Home
Mobile

ఇన్ఫినిక్స్ నోట్ 50X vs రియల్‌మీ P3.. రెండిట్లో ఏ ఫోన్ కొనాలి.. మీకోసం పూర్తి విశ్లేషణ!

Infinix Note 50X vs Realme P3: మార్కెట్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? మొబైల్ మార్కెట్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీకి సంబంధించిన మొబైల్స్ విడుదల అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొబైల్ తయారీ సంస్థలు అందుకు తగ్గట్టుగా మొబైల్ లను ప్రజలను అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.

మనలో చాలామంది కొందరు కెమెరా బాగుండాలని ఆశిస్తే.. మరికొందరేమో గేమింగ్ పరంగా బాగుండాలని కోరుకుంటారు. మరికొందరేమో బ్యాటరీ ఎక్కువ కాలం వచ్చే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని మొబైలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే మొబైల్ తయారీ సంస్థలు వివిధ రకాల మొబైల్స్ ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటాయి.

Infinix Note 50X vs Realme P3 Showdown Specs  Gaming  Price Compared Which Budget Phone Should You Buy in 2024

ఇందులో భాగంగా తాజాగా విడుదలైన ఇన్ఫినిక్స్ నోట్ 50X, రియల్‌మీ P3 మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? రెండూ మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50X ఏమో AI కెమెరా ట్రిక్కులు, కిందపడ్డా పగలని దృఢత్వం, తక్కువ ధరతో ఆకట్టుకుంటుంది.

మరోవైపు రియల్‌మీ P3 అదిరిపోయే AMOLED డిస్‌ప్లే, మంచి గేమింగ్ అనుభవం, రోజంతా వచ్చే బ్యాటరీతో పోటీ ఇస్తోంది. మరి వీటిలో ఏది మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుందో వివరంగా చూద్దాం. డిస్‌ప్లే నుంచి పర్ఫామెన్స్ వరకు ప్రతిదీ చాలా స్పష్టంగా వివరించనున్న కాబట్టి దీన్ని పూర్తిగా చదవండి.

* స్పీడ్, గేమింగ్ ఏది తోపు?

ఇన్ఫినిక్స్ నోట్ 50Xలో కొత్త డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ వాడారు. రోజువారీ పనులకు, యాప్స్ వాడటానికి ఇది బాగానే పనిచేస్తుంది. కానీ, గేమింగ్, స్పీడ్ విషయంలో రియల్‌మీ P3 కొంచెం ముందుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 6 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది వేగవంతమైన 5G సేవలకు అనువుగా ఉంటుంది.

మోటరోలా రేజర్ 60 వచ్చేస్తోంది.. 50MP కెమెరా, 4500mAh బ్యాటరీ, 18GB వరకు ర్యామ్.. స్పెసిఫికేషన్లు లీక్..
అంతేకాదు, ఫోన్ వేడెక్కకుండా పెద్ద కూలింగ్ సిస్టమ్ (6050mm² VC), గేమింగ్ కోసం GT బూస్ట్ లాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల గేమ్స్ ఫ్రేమ్ రేట్లు పడిపోకుండా ఆడొచ్చు. రెండిట్లోనూ 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. కానీ, మెమరీ కార్డు వేసుకుని స్టోరేజ్ పెంచుకునే అవకాశం మాత్రం Realme P3లోనే ఉంది.

* డిస్‌ప్లే విషయానికొస్తే,

క్కడ రియల్‌మీ P3 దే పైచేయి. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ HD+ AMOLED స్క్రీన్ ఉంది. దీనివల్ల రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి, 2000 నిట్స్ బ్రైట్‌నెస్ దీని సొంతం. ఇన్ఫినిక్స్ నోట్ 50Xలోనూ 6.67 అంగుళాల స్క్రీనే ఉన్నా, అది కేవలం HD+ రిజల్యూషన్ (720 × 1600 పిక్సెల్స్) ఉన్న LCD ప్యానెల్.

* డిజైన్ ఏది బెటర్..

లుక్స్ పరంగా రెండు ఫోన్స్ స్టైలిష్‌ గానే ఉన్నాయి, కానీ ఇన్ఫినిక్స్ నోట్ 50X కొంచెం బరువు ఎక్కువ. ఇది సీ బ్రీజ్ గ్రీన్ (లెదర్ లాంటి ఫినిషింగ్), టైటానియం గ్రే, ఎన్‌చాంటెడ్ పర్‌పుల్ (మెటాలిక్ లుక్) రంగుల్లో లభిస్తుంది. రియల్‌మీ P3 మాత్రం స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగుల్లో నాజూగ్గా కనిపిస్తుంది.

* కెమెరాలు, AI ఫీచర్లు

రెండిట్లోనూ 50MP మెయిన్ కెమెరా, దానికి తోడుగా 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. కానీ సెల్ఫీల దగ్గరికి వచ్చేసరికి రియల్‌మీ P3 ముందుంటుంది. ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా ఉండగా, ఇన్ఫినిక్స్ నోట్ 50Xలో 8MP కెమెరా మాత్రమే ఉంది. అయితే, ఇన్ఫినిక్స్ ఫోన్ AI ఫీచర్లతో ఈ లోటును భర్తీ చేస్తుంది.

AI ఆబ్జెక్ట్ ఎరేజర్ (ఫోటోలో వద్దనుకున్న వస్తువులను తీసేయడం), AI కటౌట్ (ఫొటోలో కావాల్సిన భాగాన్ని కత్తిరించడం), AIGC పోర్ట్రెయిట్ (ప్రత్యేకమైన ఫొటో ఎఫెక్ట్స్), ఫోలాక్స్ AI వాయిస్ అసిస్టెంట్ లాంటి టూల్స్ ఉన్నాయి. అంటే, ఫోటోలతో క్రియేటివ్‌గా ఆడుకోవడానికి ఇన్ఫినిక్స్ బాగా ఉపయోగపడుతుంది.

* బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్ ఎలా?

బ్యాటరీ లైఫ్ ముఖ్యం అనుకునేవారికి రియల్‌మీ P3 మంచి ఆప్షన్. ఇందులో పెద్ద 6,000mAh బ్యాటరీ ఉంది. దీన్ని త్వరగా ఛార్జ్ చేయడానికి దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. కేవలం గంటలోనే 90 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.

ఇన్ఫినిక్స్ నోట్ 50Xలో 5,500mAh బ్యాటరీ ఉంది. దీనికి కూడా 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అదనంగా, ఈ ఫోన్‌తో వేరే డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయొచ్చు, ఎందుకంటే ఇందులో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు అందించారు. కొన్ని సందర్భాల్లో ఈ సదుపాయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

* దృఢత్వం, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సంగతేంటి..

ఫోన్ కిందపడినా, నీళ్లలో పడినా ఏం కాకూడదు అనుకుంటే రియల్‌మీ P3కి ఓటు వేయొచ్చు. దీనికి అరుదైన IP69 రేటింగ్ ఉంది. అంటే దుమ్ము, నీళ్లను గట్టిగా తట్టుకుంటుంది. ఈ ధరలో ఇది గొప్ప విషయం. ఇన్ఫినిక్స్ నోట్ 50Xకి కూడా MIL-STD 810H సర్టిఫికేషన్ (మిలటరీ ప్రమాణాల దృఢత్వం), IP64 రేటింగ్ ఉన్నాయి.

అంటే ఇది కూడా గట్టి ఫోనే. రెండూ ఆండ్రాయిడ్ 15 తో వస్తాయి. కానీ, ఇన్ఫినిక్స్ కంపెనీ రెండేళ్ల పాటు కొత్త ఆండ్రాయిడ్ వెర్షన్లు, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని మాటిస్తోంది. రియల్‌మీ మాత్రం తమ అప్‌డేట్ పాలసీ గురించి ఇంకా స్పష్టంగా చెప్పలేదు.

* ధర ఎంత, చివరిగా ఏది కొనాలి?

ఇన్ఫినిక్స్ నోట్ 50X (6GB/128GB) సుమారు రూ.11,499 ప్రారంభ ధరతో వస్తోంది. బడ్జెట్‌లో మంచి ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. రియల్‌మీ P3 ధర రూ.16,999 నుంచి మొదలవుతుంది. ధర కొంచెం ఎక్కువైనా, దానికి తగ్గట్టుగా మెరుగైన AMOLED డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, స్టోరేజ్ పెంచుకునే అవకాశం వంటి ఫీచర్లు ఉన్నాయి.

కాబట్టి, మీకు మంచి డిస్‌ప్లే, గేమింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి రియల్‌మీ P3 కొనడం మంచిది. అలా కాకుండా, తక్కువ బడ్జెట్‌లో మంచి AI ఫీచర్లు, గట్టితనం, ఫర్వాలేదనిపించే పనితీరు కావాలంటే ఇన్ఫినిక్స్ నోట్ 50X డబ్బుకు తగ్గ విలువను అందిస్తుంది. మీ అవసరం, బడ్జెట్‌ను బట్టి సరైన ఫోన్‌ను ఎంచుకోండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Infinix Note 50X vs Realme P3 comparison Check specs, price, gaming, camera, and battery. Find out which budget phone offers better value and features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X