్ డేట్ గా Mi Note 3ని కంపెనీ తీసుకురానుంది. ఇది కూడా డ్యూయెల్ కర్వ్డ్ డిస్ ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది.

Xiaomi Redmi 5

రెడ్ మి 4 సక్సెస్ అయిన నేపథ్యంలో కంపెనీ రెడ్ మి 5పై దృష్టి పెట్టింది. రెడ్ మి 4 ఫీచర్లకు మరికొన్నింటిని జోడించి రెడ్ మి 5ను కంపెనీ ఈ ఏడాది తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Roundup: Smartphones Rumored to Arrive in 2017 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot