ఈ ఏడాది టెక్నాలజీలో అతి పెద్ద ఫెయిల్యూర్స్..

Written By:

ఈ ఏడాది టెక్నాలజీ రంగంలోని అభిమానులకు తీరని దు:ఖాన్నే మిగిల్చింది. ముఖ్యంగా శాంసంగ్ గెలాక్సీ 7 పేళుళ్లతో మొదలెడితే కెమెరాలు, అలాగే ఎగిరే డ్రోన్లు ఇలా అన్ని కూడా ఫ్లాప్ అయ్యాయి. 2016 సంవత్సరంలో ఫెయిల్ అయిన టాప్ టెన్ టెక్నాలజీ పరికరాలేంటో మీరే చూడండి.

యుకె వెళుతున్నారా..రూల్స్ మారాయి, ఇకపై కష్టాలే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7

శాంసంగ్ కంపెనీ దీని దెబ్బకి ఇప్పటికీ కోలుకోవడం లేదు. గెలాక్సీ 7 పేళుళ్లు మిగిల్చిన నష్టం నుంచి ఇంకా బయటపడనే లేదు. ఇది కంపెనీతో పాటు శాంసంగ్ అభిమానులకు మాయని మచ్చలా మారింది.

ఫాలింగ్ డ్రోన్స్

ఆకాశంలోనుంచి అదిరిపోయో ఫోటోలను తీస్తామంటూ ముందుకు దూసుకువచ్చిన కర్మ డ్రోన్ అభిమానులకు చేదు జ్ఙాపకాలనే మిగిల్చింది. ఆకాశంలోకి వెళ్లగానే ఇవి తమ పవర్ కోల్పోయాయి. కంపెనీ వీటిని రీకాల్ చేస్తున్నామంటూ ప్రకటించింది.

మిస్సింగ్ పోర్ట్స్

ఎటువంటి హెడ్ ఫోన్స్ లేకుండానే సంగీతాన్ని వినడంటూ ఆపిల్ కంపెనీ హెడ్ జాక్ లను తీసుకొచ్చింది. అయితే ఇవి మార్కెట్లో నిరాశనే మిగిల్చాయి. చిన్న డొంగెల్ లాంటి పరికరం లేకుండా అవి రన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో అది వినియోగదారుల అభిరుచిని చూరగొనలేకపోయింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Consumer-friendly 360

360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ కెమెరాలు కష్టమర్లను అలరించడానికి వచ్చాయి. అయితే అవి మార్కెట్లో చతికిలబడ్డాయి. వీటిల్లో 360ఫ్లై కెమెరాలు కూడా ఉన్నాయి. వీడియో క్వాలిటీ అంతంత మాత్రం గానే ఉంది. ఇప్పటికీ వీటికోసం కష్టమర్లు ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఛార్జింగ్ వోస్

హార్ట్ రేట్ చూసే ఫిటినెస్ వాచ్ లు ఇవి. అయితే ఇవి మార్కెట్లో అంతగా ఆదరణ చూరగొనలేదు.

బోట్స్

ఫేస్ బుక్ మెసేంజర్ లో చాట్ బోట్స్ అంటూ ఓ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. కష్టమర్లు త్వరగా తమ సర్వీసును అందుకోడానికి ఇది బెస్ట్ అంటూ చెప్పింది కూడా. అయితే ఇది కష్టమర్లకు మదికి చాలా దూరంలో నిలిచింది.

రోబోట్స్

మాట్లాడే రోబోలు వస్తున్నాయంటూ గూగుల్ హల్ చల్ చేసింది. డిసెంబర్ 5న దీనికి సంబంధించిన ఈవెంట్ ఉంది మీరు అలారం పెట్టుకోండి అంటూ పిలుపు కూడా ఇచ్చింది. అయితే అది కార్యరూపం దాల్చేలా లేదు.

సిరి

సిరిని సరికొత్తగా మార్కెట్లోకి తీసుకొస్తున్నామంటూ ఆపిల్ సగర్వంగా ప్రకటించింది. అయితే అది ఇప్పటికీ సమస్యలను తెచ్చిపెడుతూనే ఉంది.

ఫ్లయింగ్ కెమెరాలు

లిల్లి కెమెరాలు ఇక ఆకాశంలో చక్కర్లు కొడతాయంటూ ప్రచారం హోరెత్తింది. గాలిలో ఎగిరేందుకు నైపుణ్యం అవసరం లేదు మీరు గాలిలోకి విసిరేస్తే అదే మొత్తం రికార్డు చేస్తుందన్నది సారాంశం. అయితే అవి ఇంతవరకు ఆకాశంలో ఎగరలేదు.

క్లింటన్ విన్

చివరిగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీదే విజయమంటే సోషల్ మీడియాలో హోరెత్తాయి. చివరికి అది నిరాశనే మిగిల్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
The top 10 tech flops of 2016: falling drones, non-existent flying cameras Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting