హానర్ 7 ఎక్స్ పై భారీ ఆఫర్లు! మార్చి 1వరకే!

By Madhavi Lagishetty
|

ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ హానర్ 7ఎక్స్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది. 64జిబి వేరియంట్ అయిన 7ఎక్స్ పై ఈ నెల 22నుంచి మార్చి1 వరకు అమెజాన్. ఇన్ లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. యూజర్లు పాత మొబైల్స్ ఎక్స్ ఛేంజ్ చేసుకోవడం ద్వారా 2వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్లకు ఎలాంటి ఈఎంఐ సదుపాయం లేదని కంపెనీ స్పష్టం చేసింది.

 

హానర్ 7ఎక్స్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే...1080,2160పిక్సెల్స్ రిజల్యూషన్ తో వస్తుంది. 18:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన ఈ స్మార్ట్ ఫోన్....5.93అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ల్పేతో యూజర్లకు అట్రాక్ట్ చేస్తుంది. 4జిబి ర్యామ్, 1.7గిగా ఆక్టా కోర్ హైసిలికన్ కిరిన్ 659ప్రొసెసర్ తో వస్తుంది. 32జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తోపాటు మైక్రో ఎస్డి కార్డును ఉపయోగించి 256జిబి వరకు విస్తరించుకోవచ్చు.

బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్బడ్జెట్ ఫోన్లలో ఆల్‌రౌండర్ హానర్ 9 లైట్

 హానర్ 7 ఎక్స్ పై భారీ ఆఫర్లు! మార్చి 1వరకే !

16మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరాలతో పర్ఫెక్ట్ పిక్చర్స్ తీసుకోవచ్చు. సెల్ఫీ కోసం ప్రత్యేకంగా ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0పై రన్ అవుతుంది. ఇక కనెక్టివిటీ కోసం వై-ఫై, జిపిఎస్, బ్లూటూత్, యూఎస్బి, OTG,3జి, 4జికి సపోర్ట్ ఇస్తుంది.

ఈ డివైసు 165.00 గ్రాముల బరువు ఉంటుంది. 3340ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ అందిస్తుంది. ఈమధ్యే హానర్ 8 ప్రో, హానర్9 స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 8.0 ఓరెయోతో అప్ డేట్ కూడా చేసింది.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ప్రస్తుతం లండన్ తోపాటు ఇండియాలో అప్ డేట్ ను అందుకున్నాయి. హానర్ 8 ప్రో యూజర్లు కూడా ఈ అప్ డేట్ ను అందుకున్నట్లు కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Honor Huawei's e-brand for digital natives, has announced a discount offer for consumers on one of its mid-range smartphone, Honor 7X. The discount offer is applicable to the 64 GB variant of Honor 7X and will be available starting 22nd February until 1st March on Amazon.in.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X