వాట్సాప్ వీడియో కాల్స్‌‌లో దమ్మెంత..?

నిన్న, మొన్నటి వరకు బేటా వర్షన్ యూజర్లకు మాత్రమే పరిమితమైన వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ తాజాగా అధికారిక వాట్సాప్ అకౌంట్‌లలోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఉపయోగించుకుంటున్న యూజర్లు వాట్సాప్ వీడియో కాల్స్ నాణ్యత పై భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Read More : అమ్మకానికి రూ.2000 నోటు, ఎంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసిరకమైన వీడియో క్వాలిటీ..

మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర వీడియో కాలింగ్ యాప్స్‌తో పోలిస్తే వాటాప్స్ ఆఫర్ చేస్తున్న వీడియో కాల్స్ లో నాణ్యత లోపిస్తోంది. ముఖ్యంగా ఫేస్ టు ఫేస్ కాల్స్ సమయంలో పిక్షర్ క్వాలిటీ నాసిరకంగా ఉంది.

ఎక్కువ డేటాను ఖర్చు చేస్తోంది..

స్కైప్, ఫేస్‌టైమ్ వంటి వీడియో కాలింగ్ యాప్స్‌తో పోలిస్తే వాట్సాప్ వీడియో కాల్ ఫీచర్ ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్నట్లు విశ్లేషణలో వెల్లడైంది. వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఎంత డేటా ఖర్చవుతుంది..?

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాట్సాప్ వీడియో కాల్ ఇన్విటేషన్ ముసుగులో స్కామ్

వీడియో కాల్స్ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు అఫీషియల్‌గా అందుబాటులోకి వచ్చినప్పటికి వీడియో కాల్ ఇన్విటేషన్ పేరుతో మోసపూరిత లింక్స్ వాట్సాప్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని క్లిక్ చేయటం ద్వారా వాట్సాప్ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.

2జీ నెట్‌వర్క్‌లో పనిచేయటం లేదు

వాట్సాప్ వీడియో కాల్స్ 2జీ నెట్‌వర్క్‌లలో వర్క్ అవటం లేదని స్పష్టంగా తెలుస్తోంది. 3జీ నెట్‌వర్క్‌లోనూ కాల్స్ నాణ్యత అంతంత మాత్రంగానే ఉందని యూజర్లు అంటున్నారు.

వై-ఫై కనెక్షన్‌లో బెటర్..

మొబైల్ డేటా కనెక్షన్‌తో పోలిస్తే వై-ఫై కనెక్షన్‌లో వాట్సాప్ వీడియో కాల్స్ మరింత మెరుగ్గా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ మీ వద్ద మంచి వై-ఫై కనెక్షన్ అందుబాటులో ఉన్నట్లయితే వాట్సాప్ వీడియో కాల్స్‌ను మీరు పూర్తిస్థాయిలో ఆస్వాదించవచ్చు. ఒకవేళ మీరు మొబైల్ కనెక్షన్ మీదే ఆధారపడుతున్నట్లయితే నాణ్యమైన వీడియో కాల్స్ ను మీరు ఆస్వాదించలేరు!.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reasons Why WhatsApp Video Calls May Not Suit All Users. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot