WhatsApp Paymentsలను స్మార్ట్‌ఫోన్‌లో సెటప్ చేయడం ఎలా?

|

కరోనావైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందడం అధికం అవడంతో ప్రతి ఒక్కరు మరొకరితో కలవకుండా సామజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది తమకు కావలసిన వాటిని కొనుగోలు చేయడానికి కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆధారపడుతున్నారు.

వాట్సాప్ పేమెంట్స్

వాట్సాప్ పేమెంట్స్

డిజిటల్ పేమెంట్స్ చేయడానికి చాలా రకాల యాప్ లు ఉన్నప్పటికీ ప్రపంచం మొత్తం మీద చాటింగ్ చేయడానికి అధికంగా ఉపయోగిస్తున్న యాప్ లలో వాట్సాప్ ముందువరుసలో ఉంటుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ ఆన్‌లైన్ చెల్లింపులను చేయడానికి కూడా అనుమతిని ఇస్తున్నది. Also Read:Flipkart TV Days Sale: బ్రహ్మాడమైన ఆఫర్లతో టీవీల కొనుగోలుకు సరైన సమయం.....

డిజిటల్ పేమెంట్స్

డిజిటల్ పేమెంట్స్

కరోనావైరస్ వ్యాప్తి అధికమవుతున్న సమయంలో సాధారణ నగదును ఒకరి చేతుల నుండి మరొకరి చేతులలోకి మారడం వలన మీరు అందుకునే కరెన్సీ నోట్ లేదా నాణెంను శుభ్రపరచడం సాధ్యం కాదు. అందుకోసం ఇప్పుడు అందుబాటులో అనేక రకాల ఆన్‌లైన్ పెమెంట్స్ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వాట్సాప్ పేమెంట్స్ కూడా ఉన్నాయి.  Also Read: సరసమైన ధరలో ఈ రోజు అమ్మకానికి రియల్‌మి టీవీ!!! ఆఫర్స్ అదుర్స్...

ఆన్‌లైన్ పేమెంట్స్
 

ఆన్‌లైన్ పేమెంట్స్

ఆన్‌లైన్ పేమెంట్స్ రెండు రకాలుగా జరుగుతాయి. ఇందులో ఒకటి యుపిఐతో పాటు వాలెట్ ఆధారిత నగదు బదిలీ. రెండవది నేరుగా బ్యాంక్ పోర్టల్ ద్వారా యుపిఐ ఆధారిత చెల్లింపును చేయడం. వాట్సాప్ పేమెంట్స్ యుపిఐ ఆధారిత ఫీచర్ ను కలిగి ఉంటుంది. ఇది పీర్-టు-పీర్ నగదు బదిలీని మాత్రమే అనుమతిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ పేమెంట్స్ లను ఎలా సెటప్ చేయాలి అని ఆలోచిస్తున్నారా అయితే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Also Read: WhatsApp scam:వెరిఫికేషన్ కోడ్స్ పేరుతో మెసేజ్ వచ్చిందా!!!! జర జాగ్రత్త...

వాట్సాప్ పేమెంట్స్ లను సెటప్ చేసే పద్ధతులు

వాట్సాప్ పేమెంట్స్ లను సెటప్ చేసే పద్ధతులు

*** మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ ను ఓపెన్ చేసి అందులో కుడివైపు ఎగువ మూలలో గల మూడు చుక్కలను నొక్కండి.

*** ఇందులో పేమెంట్స్ ఎంపిక మీద నొక్కండి.

*** "యాడ్ పేమెంట్" ఎంపికపై నొక్కండి. తరువాత Accept & Continue బటన్‌పై నొక్కండి.

 

Steps

Steps

*** తరువాత మీ బ్యాంకును ఎంచుకోవడానికి దాని మీద నొక్కండి.

*** ఇది రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి మీ బ్యాంక్ వివరాలను సేకరిస్తుంది.

*** దీని తరువాత "SMS ద్వారా ధృవీకరించు" బట్టెన్ ను నొక్కడం ద్వారా మీ యొక్క మొబైల్ నెంబర్ కు SMS పంపుతుంది. మీ బ్యాంక్ అకౌంటును ధృవీకరించడానికి OTP ను ధృవీకరించాలి.

*** OTP ను ధృవీకరించిన తర్వాత సెటప్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి "Complete" బట్టెన్ మీద నొక్కండి.

 

వాట్సాప్ పేమెంట్ లను ఉపయోగించి నగదును పంపడం ఎలా?

వాట్సాప్ పేమెంట్ లను ఉపయోగించి నగదును పంపడం ఎలా?

వాట్సాప్ పేమెంట్స్ ద్వారా మరొకరికి డబ్బులను పంపడానికి మరొకరు కూడా వాట్సాప్ పేమెంట్లను వాడుతూ ఉండాలి.

*** ఇతరుల స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ చెల్లింపును కూడా కాన్ఫిగర్ అయింది అని నిర్ధారించుకోండి.

*** ఇప్పుడు మీరు ఎవరికి డబ్బు పంపించాలనుకుంటున్నారో వారి యొక్క చాట్ విండోను ఓపెన్ చేయండి.

 

UPI PIN

*** తరువాత 'అటాచ్' చిహ్నంపై నొక్కి అందులో గల పేమెంట్ ఎంపికను ఎంచుకోండి.

*** తరువాత మీరు పంపించదలిచిన నగదు మొత్తాన్ని నమోదు చేసి "Next" బట్టెన్ మీద నొక్కండి.

*** పేమెంట్ ను యాక్సిస్ చేయడానికి UPI PIN ని నమోదు చేయండి.

 

Best Mobiles in India

English summary
How to set up WhatsApp Payments on your Phone in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X