రూ.149కే ఫోన్, కేబుల్ టీవీ, ఇంటర్నెట్,సర్వం సిద్ధం

Written By:

ఆంద్రప్రదేశ్ కు కొత్త వెలుగులు రానున్నాయి. సరికొత్త ఉషోదయం వైపు అడుగులు వేస్తున్న నవ్యాంధ్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా పైబర్ గ్రిడ్ వెలుగులు అందనున్నాయి. ఇందులో భాగంగా ఇంటి ఇంటికీ కేవలం రూ. 149కే ఫోన్ సౌకర్యంతో పాటు కేబుల్ టీవీ, అలాగే ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. ఈ సాంకేతిక విప్లవానికి అతి త్వరలో అంకురార్పణ జరగనుందని తెలుస్తోంది.

జియో సేవలు ఆపేస్తున్నారు.. ఎందుకో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సాంకేతిక విప్లవానికి నాంది

సంక్రాంతి నాటికి ఏపీ రాష్ట్రమంతా సాంకేతిక విప్లవానికి నాంది పలికేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. దీనికి అవసరమైన రుణం అలాగే ఇతర ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోద ముద్ర వేసింది.

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు

దీనికి సంబంధించిన వివరాలను మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పైబర్ గ్రిడ్ సీఈవో సాంబశివరావు మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు బ్యాంకుల నుంచి రూ .300 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నుంచి రూ .100 కోట్లు ... వెరసి రూ .400 కోట్ల రుణం తీసుకుంటారని తెలుస్తోంది.

టీవీ ప్రసారాలు, వైఫై, ఇంటర్నెట్, టెలిఫోన్

అదేవిధంగా టీవీ ప్రసారాలు, వైఫై, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవల కోసం పది లక్షల ఐపీటీవీ, జీపాన్ బాక్సులు కొనుగోలు చేస్తారు. వీటి ద్వారా పది లక్షల మంది వినియోగదారులకు సేవలు అందిస్తారు. బహిరంగ మార్కెట్లో జీపాన్ బాక్కు ఒక్కటే రూ .14,500 ఉంటుంది.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ .4 వేలకే

ఫైబర్ గ్రిడ్ కింద రెండు బాక్సులనూ సాఫ్ట్వేర్తో కలసి రూ .4 వేలకే అందచేస్తారు. ఒకేసారి రూ .4 వేలు చెల్లించే వినియోగదారులకు తొలి ప్రాధాన్యం ఇస్తారు.

ఒకేసారి చెల్లించలేని వాళ్లు

ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించలేని వాళ్లు తొలుత రూ .1700 చెల్లించి, మిగిలింది నెలకు రూ .99 చొప్పున మూడేళ్లపాటు విడతల వారీగా చెల్లించవచ్చు. దీంతో పాటు రూ .500 చెల్లించి ... నెలకు రూ .99 చొప్పున నాలుగేళ్లపాటు సులభవాయిదాల్లోనూ చెల్లించే వీలుంది.

కనీసం 7 వారాలు

చైనా నుంచి ఈ బాక్సులు దిగుమతి చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ బాక్సులు వచ్చేందుకు కనీసం 7 వారాలు పడుతుందని పైబర్ గ్రిడ్ సీఈఓ తెలిపారు. 

జనవరి మొదటి వారంలో అందుబాటులోకి

అందువల్ల, రాష్ట్రంలో టీవీ ప్రసారాలు, టెలిఫోన్, ఇంటర్నెట్ సేవలు జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, సంక్రాంతి నుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించాలని పైబర్ గ్రిడ్ అధికారులు భావిస్తున్నారు.

నవ్యాంధ్ర టెక్నాలజీని

అదే జరిగితే నవ్యాంధ్ర టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఖాయం..వెలుగులు విరజిమ్మడం ఖాయం.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Get Internet, Phone, Cable TV connections only Rs 149 per month APSFL Fibernet Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting