వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

Written By:

వాట్సప్..వాట్సప్...ఇది లేకుండా ఏ మొబైల్ ఉండదంటే నమ్మాల్సిందే...ప్రతి ఒక్కరూ మొబైల్ కొనగానే ముందుగా ఇన్ స్టాల్ చేసుకునేది ఈ ఫీచర్ నే..అయితే దీనిలో ఎన్నో రకాల ఫీచర్స్ ఉన్నాయి. చాలామంది దీన్ని వాడుతున్నా ఈ యాప్ గురించిన పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. అయితే వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్ కొన్నింటిని మీకందిస్తున్నాం. ఓ లుక్కేయండి.

Read more: మీ జనరల్ నాలెడ్జిని మరింతగా పెంచే యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్రాడ్ కాస్ట్ లిస్ట్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

దీని ద్వారా మీరు ఎవరో తెలియకుండా అందరికీ మెసేజ్ లు పంపవచ్చు. అంటే మీ నెంబర్ కూడా వారికి తెలియదు. ఒక మెయిల్ లాగా ఇది ఉంటుంది. దీనికోసం మీరు Go to Chats -> Broadcast Lists -> New List -> add contacts చేసుకుని మీ మెసేజ్ ని పంపవచ్చు.

బోల్డ్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు వాట్సప్ లో ఢిపరెంట్ గా టైప్ చేయాలనుకుంటున్నారా..బోల్డ్ అలాగే ఇటాలిక్ తో పాటు స్ట్రయిక్ ద్రోని టైప్ చేయాలంటే మీరు చేయొచ్చు. బోల్డ్ గా టైప్ చేయాలనుకుంటే *love*,ఇటాలిక్ అయితే _italics_ , ~strikethrough~ని ఇలా టైప్ చేస్తే చాలు. రెండూ కావాలనుకుంటే _*bolditalics*_ ఇలా టైప్ చేయండి.

ఎక్కువగా ఎవరితో గడిపారు

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు ఎక్కువగా ఎవరితో మాట్లాడారో అలాగే ఎవరితో చాట్ చేశారో తెలుసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Storage Usageలో కెళ్లి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది ఐఓఎస్ మాత్రమే లభిస్తుంది.

మీ డేటా

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీ డేటా వాడకం ఎంత జరిగిందో తెలుసుకోవాలనుకుంటే Settings -> Data Usage -> Network Usage. లో కెళ్లి మీరు తెలుసుకోవచ్చు.

మ్యూట్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు గ్రూప్ మెసేజ్ లతో విసిగిపోతో దాన్ని మ్యూట్ లో పెట్టుకోవచ్చు. వన్ ఇయర్ వరకు మీకు ఎటువంటి అంతరాయం కలగకుండా మ్యూట్ లో పెట్టుకునే ఛాన్స్ ఉంది.

పర్సనల్ ఇన్ఫర్ మేషన్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీ ఇన్ఫర్ మేషన్ అందరికీ తెలియకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Account -> Privacy and change లో కెళ్లి అక్కడ కనిపిస్తున్న వాటిమీద క్లిక్ చేసి మై కాంటాక్ట్స్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

డాక్యుమెంట్ షేర్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు గూగుల్ డ్రైవ్ లో నుంచి నేరుగా వాట్సప్ లోకి ఏదైనా ఫైల్ షేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆ ఫైల్ దగ్గర లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి షేర్ డాక్యుమెంట్ సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

బ్లూ ట్రిక్స్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు ఈ బ్లూ ట్రిక్స్ కనపడకుండా చేసుకోవాలనుకుంటే Settings -> Account -> Privacy and toggle Read Receipts off చేస్తే సరిపోతుంది.

ఇన్ కమింగ్ పిక్చర్స్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీ ఫోన్లో ఇన్ కమింగ్ పిక్చర్స్ అలాగే వీడియోస్ సేవ్ కాకుండా సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> data usage -media auto download లో కెళ్లి సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు క్లిక్ చేస్తేనే అవి డౌన్ లోడ్ అవుతాయి.

షార్ట్ కట్ చాట్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు ఎప్పుడూ చాట్ చేసే వారిని మీ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings -> Notifications లో కెళ్లి మీరు show popup మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు కూడా మెసేజ్ చేయవచ్చు. ఐఓఎస్ లో ఇది కుదరదు. మూడో పార్టీని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

వాట్సప్ వెబ్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు మీ వాట్సప్ ని వెబ్ లో కూడా వాడుకోవచ్చు.

ఫైల్ ట్రాన్స్ ఫర్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు మీ ఫైల్ ను ఫోన్ కి అలాగే కంప్యూటర్ కి ట్రాన్సఫర్ చేసుకోవచ్చు కూడా.

హార్ట్

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

మీరు మీ ప్రేయసికి కావలసిని వారికి హార్ట్ సింబల్ పంపుకునే అవకాశం కూడా ఉంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

వాట్సప్‌లో దాగిన సీక్రెట్ ఫీచర్స్

టెక్నాలజీ గురించి లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write hidden whatsapp features that everyone should know about
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot