గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

Written By:

టెక్నాలజీలో రయ్యిమంటూ దూసుకుపోతున్న గూగుల్ తాజాగా వీడియో కాలింగ్ యాప్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్ల కోసం తొలిసారిగా ఫేస్ టైం,స్కైప్ వంటి వాటికి ధీటుగా డియో యాప్ ని ఆవిష్కరించింది. మూడు నెలల ముందే ఈ యాప్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపిన గూగుల్ ఇప్పుడు అందుబాటులోకి తెచ్చింది. యాప్ ఎలా పనిచేస్తుందో ఓ సారి చూద్దాం.

త్వరలో సెకన్‌కు 2జిబి వైర్‌లెస్ డేటా స్పీడ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

ఇతరులతో ముఖాముఖి మాట్లాడుకునేందుకు వీడియో కాలింగ్ సౌకర్యం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఇతరులను సులభంగా ఆహ్వానించేందుకు వీలుగా గూగుల్ కొత్త యాప్ 'డుయో' లో ఇంటర్ఫేస్ ను రూపొందించారు.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకోసం రూపొందించిన 'డుయో' ను ఇండియాలో ప్రారంభించిన సంస్థ.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

భద్రత, గోప్యతలను కాపాడేందుకు వీలుగా అన్ని 'డుయో' కాల్స్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అయి ఉంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఇతర యూజర్ నేమ్, అకౌంట్ వంటివి అవసరం లేకుండానే యూజర్లు తమ ఫోన్ నెంబర్ తో ఈ వీడియో కాలింగ్ ప్రయోజనాలను వాడుకోవచ్చు.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

దీంతో పాటు డుయో యాప్ ద్వారా గూగుల్ 'నాక్ నాక్' పేరిట మరో కొత్త ఫీచర్ ను కూడా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో కాలర్స్ సమాధానం ఇచ్చేందుకు ముందే.. కాల్ చేసినవారి లైవ్ వీడియో కనిపించే అవకాశం ఉంటుంది.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

ఈ డుయో నెమ్మదిగా ఉండే నెట్వర్క్ ల్లో కూడా వేగంగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు గూగుల్ చెప్తోంది. అంతేకాక నెట్వర్క్ కనెక్షన్లకు అనుగుణంగా కాల్ క్వాలిటీ కూడా మారేట్టు డుయోను రూపొందించామని కంపెనీ చెబుతోంది.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

దీనికి తోడు రిజల్యూషన్ కూడా తగ్గించుకొని మృదువుగా మాట్లాడుకునే అవకాశం డుయోలో ఉన్నట్లు గూగుల్ తెలిపింది.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

మరోవైపు డుయో వైఫై, సెల్యులార్ డేటాల మధ్య స్వయంచాలకంగా మారుతుందని, దీంతో వీడియో కాల్ మాట్లాడుతుండగా కట్ అయ్యే అవకాశం ఉండదని గూగుల్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ అమిత్ ఫూలే తెలిపారు.

గూగుల్ నుంచి వీడియో కాలింగ్..ఫీచర్లు అదుర్స్

ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ కమింగ్ సూన్ అని చూపిస్తోంది. అందులో కనిపించే ఫ్రీ రిజిష్టర్ లో మీరు రిజిస్టరయితే యాప్ ఓపెన్ కాగానే మీకు అలర్ట్ మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Google launches Duo to take on Apple’s FaceTime, Skype
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot