జియో వాడకంతో కొంప కొల్లేరు !

జియోతో టెలికం దిగ్గజాలకే కాదు యూజర్లకు సైతం తిప్పలు తప్పడం లేదు.

By Hazarath
|

టెలికం రంగంలో ఓ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ దూసుకొచ్చిన జియో టెలికం దిగ్గజాలను ముప్పతిప్పలు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. టెలికం రంగాన్నే తన వైపు తిప్పుకుని దిగ్గజాలకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అయితే జియోతో టెలికం దిగ్గజాలకే కాదు యూజర్లకు సైతం తిప్పలు తప్పడం లేదు. అదెలాగంటే..

 

సెగ పుట్టించనున్న మొబైల్ ధరలు, రీచార్జిలు

24 గంటలు దానిలోనే

24 గంటలు దానిలోనే

జనం జియో కు మంచి నీళ్ళు తాగినంత సులువుగా అలవాటు పడిపోయారు. నెట్ వాడకం మీద కనీస అవగాహన లేని వాళ్ళు సైతం నేర్చుకుని మరీ వాడుతున్నారు. 24 గంటలు దానిలోనే మునిగితేలడంతో ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జియో లాంచ్ అయిన రెండు నెలలకే

జియో లాంచ్ అయిన రెండు నెలలకే

జియో అన్ లిమిటెడ్ డేటా ఇవ్వడం మొదలు పెట్టాక ముఖ్యంగా యువతరం అందులోనే మునిగితేలడం అనేది ముందు నుంచి జరుగుతున్న వ్యవహారమే. జియో లాంచ్ అయిన రెండు నెలలకే రోజుకి 16 వేల టిబి డేటా ని ట్రాన్స్మిట్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.

వ్యసనంలాగ మనవాళ్ళు
 

వ్యసనంలాగ మనవాళ్ళు

టెక్నాలజీకి పుట్టిల్లు గా చెప్పుకునే చైనాలో ఆ వాడకం 12 వేల టిబి మాత్రమే. వోడాఫోన్ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముతున్న డేటా రోజుకి 6 వేల టిబి మాత్రమే. ఈ లెక్కన మద్య వ్యసనంలాగ మనవాళ్ళు జియోకి ఎంతగా యడిక్ట్ అయ్యారో చెప్పొచ్చు.

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం

అస్తమానం ఫ్రీగా వస్తున్న ఇంటర్నెట్ తో కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా తగ్గిందని అస్తమానం స్మార్ట్ ఫోన్ లో మునిగి తేలడమే పనిగా పెట్టుకున్నారని సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి.

పక్క వాళ్ళతో అవసరం లేదు

పక్క వాళ్ళతో అవసరం లేదు

నెలకు ఒక జిబి మాత్రమే వాడే స్తోమత ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏకంగా ముప్పై జిబి అందుబాటులో రావడంతో పక్క వాళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా వ్యవరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Is Reliance Jio making people more addicted to the internet Read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X