మోడీ రూ. 500 ఉచిత రీఛార్జ్, లింక్ చూసారా..?
ప్రధాని నరేంద్రమోడీ నిజంగానే ఆ ఆఫర్ ఇస్తున్నారా..నగదు కొరతతో ఉచితంగా రీ ఛార్జ్ ఇస్తున్నారా..?
ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ పేరుమీద ఓ మెసేజ్ వాట్సప్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రీగా రూ. 500 రీఛార్జ్ ఇస్తున్నాడన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే అది నిజమేనా... ప్రధాని నరేంద్రమోడీ నిజంగానే ఆ ఆఫర్ ఇస్తున్నారా..నగదు కొరతతో ఉచితంగా రీ ఛార్జ్ ఇస్తున్నారా..ఇలాంటి విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
ఈ యాప్ జియో, వాట్సప్‍లను సైతం హడలెత్తిస్తోంది

లింక్ మీద క్లిక్ చేస్తే
మీకు పంపించే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఉచితంగా రూ .500 రీఛార్జ్ అయిపోతుంది. వెంటనే రీఛార్జ్ చేసుకుని, మరో 15 మంది ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయడంటూ ప్రధాని నరేంద్రమోదీ పేరుమీదనే ఓ లింకు వైరల్ అవుతున్న విషయం విదితమే.

వ్యక్తిగత సమాచారమంతా
నోట్ల రద్దు తర్వాత ఈ లింకు భారీగా షేర్ అవుతోంది. నగదు కొరతతో నిజంగానే మోడీ మనకు ఉచితంగా రీఛార్జ్ చేస్తున్నాడమోనని భావించి, చాలామంది ఆ లింకును ఓపెన్ చేస్తున్నారు. దీంతో మన వ్యక్తిగత సమాచారమంతా లీకైపోయి, హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుందట.

ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా
ఈ లింకు ఓపెన్ చేసినా, క్లిక్ చేసినా ప్రజలకు హానికరమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధాని పేరు మీద సర్క్యూలేట్ అయ్యే http://balance.modi-gov.in/ ఈ లింకు ఫేకని వెల్లడైంది.

మరో 15 మంది స్నేహితులకు
ఆ లింకును క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్, ఆపరేటర్, రాష్ట్రం వంటి వివరాలు అందించాలి. అన్ని వివరాలు నింపిన తర్వాత రీఛార్జ్ బటన్ నొక్కగానే, మరో కొత్త పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో లింకును మరో 15 మంది స్నేహితులకు షేర్ చేయాలని అడుగుతోంది.

హోమ్ పేజీలో
అయితే ఈ వెబ్‌సైట్‌లో నింపే సమాచారం హ్యాకర్ల చేతిలోకి వెళ్తుందని, యూజర్ల సమాచారాన్ని వారు తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారని వెల్లడైంది. అదేవిధంగా ఈ హోమ్ పేజీలోనే తాము ఏ టెలికాం కంపెనీకి చెందిన వాళ్లం కాదని నిబంధనలు, షరతుల్లోనే ఉంటుందని చెబుతున్నారు.

వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా
వాట్సప్ మొదటిసారి వీడియో కాలింగ్‌ను యూజర్లకు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇదే మాదిరి ఓ ఫేక్ మెసేజ్ విపరీతంగా సర్క్యూలేట్ అయింది. ఈ లింకులు చాలా ప్రమాదకరమని, ఎట్టిపరిస్థితుల్లో వాటిని ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు జారీఅవుతున్నాయి.


Click it and Unblock the Notifications








