త్వరలో సెకన్‌కు 2జిబి వైర్‌లెస్ డేటా స్పీడ్

Written By:

వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్‌ల డేటా స్పీడ్ విషయంలో పెనుమార్పులు రాబోతున్నాయి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఇటీవల ఓ కొత్త పదార్ధాన్ని అభివృద్ధి చేశారు. ఈ కొత్త పదార్థం ఇంటర్నెట్ డేటా స్పీడ్‌ను సెకన్‌కు రెండు గిగాబైట్ల(జీబీ) వరకు పెంచుతుందని గుర్తించారు. వీరు తయారు చేసిన నానో క్రిస్టలిన్ మెటిరియల్.. బ్లూలైట్‌ను వేగంగా వైట్‌లైట్‌గా మార్చుతుందని, దీంతో డేటా స్పీడ్‌ అసాధారణంగా పెరుగుతుందని వెల్లడించారు. బ్లూటూత్, వైఫై లాంటి టెక్నాలజీల వినియోగంలో విద్యుదయస్కాంత తరంగాల తరంగదైర్ఘ్యాన్ని తగ్గించడం ద్వారా సమాచార బదిలీలో వేగాన్ని పెంచొచ్చని పరిశోధకులు వెల్లడించారు. ఈ ప్రక్రియ అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదని ప్రొఫెసర్ బూన్ ఊయ్ తెలిపారు.

వైఫై గురించి మీకు తెలియాల్సిన 10 విషయాలు

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా..దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కింది చిట్కాలు పాటిస్తే మీ వైఫై వేగవంతంగా పనిచేసే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

మీ ఇంట్లో వైఫై ని ఎక్కడ పెడుతున్నారో ఓ సారి చెక్ చేసుకోండి. ఇంటి మధ్య భాగంలో వైఫైని సెట్ చేస్తే అన్ని చోట్లా అందుతుంది.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

టీవీల దగ్గర వైఫై రూటర్ ని ఉంచండం వల్ల సిగ్నల్స్ సరిగా రావు..సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

లేటెస్ట్ వైఫై టెక్నాలజీని వాడటం మీ కంప్యూటర్ హర్డ్ వేర్ కు కూడా మంచిది.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

మీరు కరక్ట్ గా వాడుతున్న వైఫై ఛానల్ ని సెట్ చేయడం వల్ల మీ పని మరింత సులువు అవుతుంది. ఇందుకోసం వైఫై ఎనలైజర్ ను వాడండి.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

వైఫై ని ఎప్పుడూ పైనే ఉంచండి. కింద ఉంచడం వల్ల సిగ్నల్స్ అంత తొందరగా అన్ని చోట్లకు రావు.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

రూటర్ కు దగ్గర్లో మీరు ఎటువంటి పరికరాలు ఉంచకండి అలా ఉంచడం వల్ల సిగ్నల్స్ త్వరగా అందుకోవు.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా

మీరు మీ పాస్ వర్డ్ ని వీలయినంత సీక్రెట్ గా ఉంచుకోవడం మంచింది.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా..

వైఫై త్వరగా మీ దగ్గరకు చేరుకోవాలంటే ప్లగ్ కనక్షన్ బాగుండాలి..మంచి ప్లగ్ లు వాడటం తప్పనిసరి

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా..

మీ వైఫై సిగ్నల్ ఎక్కడ వీక్ గాఉందో తెలుసుకోవడం కోసం మెసేజ్ సెట్ చేసుకోండి.

మీ ఇంట్లో వైఫై స్లోగా వస్తుందా..

మీ వైఫై ఫాస్ట్ గా రావాలంటే రూటర్ సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

 

English summary
Here Write New material may lead to internet data speed of 2GB per second
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot