గూగుల్‌లో ఈ ఏడాది అందరూ తెగ వెతికిన ఫోన్లు..

Written By:

మరి కొద్ది రోజుల్లో 2016 ముగిసిపోబోతోంది. సరికొత్త ఆశలతో 2017 వస్తోంది. మరి ఇలాంటి సంధర్భంలో ఈ ఏడాది టాప్ లో నిలిచిన టెక్నాలజీ గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో.. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో డామినేటెడ్ చేసిన 10 ఫోన్లు ఏవో ఓ సారి తెలుసుకుందాం.

రూ. 3వేలకే 4జీ వోల్ట్ స్మార్ట్‌ఫోన్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్

ఇవి అక్టోబర్ లో రిలీజయినప్పటికీ ఈ ఏడాది టాప్ ప్లేస్ ని ఆక్రమించాయి. రిలీజ్ కి ముందు నుంచి ఈ ఫోన్లకు సంబంధించి అనేక రూమర్లు హల్ చల్ చేయడంతో ఈ ఫోన్లు గూగుల్ సెర్చ్ లో ఓ ఊపు ఊపాయి. గత ఫోన్ల కన్నా కొంచెం మార్పులతో వచ్చిన ఈ ఫోన్లలో Quad-Core A10 Fusion processorను పొందుపరిచారు. హోమ్ బటన్ కూడా మారింది. ఇంకా అది పెద్ద మార్పు ఏదంటే డ్యూయెల్ రేర్ కెమెరాలతో ఈ ఫోన్లు రావడం.

ఫ్రీడం 251

గూగుల్ లో సెకండ్ స్థానాన్ని ఈ ఫోన్ ఆక్రమించింది. ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన ఈ ఫోన్ అప్పట్లో గూగుల్‌ని షేక్ చేసింది. కాని కష్టమర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐఫోన్ ఎస్ఈ

మార్చిలో ఆపిల్ ఈ ఫోన్‌ని లాంచ్ చేసింది.రూ. 39,000 వేల వద్ద ఈ ఫోన్ ఇప్పుడు లభిస్తుంది. అయితే ఐఫోన్ 6లో ఉన్న కొన్ని ఫీచర్లు ఈ ఫోన్లో ఉండటంతో అందరూ దీని గురించే తెగ వెతికారు.

ఐఫోన్ 6ఎస్

ఈ ఫోన్ కూడా ఈ ఏడాది టాప్ ప్లేస్‌లో నిలిచింది. విచిత్రమేమిటంటే గతేడాది ఈ ఫోన్లు లాంచ్ చేశారు. అయినప్పటికీ ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో టాప్ లో నిలిచాయి. ఆపిల్ అంటే క్రేజ్ తగ్గలేదని మరోసారి రుజువు చేశాయి.

గూగుల్ ఫిక్సల్

ఆపిల్ ఐఫోన్లకు సవాల్ విసురుతూ గూగుల్ నుంచి దూసుకొచ్చిన ఫోన్ ఇది. అక్టోబర్ లో లాంచ్ అయిన ఈ ఫోన్ అదిరిపోయే కెమెరాలతో కష్టమర్ల ముందుకు వచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 57,000గా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్7

ఈ ఏడాది మార్చిలో శాంసంగ్ గెలాక్సీ 7 ఇండియాలో రిలీజ్ అయింది. దీని ధర రూ. 48,900.వాటర్ డస్ట్ రిసిస్టెన్స్ తో వచ్చిన ఈ ఫోన్లు వచ్చి రాగానే ఓ ఊపు ఊపాయి.

శాంసంగ్ గెలాక్సీ నోట్ 7

శాంసంగ్ కంపెనీకి అతి పెద్ద విషాదాన్ని మిగిల్చిన ఫోన్ ఇది. బ్యాటరీలు పేలుతున్నాయనే వార్తలతో శాంసంగ్ ప్రతిష్ట ఒక్కసారిగా మసకబారింది. ఫోన్ గురించి ఇంటర్నెట్లో తెగ వెతికారు అందరూ.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
iPhone 7 to Google Pixel: The top smartphones that dominated Google Search in 2016 read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot