డేంజర్ జోన్‌లో శాంసంగ్‌ ఫోన్లు :ఈ సారి ఏకంగా విమానంలోనే..

Written By:

శాంసంగ్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ల పేళుళ్లతో శాంసంగ్ అల్లకల్లోలం అవుతుంటే తాజాగా మరో ఫోన్ గెలాక్సీ నోట్ 2 కూడా ఈ లిస్ట్‌లో చేరింది. ఈ సారి ఏకంగా విమానంలోనే శాంసంగ్ ఫోన్ పేలింది. దెబ్బతో బిత్తరపోయిన అధికారులు శాంసంగ్‌కు నోటీసులు జారీ చేశారు.

కొంపముంచిన గెలాక్సీ నోట్ 7 : శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఇండిగో విమానంలో

సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఇండిగో విమానంలో శాంసంగ్ నోట్ 2 బ్యాటరీ పేలి, పొగలు వ్యాపించాయి. స్వల్పంగా మంటలు అంటుకోవడం కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు.

విమానంలోని 182 మంది ప్రయాణికులు

విమానంలోని 182 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. అయితే ఈ ఘటనపై డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

శాంసంగ్ అధికారులకు నోటీసులు

వెంటనే శాంసంగ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరింది. చెన్నైలో జరిగిన పేలుడు ఘనటలో ఎలాంటి నష్టం జరగలేదు.

శాంసంగ్ నోట్ ఫోన్లను తీసుకు రావద్దంటూ

అయితే ఈ ఘటనతో డీజీసీఏ మరోసారి అప్రమత్తమైంది. ప్రయాణికులు శాంసంగ్ నోట్ ఫోన్లను తీసుకు రావద్దంటూ ఆంక్షలు విధించాలని ఎయిర్ లైన్స్ ను కోరింది.

స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా

శాంసంగ్ నోట్ స్మార్ట్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా ప్రయాణికులను కోరుతూ ప్రతి విమానంలో ఒక ప్రకటన చేయాలని సూచించింది.

శాంసంగ్ ఫోన్లు వాడొద్దని

కాగా విమానాల్లో శాంసంగ్ ఫోన్లు వాడొద్దని ఇప్పటికే డీజీసీఐ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

కొంపముంచిన గెలాక్సీ నోట్ 7

కొంపముంచిన గెలాక్సీ నోట్ 7 : శాంసంగ్‌కు చుక్కలు చూపిస్తున్నఐఫోన్ 7.మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 2 catches fire on Chennai-bound flight: Report read more gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot