టిమ్ కుక్‌కి ఝలక్ ఇచ్చిన ఆపిల్

Written By:

దిగ్గజ కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌కి టెక్ దిగ్గజం ఆపిల్ ఝలకిచ్చింది. కంపెనీని లాభాల బాటలో నడపలేకపోవడంతో ఆయన జీతంలో భారీగా కోత విధించింది. సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ కు గతేడాది 10 కోట్లు కట్ చేసినట్లు పేర్కొంది. కంపెనీని లాభాల బాటలో నడపలేకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

సాఫ్ట్‌వేర్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2016 లో టిమ్ కుక్‌కి అందించే పరిహారాలను

రెవిన్యూలు, లాభాలు లక్ష్యాలను చేధించలేకపోవడంతో 2016 లో టిమ్ కుక్‌కి అందించే పరిహారాలను ఆపిల్ తగ్గించేసింది. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్‌కు సమర్పించిన ప్రకటనలో టిమ్ కుక్ గతేడాది 2016 లో ఆర్జించిన మొత్తం పరిహారం 8.75 మిలియన్ డాలర్ల (రూ 59 కోట్లకుపైగా) గా ఆపిల్ పేర్కొంది.

ఏడాదికి ఆయనకు అందే పరిహారం

ఆయన జీతం 1 మిలియన్ డాలర్లు పెరిగినప్పటికీ, ఏడాదికి ఆయనకు అందే పరిహారం మాత్రం తగ్గిపోయినట్టు చెప్పింది. 2015 లో టిమ్ కుక్ 10,28 మిలియన్ డాలర్ల (రూ .69 కోట్లకు పైగా) ఆదాయన్ని ఆర్జించారు.

కంపెనీ వార్షిక విక్రయాలు

వారి టార్గెట్ వార్షిక ప్రోత్సహకాల్లో భాగంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు 89.5 శాతం పొందుతారు. కానీ కంపెనీ వార్షిక విక్రయాలు దాదాపు 4 శాతం మందగించాయి.

నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది.

223,6 బిలియన్ డాలర్లుగా పెట్టుకున్న లక్ష్యాన్ని కంపెనీ చేధించలేకపోయింది. నిర్వహణ ఆదాయం 0.5 శాతం పడిపోయింది. మొత్తంగా 2016 లో కంపెనీ నికర విక్రయాలు, నిర్వహణ ఆదాయాలు 7.7 శాతం, 15.7 శాతం పడిపోయినట్టు ఆపిల్ పేర్కొంది.

15 ఏళ్లలో మొదటిసారి

గత 15 ఏళ్లలో మొదటిసారి ఆపిల్ తన రెవెన్యూలను కోల్పోయింది. అందుకే సీఈఓ జీతంలో కోత విధించక తప్పలేదని ఆపిల్ చెబుతోంది. 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple CEO Cook’s 2016 Pay Lower as Tech Giant Misses Targets read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot