హల్లోతో ఫేస్‌బుక్‌ పని అయిపోయినట్లే ?

Written By:

ఇప్పుడు ఇండియాలో ఫేస్‌బుక్‌ పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌ రాకముందు ఛాటింగ్ కోసం దేన్ని ఉపయోగించేవారో మీకు తెలుసా.. ఆర్కుట్..ఇది ఇండియాలో చాలా పాపులర్ ఒకప్పుడు. అయితే ఫేస్‌బుక్‌ రాకతో కనుమరుగైపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త హంగులతో హల్లో అంటూ దూసుకొస్తోంది.

జియో వాడకంతో కొంప కొల్లేరు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హల్లో నెట్‌వర్క్

ఆర్కుట్‌ని సృష్టించిన గూగుల్ ఉద్యోగి Orkut Buyukkokten తాజాగా ఓ సరికొత్త సైట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దానిపేరే హల్లో నెట్‌వర్క్.

2016లోనే

వాస్తవానికి 2016లోనే ఇది బయట ప్రపంచానికి వచ్చినా అది అప్పుడు కేవలం యాప్ రూపంలోనే దర్శనమిచ్చింది. అలాగే కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది.

గూగుల్ ప్లే స్టోర్ లో

అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ల కోసం పూర్తి స్థాయిలో వచ్చేసింది.గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

బేటా దశలో

ఇప్పుడు ఈ యాప్ బేటా దశలో ఉంది. అతి త్వరలోనే ఇది మనందరి ముందుకు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది.

ప్రపంచంలో ఎవరితోనైనా

ఫేస్‌బుక్‌లో అయితే మన స్నేహితులతో మాత్రమే కనెక్ట్ అవుతాం. కాని హల్లో నెట్ వర్క్ లో ప్రపంచంలో ఎవరితోనైనా కనెక్ట్ కావచ్చు. ఆ అద్భుతమైన ఫీచర్ అందులో ఉంది. దీంతో మన పరిధి విస్తరించుకునే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Meet Hello, Orkut’s all new avatar now open to Indian users
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot