Home
Apps

UPI పేమెంట్ ఫెయిల్ అయిందా? కంగారు పడకండి.. మీ డబ్బులు తిరిగి పొందడానికి 5 సింపుల్ మార్గాలు ఇవిగో..

UPI payment failed: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) పుణ్యమా అని ఇప్పుడు ఇండియాలో డిజిటల్ చెల్లింపులు చాలా ఈజీ అయిపోయాయి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు, పర్సులో డబ్బు లేకపోయినా కిరాణా సామాను కొనొచ్చు, క్యాబ్ బుక్ చేయొచ్చు, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయొచ్చు. క్షణాల్లో పేమెంట్ అయిపోవడం, వాడటం సులువుగా ఉండటంతో కోట్లాది మందికి UPI నే ఫేవరెట్ పేమెంట్ ఆప్షన్ అయిపోయింది.

అయితే, అప్పుడప్పుడు ఈ UPI పేమెంట్స్ ఫెయిల్ అవుతుంటాయి లేదా మధ్యలోనే ఆగిపోతుంటాయి. మన అకౌంట్‌లో డబ్బులు కట్ అయినా, అవతలి వాళ్లకు చేరవు. అప్పుడు మనకు ఆందోళన మొదలవుతుంది. ఇలా జరిగితే భయపడాల్సిన పనిలేదు. మీ డబ్బులు తిరిగి పొందడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

UPI Payment Failed  No worries here 5 Proven Ways to Get Your Money Back and Resolve Transaction Issues

ఇన్ఫినిక్స్ నోట్ 50X vs రియల్‌మీ P3.. రెండిట్లో ఏ ఫోన్ కొనాలి.. మీకోసం పూర్తి విశ్లేషణ!
1. డబ్బులు వాటంతట అవే వెనక్కి వస్తాయేమో చూడండి (ఆటోమేటిక్ రివర్సల్)

మీరు పేమెంట్ చేసినట్లు యాప్‌లో సక్సెస్ అని చూపించినా, అవతలి షాపు వాళ్లకు డబ్బులు అందలేదంటే, బహుశా అది ప్రాసెసింగ్‌లో ఆగిపోయి ఉండొచ్చు. ఇలా ఫెయిల్ అయిన చాలా UPI ట్రాన్సాక్షన్లలో, డబ్బులు 24 గంటల నుంచి 3 పని దినాలలోపు వాటంతట అవే మీ అకౌంట్‌లోకి తిరిగి వచ్చేస్తాయి.

బ్యాంకులు, పేమెంట్ యాప్‌లు ఈ సమస్యను పరిష్కరించి, డబ్బును మీ ఖాతాలో జమ చేస్తాయి. ఈ సమయంలో, మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేస్తూ ఉండండి. దీనికి కాస్త ఓపిక అవసరం. ఒకవేళ డబ్బు రాలేదంటే కింద అందించిన మరో చిట్కా పాటించాలి.

2. మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి

ఒకవేళ చెప్పిన టైమ్‌లోపు డబ్బులు వెనక్కి రాకపోతే, వెంటనే మీ బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేయండి లేదా యాప్‌లో సంబంధిత అధికారులను సంప్రదించండి. ఫెయిల్ అయిన పేమెంట్‌కు సంబంధించిన 'ట్రాన్సాక్షన్ ఐడీ ' (లేదా UPI రిఫరెన్స్ నంబర్) సిద్ధంగా ఉంచుకోండి.

ఈ ఐడీని బ్యాంక్ ప్రతినిధికి చెబితే, వాళ్లు మీ పేమెంట్ స్టేటస్ ట్రాక్ చేస్తారు. డబ్బులు ఎక్కడ ఆగిపోయాయో, వెనక్కి వచ్చాయో లేదో, ఇంకా ప్రాసెసింగ్‌లోనే ఉన్నాయో వాళ్లు మీకు చెప్పగలరు. కస్టమర్ కేర్ నంబర్, మొబైల్ యాప్ ద్వారా లేదా దగ్గర్లోని బ్రాంచ్‌కి వెళ్లి కూడా సహాయం పొందవచ్చు.

3. ఎమర్జెన్సీ కోసం కొంత క్యాష్ దగ్గర ఉంచుకోండి

UPI ఎంత వేగంగా పనిచేసినా, దానికి ఇంటర్నెట్ కనెక్షన్, సర్వర్ల సపోర్ట్ తప్పనిసరి. ఒక్కోసారి టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు లేదా సర్వర్లు డౌన్ అయినప్పుడు పేమెంట్స్ ఫెయిల్ అవ్వొచ్చు లేదా ఆలస్యం కావచ్చు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకోకుండా ఉండాలంటే, ఎప్పుడూ కొంత డబ్బు ఉంచుకోవాలి.

లేదా డెబిట్ కార్డ్ లాంటి మరో పేమెంట్ ఆప్షన్ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. దీనివల్ల, టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా పని కానిచ్చుకోవచ్చు. లేదంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సమయం కూడా వృధా అవుతుంది. ముందు జాగ్రత్తతో ఉండటమే తెలివైన పని.

4. పేమెంట్ ఫెయిల్ అవ్వగానే బ్యాలెన్స్ చెక్ చేయండి

ఒక UPI పేమెంట్ ఫెయిల్ అయితే, మీరు చేయాల్సిన మొదటి పని మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. ఒకవేళ మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వలేదంటే, మీ డబ్బు మీ దగ్గరే భద్రంగా ఉన్నట్లు లెక్క. కంగారు పడాల్సిన పనిలేదు.

ఒకవేళ డబ్బులు కట్ అయినట్లు చూపిస్తేనే, అవి మధ్యలో ఆగిపోయాయని లేదా ప్రాసెస్ అవుతున్నాయని అర్థం. ఈ చిన్న చెక్ ద్వారా అసలు సమస్య ఉందో లేదో వెంటనే తెలిసిపోతుంది. బహుశా చాలామందికి ఈ చిట్కా తెలిసే ఉంటుంది కానీ ఆందోళనలో ఇది అప్పటికప్పుడు గుర్తుకు రాకపోవచ్చు.

5. ట్రాన్సాక్షన్ ఐడితో మీ పేమెంట్‌ను ట్రాక్ చేయండి

ప్రతి UPI ట్రాన్సాక్షన్‌కి ఒక ప్రత్యేకమైన ఐడీ లేదా రిఫరెన్స్ నంబర్ ఉంటుంది. పేమెంట్లను ట్రాక్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. మీ డబ్బులు మధ్యలో ఆగిపోతే, కస్టమర్ సపోర్ట్‌ను సంప్రదించినప్పుడు ఈ ఐడి నంబర్‌నే చెప్పాలి.

అంతేకాదు, Google Pay, PhonePe, Paytm లాంటి UPI యాప్స్‌లో ఉండే 'Help’ లేదా 'Support’ సెక్షన్‌లోకి వెళ్లి, ఈ ట్రాన్సాక్షన్ ఐడీ ఉపయోగించి ఫెయిల్ అయిన పేమెంట్‌పై కంప్లైంట్ కూడా చేయొచ్చు. దీనివల్ల సమస్య పరిష్కారం వేగవంతం అవుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
UPI payment failed? Learn 5 simple ways to get your money back fast. Resolve stuck UPI transaction issues easily using your bank and transaction ID.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X