రహస్య మెసేజ్‌లు పంపుకునే ఏకైక యాప్

Written By:

హైక్..ఈ యాప్ గురించి చాలామంది వినే ఉంటారు..అత్యంత తక్కువ కాలంలో పాపులర్ అయిన్ యాప్ లలో ఇది ఒకటి. గత జనవరికి పది కోట్ల మంది హైక్ కుటుంబంలో చేరినట్టు ఆ సంస్థ ప్రకటించుకుంది. దీనిలో వాట్సప్ కి ధీటైన ఫీచర్లు ఉన్నాయి. వాట్సప్ లో చేయలేని పనులు సైతం ఈ యాప్ ద్వారా చేయవచ్చు. మీరు ఇతరులకు కనిపించకుండా చాట్ చేసుకోవచ్చు కూడా. హైక్ లో దాగిన అద్భుతమైన ఫీచర్స్ ఏంటో మీరే చూడండి.

వాట్సప్ నుంచి బయటకొస్తే..అదిరే ఛాటింగ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిడెన్ మోడ్ ( Hidden Mode )

మీ ఫోన్ లో హైక్ ద్వారా చేసే చాట్ ఇతరుల కళ్ల పడకుండా ఉండేందుకు హిడెన్ చాట్ మోడ్ ను ఎంచుకోవచ్చు. ఇందుకోసం కాంట్టాక్ పై ఫింగర్ తో ప్రెస్ చేసి ఉంచితే మరొక స్మాల్ విండో ఓపెన్ అయ్యి అందులో హిడెన్ చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఓకే చేసి పాస్‌వర్డ్ ఇస్తే యాక్టివేట్ అవుతుంది. ఇక ఆ కాంటాక్ట్ తో చేసే చాట్‌ను వేరెవరూ చూడలేరు. తిరిగి అన్‌హైడ్ చేసే వరకు మీ మధ్య సంభాషణ పూర్తిగా రహస్యమే.

హిడెన్ మోడ్ ( Hidden Mode )

చాట్స్ విండో పై భాగంలోని హైక్ ఐకాన్ వద్ద టాప్ చేస్తే పాస్ వర్డ్ సెలక్ట్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. పాస్ వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఏ కాంటాక్ట్ ను అయినా హిడెన్ మోడ్ లో ఉంచాలన్నా, తొలగించాలన్నా పాస్ వర్డ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. పాస్ వర్డ్ మర్చిపోతే రీసెట్ హిడెన్ మోడ్ ని ఎంచుకోవడం మినహా వేరే మార్గం లేదు.

థీమ్స్ ( Chat Themes)

ఈ మెసేంజర్ యాప్ లో మీకు రకరకాల ధీమ్స్ కనిపిస్తాయి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్, నైట్, లవ్ ఆర్ అవేసమ్ ఇలాంటి ఎన్నో రకాల ధీమ్స్ ఉంటాయి. గ్రూప్ ఛాట్ లో కూడా ఈ ధీమ్స్ ఉపయోగించుకోవచ్చు.

ఆఫ్ లైన్ చాట్ ( Hike Offline )

డేటా లేకపోయినా హైక్ యాప్ ద్వారా మెస్సేజ్ పంపుకోవచ్చు. హైక్ లో ఉన్న అత్యుత్తమ ఫీచర్లలో ఇది కూడా ఒకటి. ఇలాంటి ఫీచర్ ను అందిస్తున్న తొలి ఇన్ స్టంట్ మెస్సేజింగ్ యాప్ కూడా ఇదే.

ఆఫ్ లైన్ చాట్ ( Hike Offline )

మెస్సేజ్ సెండ్ చేసిన నిమిషం వరకు ఆ మెస్సేజ్ డెలివరీ తీసుకోవాల్సిన యూజర్ ఆఫ్ లైన్ లో ఉంటే వారి రిజిస్టర్ మొబైల్ నంబర్ కు హైక్ టెక్ట్స్ మెస్సేజ్ పంపించాలా? అని అడుగుతుంది. సెండ్ అని ఓకే చెప్తే ఎస్ఎంఎస్ వెళ్లిపోతుంది. అప్పుడు సదరు వ్యక్తి బదులు ఇవ్వాలంటే డేటా ఆన్ చేసుకుని హైక్ మెస్సెంజర్ ద్వారా చాట్ చేయాల్సి ఉంటుంది. లేదా మెస్సేజ్ ద్వారా రిప్లయ్ ఇవ్వవచ్చు.

ఉచిత మెసేజ్‌లు ( Free sms)

ప్రతీ హైక్ యూజర్ కు నెలలో 107 ఎస్ఎంఎస్ ల వరకే ఉచితం. ఆ పరిమితి దాటిన తర్వాత సాధారణ ఎస్ఎంఎస్ చార్జీలు వర్తిస్తాయి..

హైక్ డైరెక్ట్ ( Hike direct )

హైక్ డైరెక్ట్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని ద్వారా దగ్గర్లో ఉన్న వారితో ఆఫ్ లైన్ లోనూ మెస్సేజ్ చేసుకోవచ్చు. ఇది షేర్ ఇట్ ను ఉపయోగించి దగ్గర్లోని ఫోన్ కు కనెక్ట్ అవుతుంది. కేవలం 100 మీటర్ల పరిధిలోనే ఉన్న వారి ఫోన్లతోనే అనుసంధానం సాధ్యం.

అటాచ్ మెంట్స్ ( Attachments)

హైక్ లో అన్ని రకాల ఫార్మాట్ ఫైల్స్ ను షేర్ చేసుకునే అటాచ్ మెంట్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకేసారి పీడీఎఫ్, జిప్ ఫైల్స్ ను 100 ఎంబీ వరకు మీ స్నేహితులకు పంపించుకోవచ్చు.

Hike Pins

ఇది మీకు ముఖ్యమైన స్నేహితుల సమాచారాన్ని ఎల్లప్పుడూ మీకు చూపిస్తూ ఉంటుంది. గ్రూప్ చాట్ లో మీకు ముఖ్యమైన వారి మెసేజ్ లు మాత్రమే చదివే వీలు కూడా ఉంటుంది.

స్టిక్కర్స్ ( Stickers)

హైక్ లో మంచి మంచి స్టిక్కర్ల కలెక్షన్ ఉంది. హావ భావాలను చక్కని గుర్తుల రూపంలో తెలియచేయడానికి ఇవి ఉపకరిస్తాయి. అంటే వాట్సాప్ లో ఎమోటికన్స్ లేవని కాదు. కానీ స్టిక్కర్లు హైక్ లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన మెస్సేజింగ్ యాప్స్ తో పోలిస్తే హైక్ లో చాలా ప్రత్యేకమైనవి ఉన్నాయని యూజర్లు చెబుతున్నారు.

వాయిస్ కాల్స్ ( Voice Call )

ఇది కూడా ఓ ప్రముఖమైన ఫీచర్ దీంతో పాటు గ్రూప్ ఫీచర్లో 500 మంది వరకు ఒకే గ్రూప్ కింద ఉండవచ్చు. వాట్సప్ లో అయితే ఇది 250గానే ఉంది. ఈ విషయంలో వాట్సప్ ను మించిన ప్రపంచ స్థాయి ఫీచర్లు హైక్ లోనే ఎక్కువని నిపుణుల అభిప్రాయం.

అప్ డేటెడ్ వర్షన్ ( update )

హైక్ ప్రతీ నెలా అప్ డేటెడ్ వర్షన్ తో ముందుకు వస్తోంది. చాట్ హిస్టరీని సింపుల్ గా బ్యాకప్ తీసుకోవచ్చు. ఒకవేళ మర్చిపోయినా ఇబ్బందేమీ లేదు. ప్రతి రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో చాట్స్ బ్యాకప్ లో స్టోర్ అవుతాయి. వాటిని రిస్టోర్ చేసుకోవచ్చు.హైక్ అప్ డేషన్ సమయంలోనూ చాట్ బ్యాకప్ చేయాలా అని అడుగుతుంది. ఒకే చేస్తే సేవ్ అవుతుంది.

పైరసీ

హైక్ లో 128 బిట్ పైరసీ రక్షణ ఉంటుంది. వైఫై వాడుతున్న వారిని దృష్టిలో ఉంచుకుని మరీ దీన్ని రూపొందించారు. భారతీ ఎయిర్ టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్ కుమారుడు కవిన్ భారతీ మిట్టల్ దీని వ్యవస్థాపకుడు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Seven Secret About Hike App That Nobody Will Tell You read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot