Instagram లో కొత్త ఫీచర్!! తొలగించిన కంటెంట్‌ను పొందే అవకాశం...

|

ఇన్‌స్టాగ్రామ్ తన వినియోగదారుల కోసం క్రొత్తగా మరొక ఫీచర్‌ను రూపొందిస్తోంది. దీని యొక్క వివరాల విషయానికి వస్తే గత 30 రోజులుగా తొలగించిన కంటెంట్‌ను తిరిగి పొందడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ను యాప్ లోని సెట్టింగ్ ఎంపికల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇది తొలగించిన ఫోటోలు, వీడియోలు, రీల్స్ మరియు IGTV వీడియోలకు వర్తిస్తుంది. వినియోగదారులు తన యొక్క స్టోరీలను కూడా పునరుద్ధరించవచ్చు. కానీ స్టోరీలు ఫోల్డర్‌లో 24 గంటలు మాత్రమే ఉంటాయి. అకౌంటులోని పోస్ట్‌లను హ్యాకర్లు తొలగించకుండా నిరోధించడానికి ఇన్‌స్టాగ్రామ్ తన రక్షణ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.

 

ఇన్‌స్టాగ్రామ్ రీసెంట్ డెలిట్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ రీసెంట్ డెలిట్ ఫీచర్

ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించబడిన ఫోటోలు, వీడియోలు, రీల్స్, ఐజిటివి వీడియోలు మరియు స్టోరీలు ఏవైనా ఉన్నప్పుడు అవి వెంటనే అకౌంట్ నుండి తొలగించబడతాయి. దీని తరువాత ఇవి ఇటీవల తొలగించిన ఫోల్డర్‌కు తరలించబడతాయి. అక్కడ నుండి వాటిని 30 రోజుల వ్యవధిలో తిరిగి పొందవచ్చు. అయితే అవి 30 రోజుల తరువాత స్వయంచాలకంగా తొలగించబడతాయి. స్టోరీలను 24 గంటల వరకు మాత్రమే యాక్సెస్ చేయవచ్చు మరియు తిరిగి పొందవచ్చు.

తొలగించిన కంటెంట్‌ను పొందే పద్ధతులు

తొలగించిన కంటెంట్‌ను పొందే పద్ధతులు

తొలగించబడిన కంటెంట్‌ను యాక్సిస్ చేయడానికి వినియోగదారులు యాప్ యొక్క తాజా వెర్షన్‌లో సెట్టింగ్‌లు> అకౌంట్> రీసెంట్లి డెలిట్ పద్ధతులు అనుసరించి తొలగించిన కంటెంట్‌ను శాశ్వతంగా తిరిగి పొందడానికి ఎంచుకోవచ్చు. మీరు రీస్టోర్ చేస్తున్న పోస్ట్ మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ గ్రిడ్ నుండి తొలగించబడితే కనుక ప్రజలు దీన్ని మళ్లీ ఇక్కడ చూడవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ ప్రొటెస్ట్ ఫీచర్
 

ఇన్‌స్టాగ్రామ్ ప్రొటెస్ట్ ఫీచర్

హ్యాకర్లు వినియోగదారుల యొక్క పోస్ట్‌లను తొలగించకుండా నిరోధించడానికి రక్షణ వ్యవస్థను జోడిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల ప్రకటించింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సంస్థ ఇటీవల తొలగించిన వాటి నుండి కంటెంట్‌ను శాశ్వతంగా తొలగించేటప్పుడు లేదా రిస్టోర్ చేసేటప్పుడు వారు సరైన ఖాతాదారులు అవునా కదా అని ధృవీకరించమని ప్రజలను అడుగుతుందని తెలిపారు.

Best Mobiles in India

English summary
Instagram Introduced “Recently Deleted” New Feature For Restoring Lost 30 Days Delete Content

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X