వాట్సప్‌లో స్వల్ప మార్పులు

Written By:

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్ వాట్సప్‌లో త్వరలో ఓ చిన్నపాటి మార్పు చోటు చేసుకోనుంది. ఈ యాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఇకపై యాప్‌లో అటాచ్‌మెంట్ ఐకాన్‌కు బదులుగా వీడియో కాల్ ఐకాన్ దర్శనమివ్వనుంది. అయితే ఐఫోన్‌లో వాట్సప్ యాప్‌కు ఇప్పటికే ఈ మార్పు చోటు చేసుకోగా, త్వరలో ఆండ్రాయిడ్ యాప్‌లో ఈ చేంజ్ దర్శనమివ్వనుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు చెందిన బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది.

టాయిలెట్ క్రిముల కంటే దారుణమైన క్రిములు మీ ఫోన్లో ఉన్నాయి

వాట్సప్‌లో ఈ మధ్య కొత్తగా వచ్చిన ఫీచర్స్ ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్

వీడియో కాన్ఫరెన్స్ పేరిట ఓ నూతన ఫీచర్ అతి త్వరలో వాట్సప్ యూజర్లకు లభ్యం కానుంది. దీని వల్ల యూజర్లు ఇద్దరు కన్నా ఎక్కువ వ్యక్తులతో ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ చేసుకోవచ్చు

వైఫై వాడుతున్న వారికి

వైఫై వాడుతున్న వారికి మరింత క్వాలిటీగా ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సప్ యత్నిస్తోంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలోనే యూజర్ల ముందుకు రావచ్చని అంచనా

ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌

దీంతోపాటు ఎవరైనా ఒక యూజర్‌కు వచ్చే ఫొటోలు, వీడియోల సైజ్‌ను తెలిపేందుకు ప్రత్యేకంగా ఓ ట్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల పెద్ద సైజ్ కలిగిన ఫొటోలు, వీడియోలను యూజర్లు అవసరం లేదనుకుంటే వెంటనే ఫోన్‌లోంచి డిలీట్ చేసేందుకు వీలు కలుగుతుంది.

ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్

వాట్సప్‌లో ఐకాన్లు, ఎమోజీలు, సింబల్స్ ఎన్ని ఉన్నాయో తెలిపేందుకు కూడా ప్రత్యేక ఆప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. కేవలం వీడియో కాన్ఫరెన్స్ ఫీచర్ మాత్రమే కాకుండా త్వరలో మరిన్ని ఫీచర్లను వాట్సప్ అందించనున్నట్టు తెలిసింది.

వాట్సప్‌లో కొత్తగా...

వాట్సప్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్లు గమనించారా...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp for Android May Soon Move Attachment Button, Make Video Call Button Separate read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot