జియో యాప్స్‌ లైవ్‌లోకి వస్తే ఇవి కనపడవు !

Written By:

జియో ఇప్పుడు మొత్తంగా దేశాన్ని ఊపేస్తున్న పదం. అందరూ ఇప్పుడు జియో వెంట పరుగులు పెడుతున్నారు. అయితే జియో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తే ఇతర కంపెనీలు నష్టాల బాటలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే జియో యాప్స్ తో కొన్ని రకాల యాప్స్ అడ్రస్ పూర్తి స్థాయిలో కనపడకపోవచ్చు కూడా..అవేంటో ఓ సారి చూద్దాం.

టాంగో, 3డీటెక్‌ ఫీచర్లు, మొబైల్ చరిత్రలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో చాట్

మీడియా వైపు చూస్తే టీవీ, వీడియో ఆన్ డిమాండ్, క్లౌడ్ ఆధార సర్వీసులు అందించే వీలుంది. అదే సమయంలో వెబ్ ఆధారిత సేవలు కూడా ఉంటాయి. ఇది వస్తే మిగతావాటికి గడ్డు కాలం తప్పదు

జియో చాట్

మొదటిసారిగా వినియోగదారులకు అందించేది మాత్రం ఆండ్రాయిడ్, ఐఓఎస్ సెల్ ఫోన్ల వినియోగదారులకు జియో చాట్ అనే మెసేజింగ్ యాప్. ఈ యాప్ రాకతో ఛాటింగ్ యాప్ లకు కష్ట కాలం తప్పదు 

 

జియోనే మొత్తం ఇండియా మార్కెట్ ని

వెంటనే మెసేజ్ పంపుకోవటం, ఉచిత ఎస్సెమ్మెస్, వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి అమల్లోకి వస్తే ఇక జియోనే మొత్తం ఇండియా మార్కెట్ ని శాసిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాట్సప్ , వుయ్ చాట్ లాంటి వాటి జోలికి వెళ్లకపోవచ్చు. 

 

 

 

 

 

వాట్సప్, వియ్ చాట్, లైన్ మెసెంజర్

ప్రధానంగా 8 కోట్ల మంది వాడకందారులున్న వాట్సప్, వియ్ చాట్, లైన్ మెసెంజర్ లాంటి ఇతర మెసేజింగ్, కాలింగ్ యాప్స్ తో ప్రధానంగా పోటీ ఉంటుందన్నమాట. అవి జియో దెబ్బకు తలుపులు మూసుకోవాల్సిన పరిస్థితులు ఎంతో దూరంలో లేవని తెలుస్తోంది.

 

 

ఈ-కామర్స్ ను కలిపి ఒకే యాప్

సిటీ రీసెర్చ్ సంస్థ అంచనా ప్రకారం జియో చాట్ క్రమంగా వాయిస్, మెసేజింగ్, ఎంటర్టైన్మెంట్, ఈ-కామర్స్ ను కలిపి ఉమ్మడిగా ఒకే యాప్ గా మార్చి వాడకందారులకు సేవలందిస్తుందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైవ్ టీవీ

అది టీవీ చానల్స్ అందించే యాప్. లైవ్ టీవీ ఇవ్వటమే కాకుండా జియో ప్లే ఆటోమేటిక్ గా కార్యక్రమాలన్నిటినీ ఏడురోజులపాటు క్లౌడ్ మీద నిల్వ ఉంచుతుంది. అంటే, ఇది ఓవర్ ద టాప్ (ఒటిటి) కే పరిమితమవుతుందా, ఇళ్లలో టీవీలకూ విస్తరిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న.

 

 

డిటిహెచ్ ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ కష్టకాలం

చాలా మంది మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నది మాత్రం డిటిహెచ్ ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ దీటుగా సేవలందిస్తూ కేబుల్ ఆపరేటర్లద్వారా ఇంటింటికీ టీవీలకు ప్రసారాలు అందించే అవకాశమున్నదని. అదే సమయంలో మొబైల్ ప్లాట్ ఫామ్ మీద కూడా అందజేస్తుందని భావిస్తున్నారు.

జియో ఆన్ డిమాండ్

వాయిస్ ఆన్ డిమాండ్ తరహాలో ఉంటుంది. దీన్నే జియో ఆన్ డిమాండ్ పేరుతోను, జియో బీట్స్ పేరిట మ్యూజిక్ స్ట్రీమింగ్, జియో ఫ్రెండ్స్ పేరుతో ఫ్రెండ్స్ లొకేటర్ యాప్ భవిష్యత్ లో విస్తరించేందుకు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెట్టారని తెలుస్తోంది. అంటే మ్యూజిక్ యాప్స్ గల్లంతే.

 

 

జియో న్యూస్

జియో న్యూస్ పేరుతో ఆన్ లైన్ న్యూస్ పేపర్ సర్వీస్, జియో మాగ్ పేరుతో ఆన్ లైన్ మాగజైన్ సర్వీస్ రావచ్చని తెలుస్తోంది. రోగి వైద్య చరిత్రను క్లౌడ్ సహాయంతో నిల్వచేసే ప్రక్రియ, విద్యాబోధన లాంటివి కూడా ప్రధానంగా జియో లో ఉండవచ్చునని తెలుస్తోంది. అంటే ఆన్ లైన్ న్యూస్ కు కష్టాలే. 

 

 

ముందు ముందు జియో

జియో యాప్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మిగతా యాప్స్ పాతాళానికి వెళ్లిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ముందు ముందు జియో ఎలాంటి షాక్ లిస్తుందో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio apps may overtake WhatsApp, Facebook, we chat, and Many Apps in future read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot