గూగుల్ సర్టిఫైతో తక్కువ ధరకే ఆండ్రాయిడ్ టీవీలు
దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ భారత్‌లో నూతన ఆండ్రాయిడ్ టీవీ మోడల్స్‌ను విడుదల చేసింది. వీటిని గూగుల్ సర్టిఫై చేయడం విశేషం. కాగా ఈ టీవీలు 32 ఇంచుల డిస్‌ప్లే మొదలుకొని 43 ఇంచుల డిస్‌ప్లే వరకు లభిస్తున్నాయి. 32 ఇంచుల మోడల్ టీవీ ధర రూ.13,999 ఉండగా వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు.

కాగా ఈ టీవీల్లో గూగుల్ ప్లే స్టోర్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే బిల్టిన్ క్రోమ్‌క్యాస్ట్ ఫీచర్‌ను వీటిల్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఈ టీవీల్లో అందిస్తున్నారు.గూగుల్ సర్టిఫై చేసిన ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీని మూడు మోడల్స్ లో మైక్రోమ్యాక్స్ కంపెనీ లాంచ్ చేసింది.

గూగుల్ ప్లే స్టోర్ యాక్సస్
ఈ మూడింటిలో 16:9 అస్పెక్ట్ రేషియోతో (32, 40, 43)అంగుళాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొత్త మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ టీవీతో గూగుల్ ప్లే స్టోర్ యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో మ్యూజిక్, మూవీస్, గేమ్స్ కూడా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీలో క్రోమ్ క్యాస్ట్ ఇన్ బుల్ట్ అయి ఉంటుంది.వాయిస్ ఎనేబుల్డ్ సెర్చ్ ఆప్షన్ తో కూడిన గూగుల్ అసిస్టెంట్ సర్వీసు కూడా అందుబాటులో ఉంది.

గూగుల్ సర్టిఫై
మైక్రోమ్యాక్స్ ఇన్ఫోర్మాటిక్స్ డైరెక్టర్ రోహన్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఆండ్రాయిడ్ టీవీని గూగుల్ సర్టిఫై చేసింది. ఆకర్షణీయ ఫీచర్లు యూజర్లను ఆకట్టుకునే ఉన్నాయి. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునేవారికి ఇందులోని ఫీచర్లు ఎంతో ఉత్తమంగా ఉంటాయని భావిస్తున్నాం' అని ఒక ప్రకటనలో తెలిపారు. అయితే కొత్తగా లాంచ్ అయిన మైక్రోమ్యాక్స్ ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించి పూర్తి వివరాలు రివీల్ కాలేదు.

వాషింగ్ మిషన్ రూ.10వేల 999కే
ఇదిలా ఉంటే మైక్రో మ్యాక్స్ పోర్టుపొలియోలో మరో ప్రొడక్టును కూడా లాంచ్ చేసింది. ఫుల్లీ ఆటోమాటిక్ టాప్ లోడింగ్ వాషింగ్ మిషన్ ను కేవలం రూ.10వేల 999కే అందిస్తోంది.కంపెనీ నుంచి మార్కెట్‌లోకి వచ్చిన తొలి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్ ఇదే కావడం గమనార్హం.వాషింగ్ మెషీన్లు నాలుగు వేరియంట్ల రూపంలో లభ్యమౌతాయి. 6 కేజీ, 6.5 కేజీ, 7 కేజీ, 8 కేజీ అనే సామర్థ్యంతో ఇవి అందుబాటులో ఉంటాయి.

తక్కువ ధరకే సరికొత్త టెక్నాలజీతో ప్రొడక్టులు:
కంపెనీని స్థాపించిన దగ్గరి నుంచి మా లక్ష్యం ఒక్కటే. తక్కువ ధరకే సరికొత్త టెక్నాలజీతో ప్రొడక్టులను అందించాలని ముందుకు వెళ్తున్నాం. అందుకే ఇప్పుడు తొలి వాషింగ్ మెషీన్‌ను ఆవిష్కరించాం. దీంతో కస్టమర్ల దైనందిన కార్యకలాపాలు సులభతరమౌతాయి' అని మైక్రోమ్యాక్స్ ఇన్‌ఫర్మేటిక్స్ డైరెక్టర్ రోహన్ అగర్వాల్ తెలిపారు.


Click it and Unblock the Notifications








