ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ బూమరాంగ్‌ల కోసం టిక్‌టాక్‌ను పోలిన కొత్త ఫీచర్‌లు

|

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ బూమేరాంగ్ స్టోరీస్లను షేర్ చేయడానికి కొత్తగా మూడు ఎంపికలను ప్రవేశపెడుతోంది. వీటిలో స్లోమో, ఎకో మరియు డుయో వంటి ఎంపికలు ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఎడిటింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది వీడియో యొక్క పొడవును కత్తిరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్
 

మీ ఇన్‌స్టాగ్రామ్ కెమెరా మీ గురించి వ్యక్తీకరించడానికి మరియు మీరు ఏమి చేస్తున్నారో,ఏమి ఆలోచిస్తున్నారో లేదా ఎటువంటి అనుభూతిని పొందుతున్నారో వంటి వివరాలను మీ స్నేహితులతో సులభంగా పంచుకునే మార్గాలను ఇస్తుంది. బూమేరాంగ్ అనేది ఇందులో ఒక ఐకానిక్ భాగం మరియు అత్యంత ప్రియమైన కెమెరా ఫార్మాట్లలో ఒకటి. దీని యొక్క సృజనాత్మకతను విస్తరించడానికి ఇన్‌స్టాగ్రామ్ ఉత్సాహంగా ఉంది. రోజువారీ అద్భుత క్షణాలను ఆహ్లాదకరంగా మరియు ఉహించనిదిగా మార్చడానికి బూమేరాంగ్‌ను ఉపయోగించడానికి మీకు కొత్త మార్గాలను ఇస్తుంది.

క్రొత్త ఫీచర్లు

క్రొత్త ఫీచర్లు

ఈ క్రొత్త ఫీచర్లు టిక్‌టాక్ నుండి ప్రేరణ పొందినట్లు కనిపిస్తాయి. ఇవి అన్ని బూమేరాంగ్ ఫీచర్లలో అందుబాటులో ఉన్నాయి. స్లోమో ఫీచర్ తో బూమేరాంగ్ వీడియోలను వాటి అసలు వేగంలో సగానికి తగ్గించవచ్చు. రెండవది ఎకో ఫీచర్ డబుల్ విజన్ ప్రభావాన్ని సృష్టిస్తుంది. చివరగా డుయో అనేది బూమేరాంగ్‌ను వేగవంతం మరియు నెమ్మదించడాన్ని చేస్తాయి. అలాగే ఇందులో ఏదైనా టెక్స్ట్ మెసేజ్ ప్రభావాన్ని జోడించడానికి కూడా అనుమతిని ఇస్తుంది.

గూగుల్ మ్యాప్స్ ద్వారా పార్కింగ్ అందుబాటును తెలుసుకోవడం ఎలా?

కొత్త అప్డేట్

కొత్త అప్డేట్

ఇన్‌స్టాగ్రామ్ యొక్క కొత్త అప్డేట్ తో రికార్డ్ చేయబడిన బూమేరాంగ్‌ల పొడవును కత్తిరించడం మరియు సర్దుబాటు చేయడం వంటి ఫీచర్లను కూడా అనుమతిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై కొత్త ప్రభావాలు ఓవర్-ది-ఎయిర్ (OTA) నవీకరణగా వస్తాయి.

కనీస రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన ఎయిర్‌టెల్ & వొడాఫోన్ ఐడియా

కొత్త ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి
 

కొత్త ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి

**** ఇన్‌స్టాగ్రామ్ యొక్క ఈ క్రొత్త ఫీచర్‌లను యాక్సిస్ చేయడానికి ఎప్పటిలాగే బూమేరాంగ్ తీసుకోండి. స్టోరీ కెమెరాను ఓపెన్ చేసి కరౌసెల్ పై "బూమేరాంగ్" కు స్వైప్ చేయండి. తరువాత షట్టర్ బటన్‌ను నొక్కండి లేదా దాన్ని నొక్కి పట్టుకోండి. తరువాత కొత్త ఎఫెక్ట్ లను యాక్సిస్ చేయడానికి డిస్ప్లే యొక్క పైభాగంలోని ఇన్ఫినిటీ గుర్తును నొక్కండి.

తక్కువ ధరకు రోజుకు 2GB & 3GB డేటాను అందిస్తున్న రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు

లేఅవుట్

**** ఇన్‌స్టాగ్రామ్ ఇటీవలే కొత్తగా "లేఅవుట్" అనే ఫీచర్‌ను కూడా విడుదల చేసింది. ఇది ఒకే స్టోరీస్ లో అనేక ఫోటోలను చేర్చడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీనితో వినియోగదారులు ఇప్పుడు ఆరు వేర్వేరు ఫోటోలతో తమ స్టోరీస్ లను సృష్టిస్తున్నారు. అయినప్పటికీ ఈ క్రొత్త ఫీచర్ ఇప్పటికే మూడవ వేరు వేరు పార్టీ యాప్ లలో ఇలాంటి ఫోటోలను రూపొందించడానికి ఉంది.

Amazon Great Indian Sale వచ్చేస్తోంది!!! ఆఫర్ల మీద ఓ లుక్ వేసుకోండి!!!

స్టోరీస్

ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ కెమెరాను ఓపెన్ చేసి ఫోటోలను మిక్స్ చేయడానికి వినియోగదారుడు చేయాల్సిందల్లా "లేఅవుట్"ను ప్రారంభించి అది పూర్తయిన తర్వాత స్టోరీను మిగతా వాటిలాగే పబ్లిష్ చేయడం.

Most Read Articles
Best Mobiles in India

English summary
Instagram Stories Brings New Features for Boomerangs Like as new TikTok

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X