జియో DTH పుకార్లేనా..ఇందులో నిజం లేదా..?

జియో డీడీహెచ్ అనేది ఒట్టి పుకారేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని కొన్ని వెబ్ సైట్ల కథనాలు..

By Hazarath
|

రిలయన్స్ జియో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న సర్వీసుల్లో డీటీహెచ్ కూడా ఉందని ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాల మీద కధనాలు వస్తున్నాయి. అయితే వాటిని ఖండిస్తూ మళ్లీ అదే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. జియో డీడీహెచ్ అనేది ఒట్టి పుకారేనని అందులో ఎలాంటి వాస్తవం లేదని కొన్ని వెబ్ సైట్లు కథనాలు రాస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియడం లేదు. అయితే ఆ సైటు రాసిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఆపిల్ కళ్లుచెదిరే ఆఫర్..ఐఫోన్లపై రూ.23 వేల క్యాష్‌బ్యాక్

వాస్తవం కాదని

వాస్తవం కాదని

350 ఛానళ్లను కేవలం రూ. 185 చెల్లించడం ద్వారా ఆస్వాదించవచ్చని ఇది మిగతా డీటీహెచ్ సర్వీసులతో పోలిస్తే సగానికి పైగా తక్కువేనని ఇప్పటిదాకా అనేక వార్తలు వచ్చాయి. అయితే అవి వాస్తవం కాదని రియల్ టైమ్ న్యూస్ అనే వెబ్ సైట్ లో కథనాలు వస్తున్నాయి.

కేవలం రూమర్ మాత్రమే

కేవలం రూమర్ మాత్రమే

డిసెంబర్ 15 నుంచి డీటీహెచ్ సర్వీసులు ప్రారంభం అవుతాయంటూ అందరూ ఎదురుచూస్తున్నారు కూడా. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేనని రిలయన్స్ జియో ఆ దిశగా అడుగులు వేయడం లేదని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో టీవిని డీటీహెచ్ సర్వీసుగా

జియో టీవిని డీటీహెచ్ సర్వీసుగా

అన్నీ వెబ్ సైట్లు జియో టీవిని డీటీహెచ్ సర్వీసుగా పొరబడ్డాయని ఆ సైట్ వార్తను ప్రచురించింది. ఈ వెబ్ సైట్ ఎంక్వయిరీలో తేలిందేంటంటే జియో డీటీహెచ్ కి సంబంధించి ఎలాంటి శాటిలైట్ స్పెక్ట్రంను కొనుగోలు చేయలేదని అలాగే మార్కెటింగ్ , డిస్ట్రిబ్యూషన్, సెట్ టాప్ బాక్సులకు సంబంధించి ఎలాంటి ముందడుగు లేదని తేల్చింది.

టీవీ యాప్ కి డీటీహెచ్ సర్వీసులకు

టీవీ యాప్ కి డీటీహెచ్ సర్వీసులకు

అయితే జియో టీవీ యాప్ పి జియో డీటీహెచ్ ని గా అనేక వెబ్ సైట్లు పొరబడ్డాయని అందువల్లే ఈ రూమర్స్ బయటకు వచ్చాయంటోంది. టీవీ యాప్ కి డీటీహెచ్ సర్వీసులకు అసలు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

జియో నెట్ నుంచే కాకుండా ఇతర నెట్వర్క్ ల నుంచి

జియో నెట్ నుంచే కాకుండా ఇతర నెట్వర్క్ ల నుంచి

4జీ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జియో టీవిని పొందవచ్చని అది ఒక్క జియో నెట్ నుంచే కాకుండా ఇతర నెట్వర్క్ ల నుంచి కూడా పొందవచ్చని కూడా సైట్ కథనం రాసింది. దీని కోసం యూజర్లు క్రోమ్ కాస్ట్ కొనాల్సి ఉంటుందని దీని ధర రూ. 3,399 గా ఉందని తెలిపింది.

జియో టీవీలో యూజర్లు

జియో టీవీలో యూజర్లు

అయితే జియో టీవీలో యూజర్లు ఈ సెట్ కొనకుండానే వీక్షించే సదుపాయాన్ని జియో కల్పించిందని వారు చెబుతున్నారు. అయిత ేఇది స్పీడ్ ను బట్టి ప్లే అవుతుందని కూడా తెలిపింది. మీరు ఇతర బ్రాడ్ బ్యాండ్ కనక్షన్ల నుంచి కూడా ఈ సౌకర్యాన్ని వీక్షించవచ్చు.

డీటీహెచ్ అనేది కూడా ఇలాంటిదేనని

డీటీహెచ్ అనేది కూడా ఇలాంటిదేనని

ఇప్పుడు రిలయన్స్ జియో డీటీహెచ్ అనేది కూడా ఇలాంటిదేనని ఇది యాప్ మీద మొబైల్స్ లో రన్నింగ్ అవుతుందని తెలుస్తోంది. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి రిమోట్ కంట్రోల్ లాంటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు.

జియో సెట్ టాప్ బాక్స్లు కొనుగోలు చేయాలంటే

జియో సెట్ టాప్ బాక్స్లు కొనుగోలు చేయాలంటే

అయితే ఇప్పుడు జియో సెట్ టాప్ బాక్స్లు కొనుగోలు చేయాలంటే ముందు పైబర్ కనెక్షన్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జియో పైబర్ కనెక్షన్లు కేవలం ముంబై, చెన్నైలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఉన్నాయి. కంపెనీ 100 సిటీల్లో ఈ కనెక్షన్లు ఇవ్వాలంటే అది నెలలు లేక సంవత్సరాలు పడుతుంది.

జియో టీవీలో యాప్స్ ద్వారా

జియో టీవీలో యాప్స్ ద్వారా

అదీగాక జియో టీవీలో యాప్స్ ద్వారా ఛానళ్లు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ యాప్స్ లో ఉండే ఛానళ్లన్నీ కలిపితే జియో 350 ఛానళ్లు లిస్ట్ ఉంటుందని వారు చెబుతున్నారు. అదే యుప్ టీవీలో అయితే డైరెక్ట్ గా చానళ్లు వస్తాయని దానిలో మీరు పాతవి కూడా చూసుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు.

 జియో అధికారికంగా ప్రకటించేవరకు

జియో అధికారికంగా ప్రకటించేవరకు

మరి ఏది నిజమనేది జియో అధికారికంగా ప్రకటించేవరకు తెలియదు. జియో టీడీహెచ్ నిజంగా వస్తుందా లేక జియో టీవినే డీటీహెచ్ సర్వీసు అవుతుందనా అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Reliance Jio launching DTH service is it true read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X