ఆన్‌లైన్‌ పేమెంట్ రంగంలోకి ఫేస్‌బుక్ గ్రాండ్ ఎంట్రీ

|

ఫేస్‌బుక్ తన యాప్ ఎకోసిస్టమ్ - ఫేస్‌బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లలో కొత్తగా పేమెంట్ వ్యవస్థను ప్రారంభించింది. ఫేస్‌బుక్ పే అనే పేరుతో పేమెంట్ ప్రక్రియ ఫేస్‌బుక్ మరియు మెసెంజర్‌లలో ఈ వారం యుఎస్‌లో నిధుల సేకరణకు, ఈవెంట్ టిక్కెట్లు, వ్యక్తికి- వ్యక్తికి పర్సనల్ గా మెసెంజర్‌ ద్వారా చెల్లింపులు చేయడానికి మరియు ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో ఎంచుకున్న పేజీలు మరియు వ్యాపారాల నుండి కొనుగోలు కోసం ప్రారంభమవుతుంది.

ఫేస్‌బుక్

కాలక్రమేణా ఫేస్‌బుక్ పేని ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్‌లో కూడా వాడటానికి అనుమతి లభిస్తుంది. దీని ద్వారా పేమెంట్ కోసం ఎక్కువ మందికి ఇందులోకి తీసుకురావాలని మేము ప్లాన్ చేస్తున్నాము అని ఫేస్‌బుక్‌ యొక్క మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు.

 

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్

డిజిటల్ కరెన్సీ

ఫేస్‌బుక్ పే ద్వారా పేమెంట్స్ జరపడం కోసం క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో పాటు పేపాల్‌కు కూడా మద్దతు ఇస్తుంది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పే ప్రస్తుత ఆర్థిక మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకొని ఇతర భాగస్వామ్యాలపై నిర్మించబడింది. ఇది కంపెనీ డిజిటల్ కరెన్సీ అయిన లిబ్రా నెట్‌వర్క్‌తో రన్ అవుతున్న కాలిబ్రా వాలెట్ నుండి వేరుగా ఉంటుంది.

 

ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చుఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చు

ఫేస్‌బుక్

మీరు ఫేస్‌బుక్ లేదా మెసెంజర్‌లో ఫేస్‌బుక్ పేను కొన్ని ట్యాప్‌లను ఉపయోగించడం ద్వారా ప్రారంభించవచ్చు.

- ఇందులో మొదటగా ఫేస్‌బుక్ యాప్ లేదా వెబ్‌సైట్‌లోని "సెట్టింగులు" లను ఓపెన్ చేయండి.
- తరువాత అందులో గల "యాడ్ ఫేస్‌బుక్ పే"ఎంపికను ఎంచుకోండి.
- తదుపరిసారి మీరు పెమెంట్స్ చేసినప్పుడు ఫేస్‌బుక్ పేని ఉపయోగించండి.
- ఇది వాట్సాప్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత మీరు దీన్ని ప్రతి యాప్ లోను నేరుగా సెటప్ చేయవచ్చు.

 

ఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదుఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదు

 

ఫింగర్ ప్రింట్

వినియోగదారులు డబ్బును పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం ఏదైనా పిన్ జోడించవచ్చు లేదా ఫింగర్ ప్రింట్ టచ్ ఐడి లేదా ఫేస్ ఐడి వంటి బయోమెట్రిక్‌ లాక్ లను కూడా ఉపయోగించవచ్చు. గత నెలలో ఫేస్‌బుక్ CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ వాట్సాప్ ద్వారా త్వరలో ఇండియాలో కూడా పెమెంట్ సేవలను ప్రారంభించనుంది అని తెలిపారు. దేశంలో పదిలక్షల మంది వినియోగదారులతో పెమెంట్ సర్వీస్ ను విజయవంతంగా పరీక్షించినప్పటికీ డేటా సమ్మతి సమస్యలు మరియు నిబంధనలు కొంతకాలంగా వాట్సాప్ పే ప్రయోగాన్ని అప్రమత్తంగా ఉంచాయి.

Best Mobiles in India

English summary
Facebook Launch Online Payment App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X