వాట్సప్‌లోకి మళ్లీ కొత్త ఫీచర్

Written By:

రోజు రోజుకు వాట్సప్ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఫీచర్లతో కష్టమర్లను ఇట్టే కట్టిపడేస్తోంది. తాజాగా వాట్సప్ నుంచి మరో రెండు సరికొత్త ఫీచర్లు విడుదలయ్యాయి. మీరు ఎవరికైనా పొరపాటున మెసేజ్ సెండ్ చేసినప్పుడు దాన్ని వెనక్కి తీసుకునే ఆప్సన్ ఉండేది కాదు. ఇప్పటిదాకా అయితే ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా పొరపాటున పంపిన మెసేజ్‌ని అన్‌సెండ్ చేసి మళ్లీ ఎడిట్ చేయవచ్చని చెబుతోంది.

గూగుల్‌లో ఈ ఏడాది అందరూ తెగ వెతికిన ఫోన్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రీవోక్ చేయడం ద్వారా

పొరపాటున ఏదైనా మెసేజ్ సెండ్ చేస్తే దాన్ని రీవోక్ చేయడం ద్వారా ఆ మెసేజ్ మళ్లీ వెనక్కి వస్తుందని అది అవతలి వాళ్ల ఫోన్లో నుంచి మాయమవుతుందని వాట్సప్ కొత్త ఫీచర్ ద్వారా తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాబీటాఇన్ఫో అనే సంస్థ

దీనికి సంబంధించి వాబీటాఇన్ఫో అనే సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. వాట్సప్ బీటా వెర్షన్లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుందని, దాన్ని ట్యాప్ చేస్తే పంపిన మెసేజ్ కూడా పోతుందని అంటున్నారు.

మెసేజ్లు మాత్రమే కాకుండా

కేవలం మెసేజ్లు మాత్రమే కాకుండా పొరపాటున పంపిన ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు .. ఇలా ఏవైనా కూడా అలాగే తీసేయొచ్చని వివరించారు. ప్రస్తుతానికి ఇది అందరికీ అందుబాటులో లేదు గానీ, త్వరలోనే వచ్చేస్తుందని హామీ ఇస్తున్నారు.

గతేడాది జీమెయిల్ కూడా

గతేడాది జీమెయిల్ కూడా ఇలాంటి ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. పొరపాటున ఒక మెయిల్ పంపినా, దాన్ని కావాలంటే అన్ డూ చేయొచ్చు. అలా చేస్తే, అవతలివాళ్ల ఇన్బాక్స్ లోంచి కూడా అది డిలీట్ అయిపోతుంది.

ఇది వస్తే మరో సంచలనమే

ఇప్పుడు వాట్సప్లో ఇది వస్తే మరో సంచలనమే అవుతుంది. అయితే ఇది ప్రధానంగా ఐఓఎస్ వర్షన్లకు మాత్రమే పనిచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ యూజర్లు కొంతకాలం వేచి చూడక తప్పదు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp could soon allow users to revoke, edit sent messages read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot