మోడీ యాప్..ఓ పెద్ద స్కాం నడుస్తోంది

Written By:

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్లో దానికి సంబంధించి అనేక రకాలైన సమాచారాన్ని అందరూ వెతుకుతుంటారు. ముఖ్యంగా గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి దీనికి కావాల్సిన సమాచారం కోసం అందరూ తెగ వెతుకుతుంటారు. అందుకోసం అనేక రకాలైన యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటారు. అయితే ఇలాంటి వాటితో చాలా ప్రమాదముందని నిపుణులు తెలియజేస్తున్నారు. అదెలాగో మీరే చూడండి.

ఈ ఏడాది టెక్నాలజీలో అతి పెద్ద ఫెయిల్యూర్స్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎక్కడ చూసినా మోడీ కీనోట్

ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లో మాత్రం ఎక్కడ చూసినా మోడీ కీనోట్ పేరిట లెక్కకు మించిన యాప్స్ దర్శనమిస్తున్నాయి. వాటిలో అసలుది ఏదో, నకిలీది ఏదో గుర్తించడం చాలా కష్టంగా మారింది.

అనేక అంశాలతో కూడిన సమాచారాన్ని

ఈ నెల 8 వ తేదీన ప్రధాని మోడీ చేసిన ప్రసంగం తాలూకు కీనోట్ మొదలుకొని అనేక అంశాలతో కూడిన సమాచారాన్ని తెలుసుకోండి అంటూ చాలా మంది పైన చెప్పిన విధంగా మోదీ కీనోట్ పేరిట అనేక యాప్స్ ను క్రియేట్ చేసి ప్లే స్టోర్లో పెట్టారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇలాంటి యాప్‌ల వల్ల

అయితే ఇలాంటి యాప్‌ల వల్ల వారికి తెలియకుండానే డివైస్లలోని సమాచారం హ్యాకర్లకు చేరుతోంది.నోట్ల రద్దు సమాచారం అంటూ లెక్కకు మించిన యాప్స్ ను క్రియేట్ చేసి, వాటి నిండా యాడ్స్ ను నింపి, దాంతో డబ్బులు సంపాదించవచ్చని సదరు యాప్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

యూజర్ల సమాచారం

ఇంకా కొందరైతే యూజర్ల సమాచారం దొంగిలించడమే పనిగా తమ యాప్లను ఫ్రీగా కూడా అందజేస్తున్నారు. వాటిలో ఎలాంటి యాడ్స్ ఉండకపోయినా సదరు యాప్స్‌ను ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం డివైస్కు కచ్చితంగా వైరస్ రావడం ఖాయం.

ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని

లేదంటే డివైస్లో ఉన్న యూజర్ సమాచారం తస్కరణకు గురయ్యేందుకు అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, సదరు యాప్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని ఐటీ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Fake Alert! Modi Keynote App Removed from Play Store, FAKE App Still Exists Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot