వాట్సప్ నుంచి బయటకొస్తే..అదిరే ఛాటింగ్ యాప్స్

Written By:

ఎప్పుడూ మనం వాట్సప్ వాట్సప్ అని కలవరిస్తుంటాం. అయితే వాట్సప్ నుంచి ఓ సారి బయటికొచ్చి చూస్తే మనకు అదిరిపోయే ఛాటింగ్ యాప్స్ ఎన్నో ఉన్నాయి. ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనే వారికి ఈ యాప్స్ అదిరిపోతాయి కూడా. మరి ఆ సరికొత్త యాప్స్ పై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

డేంజర్ జోన్‌లో శాంసంగ్‌ ఫోన్లు :ఈ సారి ఏకంగా విమానంలోనే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హైక్

పది కోట్ల మంది వాడుతున్న యాప్. స్వల్ప కాలంలోనే అందరి మొబైళ్లలోకి చేరింది.ప్లస్ పాయింట్ ఏంటంటే డేటా లేకుండానే ఈ యాప్ ద్వారా మెసేజింగ్ పంపుకోవచ్చు.

కకావో టాక్ Kakao Talk

ఇది చాలా తక్కువమందికే తెలుసు. కాని 15 భాషల్లో ఉంది. దీనికి మొబైల్ నంబర్ అవసరం కూడా లేదు.

లైన్ మెసేంజర్

ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్ బెర్రీ ఫోన్లకు ఇది కంపర్టబుల్. హిడెన్ చాట్స్ సదుపాయం ఇందులోనూ ఉంది.

ఫేస్‌బుక్ మెసేంజర్

ఇది అందరికీ తెలిసిన యాప్. నెట్ ఉంటేనే పనిచేస్తుంది.

బీబీఎం

ఇది బ్లాక్ బెర్రీ మెస్సెంజర్ బ్లాక్ బెర్రీ ఫోన్లపై మాత్రమే కాదు ఆండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్ ఫోన్లపైనా పనిచేస్తుంది. దీనిలో అత్యంత భద్రతకు హామీ ఉంది. ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ అడ్రస్ తో పనిలేకుండా ప్రతీ యూజర్ ను యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పిన్) ఆధారంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్నాప్‌చాట్

ఇది ఫొటో, వీడియో మెస్సేజింగ్ యాప్. ఫొటోలు, వీడియోలను పంపుకోవడానికి చాలా అనువైనది. పంపిన వాటిని అవతలి వైపు వారు చూసిన తర్వాత పది సెకండ్లలోనే డిలీట్ అయిపోతాయి.

కిక్ మెసేంజర్

దీని ద్వారా మెస్సేజ్ లు, ఫొటోలు, వీడియోలు, స్కెచ్ లు షేర్ చేసుకోవచ్చు. 2015 డిసెంబర్ నాటికి ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా వీరిలో 40 శాతం మంది అమెరికాలోని టీనేజర్లే. ఫొన్ నంబర్ లేకుండా ఈ యాప్ లో చేరే అవకాశం ఆకర్షణీయం.

వీ చాట్

వాయిస్, వీడియో కాలింగ్, ఫొటో షేరింగ్, గేమ్స్, వాయిస్ మెస్సేజ్, టెక్స్ట్ మెస్సేజ్ ఇలా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.వీ చాట్ అకౌంట్ ను ఫేస్ బుక్, ట్విట్టర్ కు అనుసంధానం చేసుకుంటే ఫొటో క్లిక్ మనిపించిన వెంటనే వాటిల్లోకి చేరిపోతుంది. అయితే, అది మీ నియంత్రణలోనే ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top Ten Popular Messenger Apps in 2016 read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting