ఒక్క యాప్..23 బ్యాంకులకు చిటికెలో నగదు బదిలీ !

Written By:

నెట్ బ్యాంకింగ్ కంటే వేగంగా మొబైల్ యాప్ తోనే క్యాష్ లెస్ లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఇప్పుడు సరికొత్తగా ఆల్ బ్యాంక్స్ ఇన్ వన్ యాప్ దూసుకొచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే దీని పేరు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (యూపీఐ) యాప్ !! మీకు ఎన్ని బ్యాంకు ఖాతాలున్నా ఒకే ఒక్క వర్చువల్ అడ్రస్ తో నగదు బదిలీలు జరపవచ్చు. 23 బ్యాంకులకు మీరు లావాదేవీలు చేయవచ్చు. మీరు కూర్చున్న చోటు నుంచేఈ లావాదేవీలు చేయవచ్చు.

జియో DTH పుకార్లేనా..ఇందులో నిజం లేదా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్ని బ్యాంకులు సపోర్టు చేసే విధంగా

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదించిన .. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎనపీసీఐ) నేతృత్వంలో అన్ని బ్యాంకులు సపోర్టు చేసే విధంగా ఈ యూపీఐ యాప్ ను తీసుకొచ్చారు.

ఖాతాదారులకు వర్చువల్ అడ్రస్ ఇవ్వటం

బ్యాంకు ఖాతాదారులకు వర్చువల్ అడ్రస్ ఇవ్వటం ద్వారా ఈ యాప్ ద్వారా సులభంగా నగదు లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

యూపీఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే ..

ముందుగా మీ స్మార్ట్ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్లి యూపీఐ యాప్ అని టైప్ చేయగానే అక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ యాప్ను ఇనస్టాల్ చేయాలి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డౌనలోడ్ చేసిన తర్వాత

యాప్‌ను డౌనలోడ్ చేసిన తర్వాత ప్రొఫైల్లో వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. పేరు, వర్చువల్ ఐడీ (పేమెంట్ అడ్రస్), పాస్వర్డ్ వంటివి ఇచ్చుకోవాలి.

వర్చువల్ ఐడీతో మీ బ్యాంకును

ఆ తర్వాత యూజర్ .. 'యాడ్ / లింగ్ / మేనేజ్ బ్యాంక్ అక్కౌంట్ ఆప్షనను ఓపెన చేసి వర్చువల్ ఐడీతో మీ బ్యాంకును, అక్కౌంట్ నెంబర్ కు లింక్ చేయాల్సి ఉంటుంది.

ఎం-పిన్ జనరేట్

ట్రాన్సాక్షన్స్ ప్రారంభించటానికి వీలుగా ఎం-పిన్ ను జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు లావాదేవీలు జరపగలుగుతారు. దాదాపు 23 రకాల బ్యాంకులకు సంబంధించి మీరు లావాదేవీలు చేయవచ్చు.

 

 

త్వరలో మరిన్ని బ్యాంకులకు

త్వరలో మరిన్ని బ్యాంకులకు ఈ యాప్ విస్తరించే అవకాశం ఉంది. డెబిట్ / క్రెడిట్ కార్డులను స్వైపింగ్ చేయకుండానే లావాదేవీలు పూర్తి చేయవచ్చు. అత్యంత సురక్షితమైనది కూడా.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Unified Payments Interface: Here’s how to register, send and receive money using UPI apps read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot