పేటీఎమ్ ఆ ఫీచర్‌ని ఆపేసింది

Written By:

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు అందర్నీ ముప్పతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే. బ్యాంకుల్లో నోట్లు ఇవ్వక. ఏటీఎంలు తెరవక ప్రజలు ఎక్కువగా ఆన్ లైన్ చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎక్కడో ఉన్న పేటీఎమ్ ఒక్కసారిగా ముందుకు దూసుకొచ్చింది. టాప్ లో నిలిచింది. అయితే ఇప్పుడు పేటీఎమ్ స్కాన్ చేయడం ద్వారా చేపట్టే చెల్లింపులను నిలిపివేస్తూ షాకిచ్చింది.

ఈ మెసేజ్‌లు ఓపెన్ చేశారో అంతే సంగతులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చిన్నచిన్న దుకాణాల్లో

మొబైల్ వ్యాలెట్ సంస్థ పేటీఎం చిన్నచిన్న దుకాణాల్లో డెబిట్ క్రెడిట్ కార్డులను స్కాన్ చేయడం ద్వారా చేపట్టే తన యాప్ చెల్లింపులను నిలిపేసింది.

వినియోగదారుడి సమాచార భద్రతకు

దీనివల్ల వినియోగదారుడి సమాచార భద్రతకు ప్రమాదముందని అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కార్డును స్కాన్ చేసి చెల్లింపులను

దుకాణదారు స్మార్ట్ ఫోన్లోని పేటీఎం యాప్ ద్వారా వినియోగదారుడి కార్డును స్కాన్ చేసి చెల్లింపులను చేపట్టే విధానాన్ని పేటీఎం ఇటీవలే చేపట్టింది. ఇందులో పేటీఎం యాప్ పీవోఎస్ లాగా ఉపయోగపడుతుంది.

గత అక్టోబరులో 32 లక్షల కార్డుల సమాచారం

ఏటీఎంలలో పెట్టిన మాల్వేర్లతో గత అక్టోబరులో 32 లక్షల కార్డుల సమాచారం బయటకు వెళ్లిన నేపథ్యంలో పేటీఎం 'యాప్ పీవోస్'తోనూ అలాంటి ముప్పు ఉందని క్రెడిట్ కార్డు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.

ప్రస్తుతానికి నిలిపేసి

దాంతో ప్రస్తుతానికి నిలిపేసి, యాప్ను మరింత కట్టుదిట్టం చేస్తామని పేటీఎం ప్రకటించింది. పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా సంస్థ భారీఎత్తున పెట్టుబడులు పెట్టింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Demonetisation: Paytm suspends POS app rollout over user privacy concerns read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot