పంపిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా..?

Written By:

పరుగులు పెడుతున్న టెక్నాలజీ యుగంలో మనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఎవరి కంటా పడకుండా దాచుకోవడానికి అత్యంత సేఫ్టీ యాప్ లను వెతుకుతుంటాం. అలా సేఫ్టీ కావాలనుకునే వారి కోసం మార్కెట్లో కొన్ని రకాల సేఫ్టీ యాప్స్ దొరుకుతున్నాయి. వాటిలో ఎన్ - గేజ్ అప్లికేషన్ ఒకటి.

ప్రపంచ రికార్డుతో దడ పుట్టిస్తున్న జియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఈ మొబైల్ యాప్ సేఫ్టీ విషయంలో

తాజాగా మార్కెట్‌లోకి వచ్చిన ఈ మొబైల్ యాప్ సేఫ్టీ విషయంలో వినియోగదారులకు నూరు శాతం హామీ ఇస్తోంది. వీడియో చాట్, గేమింగ్ వంటి ఫీచర్స్‌తో పాటు సెండ్ చేసిన మెసేజ్‌ల్ని తిరిగి పొందే అవకాశాన్ని అందిస్తోంది. 

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పర్సనల్ గ్రూప్స్

ఈ అప్లికేషన్ ద్వారా సొంతంగా గ్రూప్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాంటాక్ట్ లిస్ట్‌లోని 300 మందితో ఒకే గ్రూప్ కింద సంభాషించవచ్చు. ఎన్ - గేజ్ దాదాపు 45 భాషలు సపోర్ట్ చేస్తుండడం గమనార్హం. నో అనే ఫీచర్‌లో ఆరోగ్య సంబంధమైన ఆర్టికల్స్, సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చు.

వ్యక్తీకరణ సులభం

మనం వ్యక్తం చేయాలనుకున్న భావాలను సులభంగా వ్యక్తం చేసేందుకు వీలుగా ఎన్ కార్డ్స్, ఎన్ - స్టిక్కర్స్, చాట్ మేకోవర్స్, డూడెల్ ప్లస్ వంటి ఫీచర్స్‌ని చేర్చారు ఇందులో. మీ సొంత ఫొటోలకు మీకు నచ్చిన స్టిక్కర్స్‌ని యాడ్ చేసుకోవడంతో పాటు, వైవిధ్య భరితంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే అవకాశమూ ఇందులో కలదు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రిసీవ్ బ్యాక్

అన్నింటిన్నా ఆకర్షణీయమైన ఫీచర్ ఎన్ - గేజ్ అందిస్తోంది. మీరు పంపించిన మెసేజ్‌ని తిరిగి వెనక్కి తీసుకునే అవకాశాన్ని అందిస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న చాలా మెసెంజర్ యాప్స్‌లో మొత్తం సంభాషణను డిలీట్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ అప్లికేషన్‌లో ఎక్స్రాక్ట్ ఫీచర్ ద్వారా మొత్తం సంభాషణను వెనక్కి తీసుకోవచ్చు.

బ్లింక్ ఆప్షన్ ద్వారా

ఎదుటి వాళ్ల మొబైల్ నుంచి... బ్లింక్ ఆప్షన్ ద్వారా మీ సందేశాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ల ఇన్‌బాక్స్‌లో ఆ మెసేజ్ ఎంత సమయం ఉండాలో ముందే నిర్ధేశించుకోవచ్చు. ఇక స్క్రాంబల్ ద్వారా ... మీ ప్రైవేట్ సంభాషణలకు సెక్యురిటీ సెట్ చేసుకోవచ్చు.

 

 

ట్రై చేయాలనుకుంటే

మీరూ ఎన్ - గేజ్ అబ్లికేషన్‌ని ట్రై చేయాలనుకుంటే WWW.N-GAGE.COM లాగిన్ అవ్వండి. లేదా PLAY.GOOGLE.COM నుంచి ఎన్ - గేజ్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సరికొత్తగా..

ఎన్ - గేజ్‌ను మిగతా మొబైల్ అప్లికేషన్స్ మాదిరి కాకుండా స్మార్ట్ ఫోన్ లేకున్నా వెబ్ వర్షన్‌లో వినియోగించుకోవచ్చు. రెగ్యులర్ మెసెంజర్ యాప్స్‌కి భిన్నంగా విభిన్నమైన ఫీచర్స్‌తో ఆకట్టుకుంటోంది ఎన్ - గేజ్. ఒకే సారి ఎక్కువ మంది గ్రూ ప్ వీడియో కాల్ మాట్లాడుకునే అవకాశం ఎన్ గేజ్ కల్పిస్తుందన్నారు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
The new feature rich N-Gage app: All you need to know read more at telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot