వాట్సాప్‌లో అద్భుతమైన ఫీచర్.. ఫోన్ నంబర్ అవసరం లేకుండానే చాట్, కాల్స్ చేసుకోవచ్చు..!
వాట్సాప్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాపులర్ మేసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. భారీ సంఖ్యలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ క్రమంగా అనేక ఫీచర్‌లను తీసుకొస్తోంది. ఇందులో భద్రతా, ప్రైవసీ సహా ఇతర ఫీచర్‌లు ఉన్నాయి. ఇటీవలే వాట్సాప్‌నకు పోటీగా తీసుకొచ్చిన మేడ్ ఇన్ ఇండియా యాప్ అరట్టై ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ప్రైవసీకి భంగం కలగకుండా :
అయితే వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యూజర్ల ప్రైవసీకి ఎటువంటి భంగం కలగకుండా అనేక ఫీచర్‌లను తీసుకొస్తోంది. తాజాగా వాట్సాప్ సూపర్ ఫీచర్ వివరాలు లీక్ అయ్యాయి.

వాట్సాప్‌లో ప్రస్తుతం ఫోన్ నంబర్ ఆధారంగా చాట్, కాల్స్ చేస్తున్నాం. అయితే వాట్సాప్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న యూజర్ నేమ్ (Whatsapp Username) ఫీచర్ అందుబాటులోకి వస్తే.. ఫోన్ నంబర్ ఎవరికీ షేర్ చేయాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్‌లో చాట్, కాల్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ లో ఈ విధానం అందుబాటులో ఉంది.
ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ :
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ తాజాగా వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.28.12 లో కనిపించింది. ఈ వివరాలను వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ WABetainfo వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. అయితే కచ్చితంగా ఎప్పటి నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు.
ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక, యూజర్లు నేరుగా తమ యూజర్‌నేమ్‌ను క్రియేట్ చేసుకొనే అవకాశం వాట్సాప్ కల్పిస్తుంది. ఈ విధానం ద్వారా యూజర్లకు మరింత ప్రైవసీ లభిస్తుందని, ముఖ్యంగా తమ ఫోన్ నంబర్ ఇతరులకు తెలియకూడదని భావించే యూజర్లకు మరింత ఉపయోగపడుతుంది.

అయితే వాట్సాప్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొనే సమయంలో కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వెబ్ లింక్స్‌ను (www) తరహాలో యూజర్‌నేమ్ ఉండకూడదు. అయితే యూజర్‌నేమ్‌లో కనీసం ఒక అక్షరం అయినా ఉండాలి. ఇ-మెయిల్ తరహాలో నంబర్లు, అండర్‌స్కోర్, అక్షరాలు ఉండవచ్చు.
* వాట్సాప్‌నకు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ యాప్ అరట్టై ఇటీవల ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. ప్రధాని మోడీ స్వీదేశీ ఉత్పత్తులు, బ్రాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరడం, అనేక మంది కేంద్ర మంత్రులు అరట్టై యాప్‌ను ప్రమోట్ చేయడంతో ఒక్కసారిగా యూజర్ల సంఖ్య పెరిగింది.
ఇటీవల ఆపిల్ యాప్ స్టోర్ సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్ 1 గా నిలిచింది. అరట్టై అంటే తమిళంలో మాట్లాడుకోవడం (Casual Chat or Chit Chat) అని అర్ధం. వాట్సాప్ తరహాలోనే ఇందులోనూ అనేక ఫీచర్లు ఉన్నాయి. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి వాయిస్, వీడియో కాల్స్‌కు మాత్రమే ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంది.
గతంలో పోలిస్తే అరట్టై యాప్ భారీగా సైన్ అప్‌లను నమోదు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ యాప్ రోజువారీ SignUp ల సంఖ్య 3,000 నుంచి 350,000 చేరినట్లు గత వారం వెల్లడించింది. అయితే యూజర్ల తాకిడి ఆధారంగా అనేక అప్‌గ్రేడ్స్ చేస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








