Home
Apps

WhatsApp లో కొత్త ఫీచర్స్!!! వాటి మీద ఓ లుక్ వేయండి....

వాట్సాప్ సుమారు రెండు బిలియన్ యూజర్‌బేస్ లను కలిగి ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అధిక యూజర్‌బేస్ ను కలిగి ఉన్న యాప్ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పుడు వాట్సాప్ సంస్థ తన వినియోగదారుల కోసం అనేక కొత్త కొత్త ఉత్తేజకరమైన ఫీచర్లను ప్రకటించింది.

WhatsApp New Features

WhatsApp New Features

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ కొత్త యానిమేటెడ్ స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్‌లు, డెస్క్‌టాప్ & వెబ్ కోసం డార్క్ మోడ్ మరియు గ్రూప్ వీడియో కాల్ వంటి అప్డేట్ లను వాట్సాప్ యొక్క స్టాండర్డ్ వెర్షన్‌కు తీసుకువస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

వాట్సాప్ చాట్

వాట్సాప్ చాట్

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చాట్ చేయడానికి ప్రజలు ఎక్కువగా సరళమైన, నమ్మదగిన మరియు ప్రైవేట్ మార్గాన్ని ఎంచుకోవడాన్ని అందికంగా ఇష్టపడుతూ ఉంటారు. వాట్సాప్ ఎవరికైనా, ఎక్కడైనా కనెక్ట్ అవ్వడానికి అత్యంత ఉపయోగకరమైన మార్గంగా ప్రస్తుతం ఉంది. రాబోయే కొద్ది వారాల్లో కొన్ని కొత్త ఫీచర్లను జోడిస్తున్నందున ఇవి మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి.

 

వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్

వాట్సాప్ యానిమేటెడ్ స్టిక్కర్ ఫీచర్

వాట్సాప్ సంస్థ తన వినియోగదారుల కోసం రాబోయే కొద్ది వారాల్లో ఈ కొత్త ఫీచర్లను కొత్త అప్ డేట్ లలో ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ ఒక పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. వినియోగదారులు త్వరలోనే వాట్సాప్ యొక్క తాజా వెర్షన్లలో ‘యానిమేటెడ్ స్టిక్కర్లను' చూడటం ప్రారంభిస్తారు.

వాట్సాప్ QR కోడ్‌ ఫీచర్

వాట్సాప్ QR కోడ్‌ ఫీచర్

వాట్సాప్ సంస్థ తన వినియోగదారులకు ఇప్పుడు QR కోడ్‌లను అందిస్తున్నది. దీనిని ఉపయోగించి ఎవరైనా క్రొత్త వారిని మరింత సులభంగా జోడించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వారు చేయాల్సిందల్లా ఇతర వ్యక్తి యొక్క QR కోడ్‌ను స్కాన్ చేయడం మాత్రమే. ఇలా చేస్తే కనుక ఆ వ్యక్తిని నేరుగా మీ యొక్క వాట్సాప్‌కు జోడించబడుతుంది.

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్

వాట్సాప్ సంస్థ కొత్తగా అందిస్తున్న ఫీచర్లలో ఒకటి డార్క్ మోడ్ ఫీచర్. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో ఒకటి. ఆండ్రాయిడ్ మరియు iOS యాప్ కోసం డార్క్ మోడ్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఫీచర్ రాబోయే కొద్ది వారాల్లో వాట్సాప్ వెబ్ మరియు డెస్క్‌టాప్ వెర్షన్‌కు కూడా విడుదల చేయబడుతుంది.

వాట్సాప్ గ్రూప్ కాల్స్ న్యూ ఫీచర్

వాట్సాప్ గ్రూప్ కాల్స్ న్యూ ఫీచర్

వాట్సాప్ సంస్థ తన వాట్సాప్ గ్రూప్ కాల్స్ లలో కూడా మెరుగుదలలను ప్రవేశపెట్టనున్నది. ఇది ఇప్పుడు వీడియో కాల్‌లో పాల్గొనేవారి సంఖ్యను పెంచడం మీద దృష్టి పెట్టింది. అంటే ఇప్పుడు ఒక గ్రూప్ కాల్ లో 8 లేదా అంతకంటే తక్కువ సమూహ చాట్ కోసం వీడియో చిహ్నం కూడా జోడించబడింది. కాబట్టి మీరు సులభంగా ఒక-ట్యాప్‌తో గ్రూప్ వీడియో కాల్‌ను ప్రారంభించవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp added New Features Like Animated Stickers, QR Codes and Dark Mode
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X