ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ వేగవంతం, కొత్త యాప్ రెడీ

Written By:

ఇకపై ప్రయాణికులు రైల్వే టికెట్ బుకింగ్‌ను వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త టికెటింగ్ యాప్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు రైత్వేశాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతమున్న టిక్కెట్ బుకింగ్ యాప్‌కు మరిన్ని కొత్త ఫీచర్లను కలుపుతూ ఈ యాప్‌ను ఐఆర్‌సీటీసీ ఆవిష్కరించనుంది.

టిమ్ కుక్‌కి ఝలక్ ఇచ్చిన ఆపిల్

ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ వేగవంతం, కొత్త యాప్ రెడీ

లేటెస్ట్ టెక్నాలజీతో ఈ యాప్‌ను రూపొందిస్తున్నామని, మరింత వేగవంతంగా, సులభతరంగా ఐఆర్‌సీటీసీ ద్వారా ఇక టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుండటంతో ఈజీ ఆన్‌లైన్ ట్రైన్ టిక్కెట్ బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ అధికారికంగా ఈ రైల్ కనెక్ట్ యాప్‌ను వచ్చే వారంలో ప్రారంభించనుందని పేర్కొన్నారు.

జియోపై సర్వే చెప్పిన నిజాలు

ఇకపై రైల్వే టికెట్ బుకింగ్ వేగవంతం, కొత్త యాప్ రెడీ

తర్వాత తరం ఈ-టిక్కెటింగ్ సిస్టమ్ ఆధారంతో దీన్ని తీసుకొస్తున్నారు. రైల్వే టిక్కెట్లను సెర్చ్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి ఈ యాప్ ప్రయాణికులకు ఉపయోగపడనుంది. టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఐఆర్‌సీటీసీ కల్పించనుంది. ఈ కొత్త అప్లికేషన్ ద్వారా తర్వాత చేయబోయే ప్రయాణ అలర్ట్‌లను పొందవచ్చు.

English summary
IRCTC to launch new App for faster booking of tickets read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot