టాంగో, 3డీటెక్‌ ఫీచర్లు, మొబైల్ చరిత్రలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్

Written By:

టాంగో టెక్నాలజీతో లెనోవా నుంచి అదిరిపోయే ఫోన్ దూసుకొచ్చింది. ఈ టెక్నాలజీ గురించి మీకు తెలియాలంటే మీకు ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపి పొకెమాన్ గో గేమ్ గురించి తెలియాలి. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో ఆ గేమ్ కస్టమర్లని ఓ ఊపు ఊపింది. అయితే అలాంటి ఫీచర్లను అందించే ఫోన్ ఇప్పుడు లెనోవా నుంచి దూసుకొస్తోంది. అదే లెనోవా ఫ్యాబ్2 ప్రో. ఫీచర్లపై ఏ రేంజ్ లో ఉన్నాయో మీరే చూడండి.

ఒక్క ఫోన్‌తో చైనా దిగ్గజాలను ఖంగుతినిపించింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆగ్మెంటెడ్ రియాలిటీ

ఆగ్మెంటెడ్ రియాలిటీ ( మన కళ్ల ముందు ఉన్న వస్తువును 3డీలోకి మార్చి నేరుగా చూపించడం) ఫీచర్లతో మార్కెట్లోకి సరికొత్తగా లెనోవా ఫ్యాబ్2 ప్రో దూసుకొచ్చింది.

టాంగో' టెక్నాలజీ

దీంతో పాటు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అభివృద్ధి చేసిన 'టాంగో' టెక్నాలజీతో మార్కెట్లోకి అడుగుపెట్టిన తొలి స్మార్ట్ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం

ముందున్న వస్తువును త్రీడీ ఇమేజ్‌గా

ఇందులో స్పెషల్ ఏంటంటే వినియోగదారుడి ముందున్న వస్తువును త్రీడీ ఇమేజ్‌గా మార్చేసేలా ఈ ఫోన్లో ప్రత్యేక సెన్సర్లు ఏర్పాటు చేశారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విజువల్ త్రీడీలోకి

ఫోన్ కెమెరాతో ఏదైనా వస్తువును చిత్రీకరించినప్పుడు ఆ విజువల్ త్రీడీలోకి మారిపోతుంది. ఫోన్ కెమెరాతో ఏ వస్తువును చిత్రీకరించినా సెన్సర్ల సాయంతో దాని ఎత్తు .. పొడవు .. పరిమాణం వంటి కొలతలను గుర్తిస్తుంది.

ఇంటీరియర్ డిజైన్ చేసే వారికి

అయితే ఈ ఫీచర్ ఇంటీరియర్ డిజైన్ చేసే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడితే బాగుంటుందో ఫోన్ కెమెరాతో ఇంటిలోపల చిత్రీకరిస్తూ తెలుసుకోవచ్చు. అటువంటి టెక్నాలజీని ఈ ఫోన్ లో పొందుపరిచారు.

టాంగో' టెక్నాలజీతో పనిచేసే 32 యాప్‌లను

ఇక ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో కొత్తగా 'టాంగో' టెక్నాలజీతో పనిచేసే 32 యాప్‌లను గూగుల్ విడుదల చేసింది. వాటిని మీరు కావాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.అందులో 'పోకెమాన్ గో' లాంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్ లు కూడా ఉన్నాయి.

6.4 అంగుళాల డిస్ ప్లే

ఫీచర్ల విషయానికొస్తే 6.4 అంగుళాల డిస్ ప్లేతో 3డీ టెక్నాలజీతో మొబైల్ వచ్చింది. 1440x2560 pixels రిజల్యూషన్, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0 ఓఎస్ మీద పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ ను కలిగి ఉంది.

4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ ఇంటర్నల్

ర్యామ్ విషయానికొస్తే 4 జీబీ ర్యామ్ తో పాటు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. మైక్రో ఎస్ డీ ద్వారా మెమొరీని విస్తరించుకునే సామర్ధ్యం ఉంది.

కెమెరా

16 మెగా ఫిక్సల్ కెమెరాతో మీరు అదిరిపోయే విధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా ను పొందుపరిచారు.

బ్యాటరీ

4050 ఎంఏహెచ్ lion నాన్ రిమూవబుల్ బ్యాటరీ దీని సొంతం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ ఆడియో సిస్టం, డ్యూయెల్ సిమ్ , అదనపు ప్రత్యేకమైన ఫీచర్లు

ధర

ఈ ఫోన్ ధర ప్రస్తుతం 499,99 డాలర్లు (రూ .33,326) గా ఉంది. కావలిసిన వారు లెనోవా సైట్ ను సందర్శించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google's First Official Project Tango Smartphone, Lenovo Phab 2 Pro Finally on Sale read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot