Google Pay లో కొత్త ఫీచర్స్... వాటి మీద ఓ లుక్ వేయండి...

|

ఇండియాలో డిజిటల్ పెమెంట్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి గూగుల్ పే యాప్ ద్వారా ఆన్‌లైన్ పెమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది UPI ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి డబ్బును బదిలీ చేయడానికి మద్దతు ఇస్తుంది. దీనితో పాటుగా యుటిలిటీ బిల్ పెమెంట్స్ చేయడానికి కూడా వివిధ రకాల ఎంపికలను కలిగి ఉంటుంది.

గూగుల్ పే యాప్
 

మీరు గూగుల్ పే యాప్ ను ఉపయోగించి మీ ప్రీపెయిడ్ మొబైల్స్ మరియు DTH అకౌంట్లను కూడా రీఛార్జ్ చేయవచ్చు. ఆన్‌లైన్ పెమెంట్స్ యాప్ గూగుల్ పేకు ఇప్పుడు కొత్తగా మరొక నాలుగు ఫీచర్లను జోడించాలని గూగుల్ చూస్తున్నట్లు సమాచారం. 2020 నుంచి ఉహించిన ఈ ఫీచర్స్ యాప్ లో అందుబాటులో ఉంటాయి.

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019.... వీటి మీద ఆఫర్లే ఆఫర్లు

2020లో కొత్త ఫీచర్స్

2020లో కొత్త ఫీచర్స్

2020 స్టాంప్ రివార్డులు

ఈ సంవత్సరం దీపావళికి ప్రకటించిన స్టాంప్ రివార్డ్స్ అత్యంత విజయవంతమైంది. వినియోగదారులు రంగోలి స్టాంప్‌ను గెలుచుకోవడానికి తమ అదృష్టాన్ని చాలా బాగా ప్రయత్నించారు. గూగుల్ పే దీపావళికి వివిధ రకాల 5 నేపథ్య స్టాంపులను సేకరించే పనిని ఇచ్చింది. ఆ తర్వాత వినియోగదారులకు 251 రూపాయలను బహుమతిగా అందించింది. 2020 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇదే తరహాలో గూగుల్ పే స్టాంప్ రివార్డులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. XDAD డెవలపర్లు యాప్ యొక్క v49 లో వీటికి సంబందించిన సమాచారాన్ని గుర్తించారు.

పాత ధరల వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఇప్పటికి అందిస్తున్న రిలయన్స్ జియో

ట్యాప్-టు-పే కోసం కార్డ్ మద్దతు

ట్యాప్-టు-పే కోసం కార్డ్ మద్దతు

శామ్‌సంగ్ పేలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ యాప్ లో క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను జోడించగల సామర్థ్యం కలిగి ఉండడం. ఇది వినియోగదారులు వారి కార్డును భౌతికంగా స్వైప్ చేయకుండా చెల్లించే మద్దతును కలిగి ఉంది. గూగుల్ పే కూడా ఇలాంటి ఫీచర్ ను తీసుకువస్తున్నట్లు తెలిసింది. కాకపోతే ఇది కేవలం వీసా కార్డులకు మాత్రమే మద్దతు ఇస్తుంది.

వన్ టైమ్ మాన్డేట్
 

వన్ టైమ్ మాన్డేట్

UPI 2.0 తో రూపొందించిన ఫీచర్ ఇది. ఇది లావాదేవీని ముందస్తుగా యాక్సిస్ చేయడానికి మరియు వారి అకౌంట్ లో నిధులను బ్లాక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దాని తరువాత డబ్బులను డెబిట్ చేయవచ్చు. లావాదేవీలు అమలు అయ్యే వరకు మీ అకౌంట్ లో మీకు తగినంత నిధులు ఉన్నాయని ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది. మీరు లావాదేవీని షెడ్యూల్ కూడా చేయవచ్చు. తరువాత అది ఆటొమ్యాటిక్ గా అమలు అవుతుంది.

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...

స్టోరీస్ ఫర్ మెర్చెంట్

స్టోరీస్ ఫర్ మెర్చెంట్

ఇది వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్న ఫీచర్. ఇది వివిధ రకాల కథలను జోడించడానికి వీలు కల్పిస్తుంది. ఇప్పుడు సోషల్ ప్లాట్ ఫామ్ ల మీద ఏవైనా స్టోరీస్ రావడం సర్వసాధారణం. గూగుల్ పే స్టోరీస్‌తో వ్యాపారులు వీడియో హైలైట్‌లు మరియు కొనసాగుతున్న ఆఫర్స్ , డిస్కౌంట్లు మరియు కొత్త ఉత్పత్తుల యొక్క వివరాలను ఫొటోల రూపంలో కూడా జోడించవచ్చు.

ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ అన్ని ఎప్పుడు విడుదల అవుతాయనే దానిపై ఎటువంటి వివరణ లేదు. కానీ గిజ్ బాట్ తెలుగును ఫాలో అవ్వండి. ఈ కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చినప్పుడు మేము మా పాఠకుల కోసం ముందుగా పోస్ట్ చేస్తాము.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pay's new features that could be seen in 2020

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X