కొత్త ఏడాదికి ముందే వాట్సప్ కొన్ని ఫోన్లకు షాకిచ్చింది !
సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న వాట్సప్ కొన్ని ఫోన్లకు కొత్త సంవత్సరం రాకముందే షాక్ ఇచ్చేసింది.
వాట్సప్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పదం వినిపిస్తోంది. అదీగాక ఈ మధ్య వీడియో కాలింగ్ ఫీచర్ కూడా ప్రవేశపెట్టడంతో వాట్సప్ మరింతగా పాపులర్ అయింది. సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న వాట్సప్ కొన్ని ఫోన్లకు కొత్త సంవత్సరం రాకముందే షాక్ ఇచ్చేసింది. వాటిల్లో వాట్సప్ ఫీచర్లు ఇకపై ఉండవని తెలిపింది. ఆ ఫోన్ల వివరాలను అప్ డేట్ చేసింది.
4జిబి నుండి 1జిబికి తగ్గిన డేటా,యూజర్లకే మేలంటున్న జియో

బ్లాక్ బెర్రీ ఫోన్స్
BlackBerry OS and BlackBerry 10..ఈ ఫోన్లలో సేవలు నిలిచిపోనున్నాయి.

నోకియా ఫోన్స్
Nokia S40, Nokia Symbian S60, Android 2.1 and Android 2.2 ఈ ఫోన్లలో సేవలు ఆగిపోనున్నాయి.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విండోస్ ఫోన్స్
Windows Phone 7.1 వర్సన్ లోని అన్ని ఫోన్లకు సేవలు ఆగిపోనున్నాయి.

ఐఫోన్స్
iPhone 3GS/iOS 6 పాతం తరం ఫోన్లకు కూడా సేవలు ఆగిపోనున్నాయి.

కొత్త వర్షన్ అప్ డేట్ చేసుకుంటే
ఈ ఆపరేటింగ్ సిస్టం వాడుతున్న వారు ఈ నెల తర్వాత కొత్త వర్షన్ అప్ డేట్ చేసుకుంటే వాట్సప్ సేవలు అందుతాయని కంపెనీ ప్రకటించింది.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








