గూగుల్ కొత్త యాప్ అదిరింది

Written By:

సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ తన వినియోగదారుల కోసం సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 'గూగుల్ ఫొటో స్కాన్' పేరుతో వచ్చిన ఈ యాప్ ద్వారా ఫొటోలను స్కాన్ చేసుకోవచ్చు. అలాగే స్కాన్ చేసుకున్న ఫొటోలను మనకు కావాల్సిన విధంగా తిప్పుకునే అవకాశం కూడా ఉంది.

రూ.149కే ఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్,సర్వం సిద్ధం

గూగుల్ కొత్త యాప్ అదిరింది

దీంతో పాటు స్కాన్ చేసిన ఫోటోలను సేవ్ చేయగానే గూగుల్ ఫొటోస్ అంత క్వాలిటీతో అవి సేవ్ అయిపోతాయి. మన పాత ఆల్బమ్స్ లోని ఫోటోలను డిజిటల్ రూపంలో భద్రంగా దాచుకోవడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని గూగుల్ ప్రతినిధులు చెబుతున్నారు.గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

వాట్సప్ వీడియో కాలింగ్ వచ్చేసింది: పొందండిలా..

గూగుల్ చరిత్రలో కొన్ని ఆసక్తికర నిజాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం

ఓ గూగుల్ ఉద్యోగి మరిణిస్తే అతను లేదా ఆమె జీవిత భాగస్వామికి 10 సంవత్సరాల పాటు గూగుల్ సగం జీతం చెల్లిస్తుంది. సదురు ఉద్యోగి పిల్లలకు 19 సంవత్సరాల వచ్చేంత వరకు నెలకు 1,000 డాలర్లను గూగుల్ చెల్లిస్తుంది.

 

 

డీల్

గూగుల్ వ్యవస్థాపకులు 1999లో తమ సంస్థను ఎక్సైట్ (Excite) అనే కంపెనీకి 1 మిలియన్ డాలర్లకు విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ డీల్ కాస్త కుదరలేదు.

 

 

120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను

2020లోపు 120 మిలియన్ ప్రత్యేక పుస్తకాలను స్కాన్ చేయాలని గూగుల్ భావిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

ఒంటెను అద్దెకు

ఓ ఎడారికి సంబంధించి స్ట్రీట్ వ్యూను సృష్టించే క్రమంలో గూగుల్ ఒంటెను అద్దెకు తీసుకుంది.

 

 

ఏప్రిల్ ఫూల్స్ డే

జీమెయిల్‌ను 2004 ఏప్రిల్ 1న ఆవిష్కరించారు చాలా మంది ఈ ఆవిష్కరణను ఏప్రిల్ ఫూల్స్ డే చమత్కారంగా భావించారు.

 

 

స్మార్ట్ కంప్యూటర్

గూగుల్ మొదటి కంప్యూటర్ స్టోరేజ్ ను LEGO సంస్థ రూపొందించింది.అలాగే గూగుల్ అభివృద్థి చేస్తోన్న ఓ స్మార్ట్ కంప్యూటర్ తనను తానే ప్రోగ్రామ్ చేసుకోగలదు.

గూగుల్ సర్వర్లు

2013, ఆగష్ట్ 16న గూగుల్ సర్వర్లు 5 నిమిషాల పాటు డౌన్ అయ్యాయి. ఆ సమయంలో గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ 40 శాతానికి పడిపోయింది.

 

 

ఒక్క సెకను కాలంలో

ఏదైనా శోధనా ప్రశ్నకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలను బట్వాడా చేసే క్రమంలో గూగుల్ 200 కారకాలను పరిగణలోకి తీసుకుని కేవలం ఒక్క సెకను కాలంలో అత్యుత్తమ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Google's new PhotoScan app makes it easy to digitize old prints read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot