Home
News

అమెజాన్ ప్రైమ్ డే సేల్ !! టీవీల మీద ముందు చూడని టాప్ డీల్స్

అమెజాన్‌లో అతిపెద్ద అమ్మకం అయిన అమెజాన్ ప్రైమ్ డే జూలై 15 నుండి జూలై 16 వరకు జరుగుతోంది. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ నాలుగేళ్ల క్రితం తొలిసారిగా ప్రైమ్ డేను నిర్వహించింది. గత కొన్నేళ్లుగా ప్రైమ్ డే అమెజాన్ కంటే పెద్దదిగా మారింది.ఈ రెండు రోజుల అమ్మకం సమయంలో అనేక ఉత్పత్తులపై ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తోంది.

amazon prime day sale top deals on tvs under rs 30000

ఈ ప్రైమ్ డే సమయంలో సుమారు 1,000కి పైగా ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్‌లన్నీ కూడా బాగా మంచి అందుబాటు ధరలో వస్తాయి. టీవీలు వంటి ఎలక్ట్రానిక్స్‌కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ప్రైమ్ డే అమ్మకం సందర్భంగా టీవీలపై అందించే డిస్కౌంట్లను ఇక్కడ చూడండి.

షియోమి Mi LED TV 4A ప్రో:

షియోమి Mi LED TV 4A ప్రో:

షియోమి నుండి వచ్చిన Mi LED టివి 4A ప్రో అమెజాన్ ఇండియాలో రూ.22,999 లకు లభిస్తుంది. ఈ టీవీ 43-అంగుళాల ఫుల్ HD రిజల్యూషన్‌ మద్దతుతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ మరియు సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్‌తో ప్యాచ్‌వాల్ UI మీద నడుస్తుంది. ఈ టీవీ యూట్యూబ్, హాట్‌స్టార్, వూట్, సోనీ LIV, ZEE5 వంటి వాటికీ మద్దతు ఇస్తుంది. స్ట్రీమింగ్ కంటెంట్ కోసం త్వరలో ప్రైమ్ వీడియో మద్దతును కూడా పొందుతుంది. ఇది 20W సౌండ్ అవుట్పుట్ కలిగి ఉంది మరియు ఇది మూడు HDMI పోర్టులను కలిగి ఉంది. ఇది ఒక సంవత్సరం వారంటీ మరియు ప్యానెల్‌ మీద ఒక సంవత్సరం అదనపు వారంటీ వస్తుంది. Mi LED టివి 4A ప్రో కొనుగోలు చేసే వారికి యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపు లభిస్తుంది.

METZ 32-inch మరియు 40-inch LED TV:

METZ 32-inch మరియు 40-inch LED TV:

జర్మన్ బ్రాండ్ అయిన మెట్జ్ టీవీ అమెజాన్ ఇండియా ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం ఇది దేశంలో నాలుగు మోడళ్లను అందిస్తోంది. 32 అంగుళాల హెచ్‌డి రెడీ మోడల్ మరియు 40 అంగుళాల ఫుల్ హెచ్‌డి టీవీలు 30,000 రూపాయలలోపు ఉన్నాయి. ఈ రెండు టీవీలు ఆండ్రాయిడ్ 8.0తో రన్ అవుతున్నాయి. 32 అంగుళాల మోడల్ ధర రూ.12,999 కాగా 40-అంగుళాల మోడల్ ధర 20,999 రూపాయలు. ఇది ఆండ్రాయిడ్ తో రన్ అపుతున్నందున ప్లే స్టోర్ మరియు స్ట్రీమింగ్ కోసం హాట్స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్ లకు యాక్సిస్ పొందుతారు. మెట్జ్ టీవీలు రెండు సంవత్సరాల స్టాండర్డ్ వారంటీతో వస్తాయి.

సోనీ బ్రావియా 32-inch టీవీ:

సోనీ బ్రావియా 32-inch టీవీ:

బ్రావియా పరిధిలోని సోనీ 32-అంగుళాల ఫుల్ HD LED టీవీ కూడా డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. ఈ టీవీ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో 28,999రూపాయలకు లభిస్తుంది. ఇది బ్రావియా లైనక్స్ ఆధారిత OS ద్వారా రన్ అవుతుంది మరియు అంతర్నిర్మిత వైఫైతో వస్తుంది. దీనికి రెండు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి.30 వాట్స్ అంతర్నిర్మిత వూఫర్‌ స్పీకర్ ను కలిగి ఉంది. ఇది ఆడియో ప్రోత్సాహికులను బాగా ఆకర్షిస్తుంది. బ్రావియా ఒక సంవత్సరం స్టాండర్డ్ వారంటీ మరియు ప్యానెల్‌పై మరొక అదనపు సంవత్సరం వారంటీతో వస్తుంది.

సాన్యో 43-inch LED TV :

సాన్యో 43-inch LED TV :

ఇండియాలో ప్రస్తుతం సాన్యో 43 అంగుళాల ఫుల్ హెచ్‌డి ఎల్‌ఈడీ టీవీని 30,000రూపాయలలోపు అందిస్తోంది. ఈ టీవీ ధర ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో 27,999రూపాయలగా ఉంది. అంతే కాకుండా ప్రైమ్ డే సందర్భంగా ఈ టీవీ మీద డిస్కౌంట్లను కూడా చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ HD ప్యానెల్ ఉంటుంది. దీనికి మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు ఉన్నాయి. దీని యొక్క రెండు డాల్బీ డిజిటల్ ట్యూన్డ్ స్పీకర్లు కలిపి 16 వాట్స్ సౌండ్ ఉత్పత్తి చేస్తాయి.

 TCL స్మార్ట్ ఎల్‌ఇడి టివి:

TCL స్మార్ట్ ఎల్‌ఇడి టివి:

ఇండియాలో స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ మార్కెట్లో టిసిఎల్ మంచి బ్రాండ్ గా మారింది. ఇప్పుడు ప్రైమ్ డే సందర్భంగా కంపెనీ 43 అంగుళాల ఫుల్ హెచ్‌డి ఎల్‌ఈడీ టీవీ మీద డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది .ఈ స్మార్ట్ టీవీ కంటెంట్‌ను పొందడానికి విస్తృత శ్రేణి యాప్ లకు మద్దతు ఇస్తుంది. ఇది అంతర్నిర్మిత వైఫై కనెక్టివిటీని కలిగి ఉంది మరియు యాప్లకు త్వరిత యాక్సిస్ కోసం ఆండ్రాయిడ్ ని అమలు చేస్తుంది.

శామ్సంగ్ అన్‌బాక్స్ సూపర్ 6 టీవీ రేంజ్ :

శామ్సంగ్ అన్‌బాక్స్ సూపర్ 6 టీవీ రేంజ్ :

శామ్సంగ్ నుండి వచ్చిన 4K UHD టివిల అన్‌బాక్స్ సూపర్ 6 రేంజ్ ఖరీదైనది మరియు ఇది 39,999 రూపాయల నుండి మొదలవుతుంది. ఏదేమైనా ప్రైమ్ డే 2019 సందర్భంగా దీనిపై మొదటిసారి డిస్కౌంట్ ఇస్తున్నారు.ఈ స్మార్ట్ టీవీ కొత్త సిరీస్ మార్కెట్లో షియోమి మరియు టిసిఎల్‌లను సవాలు చేస్తోంది. ఇది 4K UHD ప్యానల్‌ను కలిగి ఉన్న 43 అంగుళాల మోడల్‌తో ప్రారంభమవుతుంది. ఈ టీవీ నెట్‌ఫ్లిక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి స్మార్ట్ అప్లికేషన్లతో కూడా వస్తుంది. ఇది రెండు HDMI పోర్టులు మరియు ఒక USB పోర్ట్ లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon prime day sale top deals on tvs under rs 30000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X