సంగీతాన్ని వినడానికి 5 ఉత్తమమైన మ్యూజిక్ యాప్ లు

|

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు స్ట్రెస్ బస్టర్‌లలో ఉన్నప్పుడు దానిని తగ్గించుకోవడానికి సాధారణంగా చేసే పనులలో సంగీతం వినడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ కారణంగా మీరు ఇప్పుడు మీకు ఇష్టమైన సంగీతాన్ని ఎక్కడైనా ఉండి కూడా వినవచ్చు. మీరు ఇంట్లో స్వీయ-నిర్బంధంలో ఉన్నప్పుడు రోజు మొత్తం మీకు సహాయం చేయడానికి సంగీతం మీకు మంచి తోడుగా ఉంటుంది.

మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్
 

మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్

టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలా రకాల మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లు మార్కెట్లోకి రావడమే కాకుండా వాటి యొక్క ఫ్రీమియం బిజినెస్ మోడల్‌ను కూడా అనుసరిస్తున్నాయి. దీని అర్థం మ్యూజిక్ యాప్ యొక్క ఉచిత మరియు చెల్లింపు సంస్కరణను కలిగి ఉండడం. చాలా సందర్భాలలో మొదటి నెల ఉచితంగా ఉండవచ్చు తరువాత నెలవారీ సభ్యత్వ ప్లాన్ అమలులో ఉంటుంది.

స్ట్రీమింగ్ సర్వీసు

స్ట్రీమింగ్ సర్వీసు

మీరు సంగీతం వినడానికి డబ్బులను చెల్లించటానికి మీకు ఆసక్తి లేకపోతే అందులోంచి వచ్చే ప్రకటనలను కూడా శాంతంగా వినడానికి సిద్ధంగా ఉండాలి. స్ట్రీమింగ్ సర్వీసుకు సభ్యత్వాన్ని పొందమని మేము మిమ్మల్ని అడుగుతున్నామని కాదు ప్రకటనలు లేని అనుభవంతో పాటు డౌన్‌లోడ్‌ల వంటి ప్రోత్సాహకాలతో చెల్లింపు సభ్యత్వం వస్తుందని గ్రహించడం చాలా మంచిదికదూ.

మీరు ఎంచుకోవడానికి ఉత్తమమైన 6 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లు

మీరు ఎంచుకోవడానికి ఉత్తమమైన 6 మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లు

1) స్పాటిఫై

2019 ప్రారంభంలో భారతీయ మార్కెట్‌లోకి అన్ని రకాల సంగీతం మరియు పాడ్‌కాస్ట్‌ల కోసం ఒక-స్టాప్ షాప్ అమలులోకి వచ్చింది. స్వీడిష్ కంపెనీ మొదటి వారంలోనే 1 మిలియన్ వినియోగదారులను పొందగలిగింది. గతంలో వినియోగదారులు విన్నదాన్ని బట్టి స్పాటిఫై వ్యక్తిగతీకరించిన సలహాల జాబితాను అందిస్తుంది. పైడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ లు నెలకు రూ.119 నుండి ప్రారంభమవుతాయి. ప్రీమియం ప్లాన్‌ల యొక్క ప్రయోజనాలలో ప్రకటన రహిత సంగీతం మరియు ఒకే సారి అనేక పరికరాలలో యాక్సిస్ ను పొందడం వంటి ఫీచర్స్ ఉన్నాయి.

2) జియోసావన్
 

2) జియోసావన్

జియోసావన్ 2007 లో సావన్‌గా ఇండియా మార్కెట్ లోకి ప్రవేశించింది. తరువాత 2018 లో జియో మ్యూజిక్‌తో విలీనం అయిన తరువాత జియోసావన్ గా పేరును మార్చుకున్నది. ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మరాఠీ మరియు ఇతర భారతీయ భాషలలో 45 మిలియన్లకు పైగా పాటల సేకరణను కలిగి ఉంది. JioSaavn యొక్క పైడ్ సర్వీస్ యొక్క నెలవారీ ప్లాన్ లు రూ.99 ధర నుండి ప్రారంభమవుతుంది.

3) గానా

3) గానా

భారతదేశంలోని ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ లలో ఇది కూడా ఒకటి. గానా యాప్ ఇప్పుడు 100 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉంది. దీనిని 2010 లో ప్రారంభించారు. ఇది మొత్తంగా 21 భాషలలో 45 మిలియన్లకు పైగా పాటల సేకరణను కలిగి ఉంది. ఇందులో వినియోగదారులు వారి స్వంత పబ్లిక్ మ్యూజిక్ ప్లేజాబితాను కూడా సృష్టించడానికి అవకాసం ఉంది. వీటిని యాప్ లోని ఇతర వ్యక్తులు కూడా యాక్సెస్ చేయవచ్చు. యాప్ యొక్క ప్రీమియం వెర్షన్ అయిన గానా ప్లస్ ప్లాన్‌ను నెలకు రూ.99 వద్ద అందిస్తుంది. ప్రీమియం సంస్కరణలో వినియోగదారులు HD మ్యూజిక్ స్ట్రీమింగ్, యాడ్ ఫ్రీ మరియు అపరిమిత ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ లను పొందుతారు.

4) వింక్ మ్యూజిక్

4) వింక్ మ్యూజిక్

భారతి ఎయిర్‌టెల్ యాజమాన్యంలోని వింక్ మ్యూజిక్ యాప్ ఉచిత డౌన్‌లోడ్‌ల ఫీచర్‌ను అందించిన మొదటి యాప్ లలో ఒకటి. అయితే ఉచిత ఫీచర్ ఎయిర్‌టెల్ యొక్క సెల్యులార్ సేవను ఉపయోగిస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర వినియోగదారులకు ప్రీమియం ప్లాన్ ఆఫర్ కింద నెలకు రూ.60 లు వసూలు చేస్తుంది. ఈ యాప్ వివిధ భారతీయ భాషలలో అనేక రకాల సంగీత సేకరణలను అందిస్తుంది.

5) ఆపిల్ మ్యూజిక్

5) ఆపిల్ మ్యూజిక్

ఈ ఆపిల్ మ్యూజిక్ యాప్ సుమారు100 దేశాలలో అందుబాటులో ఉంది. ఇది సంగీతం మరియు వీడియోలను రెండింటిని ప్రసారం చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వాస్తవానికి ఈ సర్వీస్ సంగీతానికి మాత్రమే పరిమితం చేయబడింది కాని తరువాత వీడియోలను కూడా ప్రసారం చేయడం ప్రారంభించింది. ఈ యాప్ 50 మిలియన్లకు పైగా పాటల జాబితాలను కలిగి ఉంది. దీని యొక్క పైడ్ సబ్స్క్రిప్షన్ నెలకు రూ.49 నుండి ప్రారంభమవుతుంది. ఈ యాప్ ఇప్పుడు ఆండ్రాయిడ్ మరియు iOS రెండింటిలోనూ యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంది. దీని ద్వారా మీరు ఇతరులతో పంచుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Top 5 Best Music Player Apps of Android and ios

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X