ప్రపంచ రికార్డుతో దడ పుట్టిస్తున్న జియో

By Hazarath
|

ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియో ఇప్పుడు ప్రపంచ రికార్డులతో టెల్కోలకే దడ పుట్టిస్తోంది. జియో సర్వీసును మార్కెట్లోకి వదిలిన కొన్ని రోజులకే కోట్లమందిని కష్టమర్లుగా చేసకుని దూసుకుపోతోంది. ప్రపంచంలో మరో సిమ్ నెట్‌వర్క్‌కు సాధ్యం కాని విధంగా ఈ ఘనతను సొంతం చేసుకుంది. పూర్తి సారాంశంపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

మీ మెదడు పరిగెత్తడానికి ఈ యాప్స్ చాలు

1.6 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్

1.6 కోట్ల మంది సబ్ స్క్రైబర్స్

ఉచిత ఇంటర్నెట్ అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సిమ్ సర్వీస్ జియో కేవలం నెలరోజుల్లోనే 16 మిలియన్ల(1.6 కోట్లు) మంది సబ్ స్క్రైబర్స్ (యూజర్లు)ను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

ప్రవేశపెట్టిన నెలరోజుల్లో

ప్రవేశపెట్టిన నెలరోజుల్లో

ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ స్థాయిలో యూజర్లను
 

ఈ స్థాయిలో యూజర్లను

ఫేస్‌బుక్, వాట్సప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ కూడా ఈ స్థాయిలో యూజర్లను తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా

ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా

ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, కస్టమర్ల కోసం తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ముఖేశ్ అంబానీ హర్షం వ్యక్తంచేశారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో వెలకమ్ ఆఫర్

జియో వెలకమ్ ఆఫర్

జియో వెలకమ్ ఆఫర్ అంటూ మై జియో యాప్ ద్వారా ప్రోమోకోడ్ పొందిన కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో జియో సిమ్స్ తీసుకోవచ్చు

డిసెంబర్ 31వరకూ

డిసెంబర్ 31వరకూ

డిసెంబర్ 31వరకూ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్రీ ఇంటర్ నెట్ బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ సౌకర్యాలతో మార్కెట్లోకి వచ్చిన జియో సర్వీస్ కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాయిస్ కాల్స్ తో పాటు

వాయిస్ కాల్స్ తో పాటు

వాయిస్ కాల్స్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా జియోకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆగస్టులోనే మార్కెట్లోకి ట్రయల్ వర్షన్ అంటూ జియో సిమ్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది.

సెప్టెంబర్ 5నుంచి

సెప్టెంబర్ 5నుంచి

ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 5నుంచి జియోను అధికారికంగా లాంచ్ చేశారు. 50 మిలియన్ల కస్టమర్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న జియో ప్రాజెక్టులో ఇప్పటికే 16 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతుంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
RJio sets 'world record', enrols 16 million users in first month read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X