Home
Apps

అల్లో vs వాట్సప్ vs జియో చాట్..ఏది బెస్ట్

By Hazarath

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ అల్లో వెంటపడుతున్నారు. వాట్సప్ కి ధీటుగా ఈ యాప్ ని విడుదల చేసామని గూగుల్ చెప్పడంతో అందరూ దాని వెంటే పడుతున్నారు. అయితే వాట్సప్ కు అల్లో యాప్ కు, జియో ఛాట్ కు మధ్య అనేక తేడాలున్నాయి..ఆ తేడాలేంటో మీరే చూడండి.

ఏడాది ఉచిత ఇంటర్నెట్‌తో రూ. 3వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్

గూగుల్ అసిస్టెంట్

గూగుల్ అసిస్టెంట్

ఈ యాప్ లో గూగుల్ సెర్చ్ అసిస్టెంట్ లభిస్తుంది. అంటే ఏదైనా సెర్చ్ చేయాలంటే, యాప్ ను మూసేసి, గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండానే సెర్చ్ చేయవచ్చు. అక్కడ లభించే వీడియోలు, చిత్రాలు, లింక్ లను పంచుకోవచ్చు. అయితే ఈ ఆప్సన్ వాట్సప్ లో లేదు. జియో ఛాట్ లో లేదు.

మరింత సమాచారం

మరింత సమాచారం

అన్ని యాప్స్ లో సమాచారాన్ని షేర్ చేసుకునే సౌకర్యం ఉంది. అయితే గూగుల్ విడుదల చేసిన అల్లో యాప్ లో మీరు మరింత సమాచారం పొందవచ్చు. ట్రాఫిక్ , వాతావరణం, స్పోర్ట్స్ , ఫ్లైట్ స్టేటస్ ఇలాంటివి ఎన్నో మీకు యాప్ అందుబాటులో ఉంచుతోంది.

స్టిక్కర్ బేస్

స్టిక్కర్ బేస్

Google Allo యాప్‌‌లో పదాలతో వ్యక్తం చేయలేని కొన్ని భావాలను స్టిక్కర్స్ ద్వారా వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే ఈ ఫీచర్ యూజర్ల మెయిల్ వ్యూయింగ్ సమయాన్ని తగ్గిస్తుంది. సమాచారాన్ని చదివి, మీరు అటువంటి సమాచారం చదివినప్పుడు గతంలో వినియోగించిన 'హహహ', 'లోల్' వంటి పదాలను సమాధానంగా పంపుతుంది.అయితే మిగతా యాప్స్ లో కేవలం స్టిక్కర్స్ మాత్రమే పంపుకునే సౌకర్యం ఉంది.

రిప్లయి ఫీచర్

రిప్లయి ఫీచర్

ఈ ఫీచర్ వాట్సప్ లా చాలా బెటర్ గా ఉంటుంది. మీరు ఏదన్నా రిప్లయి చేయాలంటే వెంటనే రిప్లయి ఇవ్వవచ్చు. కాని అల్లోలో కొంచెం టైం తీసుకుంటుంది.

డూడుల్స్

డూడుల్స్

అల్లో అలాగే జియో ఛాట్ లో మాత్రమే అదిరిపోయే డూడుల్స్ ఉంటాయి. ఈ ఫీచర్ వాట్సప్ లో తక్కువ. Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే ఫోటోల పై బొమ్మలను డ్రా చేయవచ్చు. పదాలను కూడా టైప్ చేయవచ్చు. మిగతా వాటిల్లో ఈ ఫీచర్ లేదు.

వీడియో కాలింగ్

వీడియో కాలింగ్

జియో ఛాట్ మాత్రమే వీడియో కాలింగ్ కు సపోర్ట్ చేస్తుంది. మిగతా యాప్ లు వీడియో కాలింగ్ ని సపోర్ట్ చేయడం లేదు.గూగుల్ ప్రత్యేకంగా వీడియో కాలింగ్ కోసం డుయె యాప్ ని ప్రవేశపెట్టింది. వాట్సప్ లో ఆఫీచర్ లేదు.

ఇన్ కాగ్నిటో మోడ్

ఇన్ కాగ్నిటో మోడ్

ఎంత నెట్ వాడకందారులైనా, సోషల్ మీడియా పిచ్చోళ్లయినా, ఏదో ఒక దశలో ప్రైవసీ కోరుకుంటారు. కాసేపు సెల్ పక్కన పెడతారు. అటువంటి సమయాల్లో ఉపయోగపడేలా, ఇన్విజబుల్, లాక్ స్క్రీన్ తదితర సదుపాయాలను కల్పిస్తూ, ఇన్ కాగ్నిటో మోడ్ ను అల్లో వెంట తెచ్చింది. Google Allo యాప్‌‌లో ఏర్పాటు చేసిన Incognito Mode ఫీచర్ ద్వారా ప్రైవేట్ చాట్ సాధ్యమవుతుంది. ఈ మోడ్‌లో చాట్ చేస్తున్నపుడు సెండర్ పేరు మీద నోటిఫికేషన్స్ కూడా డిస్‌ప్లే అవ్వవు.

ఎండ్ టూ ఎండ్

ఎండ్ టూ ఎండ్

Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు End-to-end encryption ఉంటుంది. వీటిని కనీసం గూగుల్ కూడా చదవలేదు. ఇదే ఫీచర్ ని వాట్సప్ కూడా ప్రవేశపెట్టింది.అయితే జియో ఛాట్ లో ఈ ఫీచర్ లేదు.

Set Messages to disappear

Set Messages to disappear

Google Allo యాప్‌‌లో సెక్యూరిటీకి మరింత పెద్దపీట వేసారు. End-to-end encryption,Incognito Modeల‌తో పాటు కొంత సమయం తరువాత మెసేజ్‌లు వాటంతటకవే డిలీట్ అయిపోయే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. End-to-end encryption,Incognito Modeల‌తో పాటు కొంత సమయం తరువాత మెసేజ్‌లు వాటంతటకవే డిలీట్ అయిపోయే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు.

ఇమేజ్ రికగ్నిషన్:

ఇమేజ్ రికగ్నిషన్:

గూగుల్ గతంలో విడుదల చేసిన విప్లవాత్మక ఫోటోల గుర్తింపు ఫీచర్ అల్లోకు మరో ఆకర్షణ. మన స్నేహితులు, బంధువుల చిత్రాలను ఇది గుర్తిస్తుంది. ఓ కుక్కకు, మనిషికి ఉండే తేడానూ గుర్తు పడుతుంది. మీకు దగ్గరి స్నేహితుల ఫోటోలు వస్తే అలర్ట్ చేస్తుంది కూడా.ఈ ఫీచర్ మిగతా యాప్స్ లో తక్కువ

జీ మెయిల్ అకౌంట్ సింక్:

జీ మెయిల్ అకౌంట్ సింక్:

యూజర్ల జీ మెయిల్ కు వస్తున్న ఈ-మెయిల్ వివరాలను ఈ యాప్ నోటిఫికేషన్స్ రూపంలో చూపిస్తుంటుంది. ఆ మెయిల్స్ వివరాలను ఇక్కడే తెలుసుకుంటూ ఉండవచ్చు.ఈ ఫీచర్ మిగతా వాటికి లేదు.

ఆటో డిలీట్:

ఆటో డిలీట్:

పాత మెసేజ్ లను డిలీట్ చేసేలా ఆటో డిలీట్ సదుపాయం ఉంది. ఒక గంటనో, ఒక రోజనో టైం ముందుగానే సెట్ చేసి పెడితే, ఆ సమయానికి ఉన్న అన్ని పూర్వ మెసేజ్ లనూ యాప్ తుడిచేస్తుంది. దీని వల్ల ఫోన్ లోని మెమోరీ ఆదా అవుతుంది. మీరు చదవగానే డిలీట్ అయిపోవాలన్న ఆప్షన్ కూడా ఉంది. మిగతా ఫీచర్లలో మీరు డిలీట్ చేస్తేనే అవి డిలీట్ అవుతాయి. లేకుంటే అలానే ఉంటాయి. టైం సెట్టింగ్ లేదు.

ఫాంట్ సైజ్ పెంచుకునే అవకాశం:

ఫాంట్ సైజ్ పెంచుకునే అవకాశం:

యాప్ లో సమాచారం మరీ చిన్న అక్షరాల్లో ఉందని భావిస్తే, అక్షరాల సైజ్ ను పెంచుకోవచ్చు. కాని మిగతా వాటిల్లో ఆ అవకాశం లేదు. Google Allo యాప్‌ ద్వారా మీరు పంపే మెసేజ్‌లకు అదనపు హంగులను జోడించుకోవచ్చు. యాప్‌లోని మెసేజ్ సెండ్ బటన్‌ను పైకి స్లైడ్ చేయటం ద్వారా మీ మెసేజ్‌కు ‘shout' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ పెద్దదవుతుంది. సెండ్ బటన్‌ను క్రిందకు స్లైడ్ చేయటం ద్వారా ‘whisper' ఎఫెక్ట్ వస్తుంది. టెక్స్ట్ సైజ్ చిన్నదవుతుంది.

Cross-platform support

Cross-platform support

Google Allo యాప్‌‌ ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌‍లను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐఓఎస్ యూజర్లు ఆపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్‌‌ను పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Google Allo vs WhatsApp vs Reliance JioChat: 8 Major Differences You Must Know read more gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X