4జిబి నుండి 1జిబికి తగ్గిన డేటా,యూజర్లకే మేలంటున్న జియో

Written By:

2017 మార్చి 31 వరకు జియో ఉచితం అంటూ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‌తో ముకేష్ అంబాని యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన విషయం అందరికీ విదితమే. అయితే గుడ్ న్యూస్ తో పాటు మరో షాకింగ్ కబురు అందించారు. ప్రస్తుతం డేటాపై అందిస్తున్న రోజుకు 4జిబి పరిమితిని 1జిబికి కుదిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇది కూడా యూజర్లకు శుభవార్తేనని చెబుతున్నారు ముకేష్ అంబాని.

ప్రభుత్వం వేసిన జరిమానా చూసి షాక్‌తిన్న జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తగ్గిన డేటా పరిమితితో

ఈ తగ్గిన డేటా పరిమితితో జియో డేటా వాడకంపై లోడ్ తగ్గి, మంచి 4 జీ అనుభవాన్ని వినియోగదారులు పొందవచ్చని, పరిమితిని తగ్గించడంతో దారుణంగా ఉన్న జియో స్పీడ్‌ను మెరుగుపరుచుకోవచ్చని కంపెనీ భావిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి చివరి వరకు

జియో డేటా పరిమితిని తగ్గించడంతో తను చేధించదలుచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటుందని, మార్చి చివరి వరకు 100 మిలియన్ యూజర్లను సొంతం చేసుకుంటుందని జేపీ మోర్గాన్ నిపుణులు కూడా పేర్కొంటున్నారు.

ఉచిత ఆఫర్ ముగిసినా

నెట్‌వర్క్ వినియోగాన్ని తగ్గించి, మంచి క్వాలిటీ సర్వీసులను వినియోగదారులకు అందించాలని, దీంతో ఉచిత ఆఫర్ ముగిసినా ఈ సిమ్ పైనే యూజర్లు కొనసాగుతారని క్రెడిట్ స్యూజ్ కూడ తెలిపింది.

మిగతా టెలికాం కంపెనీలతో పోటిస్తే స్లోగా ఉందంటూ

జియో స్పీడ్ ఇతర నెట్ వర్క్ ల కన్నా మరీ తక్కువగా ఉందని కంప్లయిట్లు వచ్చిన విషయం తెలిసిందే. జియో డేటా సేవలు దారుణంగా ఉన్నాయంటూ, నెట్ స్పీడ్ మిగతా టెలికాం కంపెనీలతో పోటిస్తే స్లోగా ఉందంటూ టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా గుట్టురట్టు చేసింది.

కస్టమర్లను పోగొట్టుకోకుండా

దీంతో కస్టమర్లను పోగొట్టుకోకుండా ఉండటానికి, వారికి స్పీడ్ డేటాను అందించడానికి డేటా పరిమితిలో రిలయన్స్ జియో కోత విధించింది. ఈ నేపథ్యంలోనే హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద రోజువారీ డేటా పరిమితిని తగ్గిస్తున్నట్టు పేర్కొంది. వాయిస్ సేవలు జీవిత కాలంపాటు అందిస్తామని పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio users, here's why new limit on data is good news read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot