అదరగొట్టిన వాట్సప్ వీడియో గ్రూప్ కాలింగ్
టెక్ ప్రపంచంలో వాట్సప్ ఒక సంచలనం. అనతి కాలంలోనే ఒక సాధారణ చాటింగ్ ప్లాట్ ఫామ్ స్థాయి నుంచి నెంబర్ వన్ బ్రాండ్ స్థాయికి వేగంగా విస్తరించింది.
టెక్ ప్రపంచంలో వాట్సప్ ఒక సంచలనం. అనతి కాలంలోనే ఒక సాధారణ చాటింగ్ ప్లాట్ ఫామ్ స్థాయి నుంచి నెంబర్ వన్ బ్రాండ్ స్థాయికి వేగంగా విస్తరించింది. అయితే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో అదరగొడుతున్న వాట్సప్ తాజా అప్ డేట్ లో వీడియో కాన్ఫరెన్స్ గ్రూప్ కాలింగ్ బీటా వెర్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే ఇది సెలెక్టెడ్ కస్టమర్లు అంటే అండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.18.162 వాడేవారికి అందుబాటులో వచ్చింది. దీని ద్వారా వీడియో గ్రూప్ కాల్స్ చేసుకునే వీలుంది. త్వరలోనే ఐవోఎస్ కస్టమర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది.

ఈ నేపథ్యంలో మా గిజ్ బాట్ టీమ్ సైతం ఆండ్రాయిడ్ బీటా 2.18.162 ఫోన్ ద్వారా గ్రూప్ వీడియో కాల్స్ టెస్ట్ చేసింది. ప్రయోగాత్మకంగా చేసిన ఈ కాల్స్ ద్వారా నలుగురుతో వీడియో కాన్ఫరెన్స్ చేసే వీలుంది.
సెకన్లలో అవుట్ ఆఫ్ స్టాక్ అయిన ఆ ఫోన్ ఇండియాకు వస్తోంది
వీడియో గ్రూప్ కాల్స్ ఎలా చేయాలి ?
ముందుగా అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మామూలు వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత, రైట్ కార్నర్ లో మరో ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మరొకరిని ఆహ్వానించవచ్చు. ఇలా 4 మందిని ఆహ్వానించే వీలుంది. అయితే కాకతాళీయంగా మా టీమ్ లో నలుగురికి బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. దీంతో సులభంగానే కాల్స్ చేయగలిగాం.
ఈ ఫీచర్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా బాగుంది. ముఖ్యంగా ఆడియో క్లారిటీ బాగుంది. ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా కొత్త మెంబర్స్ ను కాల్ లో ఆహ్వానించే అవకాశం ఉంది. అయితే ఒకే సారి ముగ్గురికి కాల్స్ చేయడం ఈ అప్ డేట్ లో సాధ్యం కాదు.


Click it and Unblock the Notifications