Paytm Offers: ఈ రీఛార్జ్ లపై 50% క్యాష్‌బ్యాక్.. మీరు ట్రై చేయండి...

|

ఇండియాలో ఉన్న టెలికాం ఆపరేటర్ల యొక్క 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌ల రీఛార్జ్ లపై వినియోగదారులకు 50% వరకు క్యాష్‌బ్యాక్ అందించే "వీకెండ్ స్పెషల్ ఆఫర్" ను భారతదేశపు ప్రముఖ పేమెంట్ మరియు ఆర్థిక సేవల సంస్థ పేటిఎమ్ ప్రకటించింది.

Paytm వీకెండ్ స్పెషల్ ఆఫర్

Paytm వీకెండ్ స్పెషల్ ఆఫర్

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్‌లో ఇప్పటికే 10రోజులు ముగిసాయి. టెలికాం వినియోగదారులు మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. Paytm యొక్క "వీకెండ్ స్పెషల్ ఆఫర్" వినియోగదారులకు గరిష్టంగా రూ.10 క్యాష్‌బ్యాక్‌ను Paytm తో అందిస్తుంది. వినియోగదారులు వారానికి ఒకసారి ఈ ఆఫర్‌ను పొందగలుగుతారు. ఈ ఆఫర్ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై ఆదివారం రాత్రి 11.59 గంటలకు ముగుస్తుందని పేటీఎం తెలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Paytm 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లపై క్రెడిట్లను అందిస్తుంది

Paytm 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లపై క్రెడిట్లను అందిస్తుంది

Paytm ను వినియోగిస్తున్న వినియోగదారులకు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా యొక్క 4G డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లపై "వీకెండ్ స్పెషల్ ఆఫర్" వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ పొందటానికి ప్రోమో కోడ్ "మొబైల్‌డేటా" ను దరఖాస్తు చేసుకోవచ్చు. KYC పూర్తి చేయని లేదా నెలవారీ వాలెట్‌ను ఉల్లంఘించిన వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌కు బదులుగా బహుమతి వోచర్‌ను అందుకుంటారని Paytm తెలిపింది.

Paytm- యాడ్-ఆన్ ప్యాక్‌ ఆఫర్

Paytm- యాడ్-ఆన్ ప్యాక్‌ ఆఫర్

రిలయన్స్ జియో యొక్క రూ.11, రూ.21, రూ.51 మరియు రూ.101 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లపై పేటీఎం ఆఫర్ వర్తిస్తుంది. అలాగే ఈ ప్లాట్‌ఫామ్ లో ఎయిర్‌టెల్ యొక్క రూ.48 మరియు రూ .98 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లకు మరియు వోడాఫోన్ ఐడియా యొక్క రూ.16, రూ.48, రూ.98 డేటా యాడ్-ఆన్ ప్యాక్‌లపై కూడా పేటీఎం రివార్డ్ ను పొందవచ్చు.

రిలయన్స్ జియో యాడ్-ఆన్ ప్యాక్‌లు

రిలయన్స్ జియో యాడ్-ఆన్ ప్యాక్‌లు

రిలయన్స్ జియో యొక్క రూ .11 బేస్ ప్లాన్ 800MB డేటా మరియు 75 నిమిషాల నాన్ జియో కాలింగ్‌ను అందిస్తుంది. రూ.21 యాడ్-ఆన్ ప్యాక్ 2GB డేటా, 200 నిమిషాల నాన్ జియో కాలింగ్ ప్రయోజనాలతో రాగా, రూ.51 ప్లాన్ 6GB డేటా మరియు 500 నిమిషాల నాన్ జియో కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తుంది. జియోలో అదనంగా ఉన్న రూ.101 ప్లాన్ 12GB డేటా మరియు 1000 నిమిషాల ఆఫ్-నెట్ కాలింగ్‌ను అందిస్తుంది. రిలయన్స్ జియో నుండి డేటా యాడ్-ఆన్ వోచర్లు యూజర్ యొక్క ప్రస్తుత ప్రణాళిక వరకు చెల్లుతాయి.

 

 

పేటీఎంలోకి 660 మిలియన్ డాలర్ల పెట్టుబడులుపేటీఎంలోకి 660 మిలియన్ డాలర్ల పెట్టుబడులు

ఎయిర్‌టెల్‌ యాడ్-ఆన్ ప్యాక్‌లు

ఎయిర్‌టెల్‌ యాడ్-ఆన్ ప్యాక్‌లు

ఎయిర్‌టెల్‌ యొక్క రెండు స్వతంత్ర డేటా యాడ్-ఆన్ ప్లాన్‌లపై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.48 ధర గల ఎయిర్‌టెల్ బేస్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ 28 రోజుల వాలిడిటీతో 3GB డేటాను అందిస్తుంది. అలాగే కంపెనీ యొక్క రూ.98 ప్లాన్ 6GB డేటాను 28 రోజుల వాలిడిటీతో అందిస్తుంది.

 

 

Reliance Jio యూజర్లకు మరొక శుభవార్త.....Reliance Jio యూజర్లకు మరొక శుభవార్త.....

వోడాఫోన్ ఐడియా యాడ్-ఆన్ ప్యాక్‌లు

వోడాఫోన్ ఐడియా యాడ్-ఆన్ ప్యాక్‌లు

వోడాఫోన్ ఐడియా యొక్క బేస్ డేటా యాడ్-ఆన్ ప్యాక్ రూ.16 ధరను కలిగి ఉండి 24 గంటల చెల్లుబాటుతో 1GB డేటాను అందిస్తుంది. 28 రోజుల చెల్లుబాటు ఉన్న అదనపు డేటా ప్యాక్‌లను కూడా కంపెనీ అందిస్తుంది. వీటి యొక్క ధరలు వరుసగా రూ.48 మరియు రూ .98. ఇవి వరుసగా 3GB మరియు 6GB డేటా ప్రయోజనంను అందిస్తుంది.

 

 

 

Tata sky, Airtel Digital TV, Sun Direct అందిస్తున్న ఫ్రీ పే టీవీ ఛానెల్‌లు ఇవే...Tata sky, Airtel Digital TV, Sun Direct అందిస్తున్న ఫ్రీ పే టీవీ ఛానెల్‌లు ఇవే...

రెగ్యులర్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై పేటీఎం క్రెడిట్ ఆఫర్లు

రెగ్యులర్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లపై పేటీఎం క్రెడిట్ ఆఫర్లు

వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు కూడా పేటిఎం నుండి రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందవచ్చు. పేటీఎం ప్రకారం వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో యొక్క ప్రీపెయిడ్ వినియోగదారులు 2020 ఏప్రిల్ 30 లోపు నాలుగు సార్లు రూ.48 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసిన వారికి 1500 రూపాయల వరకు క్రెడిట్‌లను పొందడానికి అర్హత లభిస్తుంది.

 

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

పేటీఎం ప్రత్యేక ఆఫర్‌

పేటీఎం ప్రత్యేక ఆఫర్‌

ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా పేటీఎం 200 మంది వినియోగదారులకు 100% క్యాష్‌బ్యాక్ క్యాప్‌ను గరిష్టంగా రూ.100 రీఛార్జితో పాటు పోస్ట్‌పెయిడ్ బిల్ చెల్లింపులను స్వీకరించే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఆసక్తి ఉన్న వినియోగదారులు మరిన్ని వివరాల కోసం Paytm యాప్ లేదా వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు మరియు ఆఫర్‌కు అర్హత పొందడానికి సంబంధిత కోడ్‌లను ఉపయోగించవచ్చు. క్రెడిట్ 24 గంటల్లో యూజర్ అకౌంటులో లభిస్తుంది అని పేటీఎం పేర్కొంది.

Best Mobiles in India

English summary
Paytm Weekend Special Offer: 50% Cashback On These Recharges

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X