వాట్సాప్ గ్రూప్ కోసం కొత్త అప్డేట్... వెంటనే మీరు కూడా చెక్ చేసుకోండి

|

వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అప్‌డేట్ చేసిన గ్రూప్ ప్రైవసీ సెట్టింగులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మీ కాంటాక్ట్ లలో ఎవరు మిమ్మల్ని గ్రూప్ లోకి చేర్చవచ్చనే దానిపై మీకు అదనపు నియంత్రణను అందిస్తుంది. ఇది మొదట ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం ప్రవేశపెట్టారు. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఈ సంస్థ గత నెల చివర్లో ఐఫోన్ వినియోగదారుల కోసం ఈ కొత్త గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌ల అప్డేట్ ను తీసుకువచ్చింది.

 

 ప్రైవసీ సెట్టింగ్‌లను కనుగొనడానికి

వాట్సాప్ లోని గ్రూప్స్ కోసం అప్డేట్ చేసిన ప్రైవసీ సెట్టింగ్‌లను కనుగొనడానికి కింది పద్ధతులు పాటించండి.


వాట్సాప్ సెట్టింగ్స్ > అకౌంట్ > ప్రైవసీ > గ్రూప్స్ ఆప్షన్ ను ఎంచుకోండి.
మీరు అక్కడ అందులో ఇప్పటికే ఉన్న ప్రతిఒక్కరికీ మరియు మై కాంటాక్ట్స్ తప్ప అనే ఆప్షన్ ను కనుగొంటారు. తక్షణ మెసేజ్ లపై మీ యొక్క కాంటాక్ట్స్ లలో ఎవరు మిమ్మల్ని గ్రూప్ కోసం జోడించగలదో ఎంచుకోవడానికి ఇది మీకు నియంత్రణను ఇస్తుంది.

సెట్టింగ్‌ల

మీరు అప్డేట్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్‌ల నుండి క్రొత్త ఎంపికను ఎంచుకుంటే కనుక మిమ్మల్ని గ్రూప్ లోకి చేర్చకుండా పరిమితం చేయవచ్చు. అలాగే గ్రూప్ నిర్వాహకుడు మీకు వ్యక్తిగత చాట్ ద్వారా ప్రైవేట్ ఆహ్వానాన్ని పంపడం ద్వారా మిమ్మలిని ఆహ్వానించవచ్చు. ఆహ్వానం గడువు ముందే అంగీకరించడానికి మీకు మూడు రోజులు ఉంటుంది. మీరు గ్రూప్ లో చేరాలనుకుంటున్నారా అని ఎంచుకోవడానికి ఇది మీకు ఎంపిక కూడా ఇస్తుంది.

 

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్

వాట్సాప్ గ్రూప్
 

ఏప్రిల్‌లో వాట్సాప్ గ్రూప్ ల కోసం ప్రైవసీ సెట్టింగ్‌లను తీసుకురావడం ద్వారా స్పామ్ గ్రూప్ దాని ప్లాట్‌ఫారమ్‌లో ఆహ్వానాలను నిరోధించడానికి ప్రయత్నించింది . అయితే ఆ సమయంలో మీరు ఆహ్వానించబడిన ప్రతి వాట్సాప్ గ్రూప్ లో చేరడానికి మిమ్మల్ని అనుమతించడానికి ఎంపిక చేయలేదు.

కొత్త అప్డేట్

కొత్త అప్డేట్ నిర్దిష్ట పరిచయాలను మినహాయించటానికి లేదా అన్నీ కాంటాక్ట్స్ లను ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుంది అని కంపెనీ పేర్కొన్నది.

 

ఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదుఈ ఫోన్‌లలో ఇక మీద వాట్సాప్ పనిచేయదు

బీటా వెర్షన్

గత నెలలో WhatsApp iOS బీటా వెర్షన్ 2.19.110.20 మరియు Android బీటా వెర్షన్ 2.19.298 కు మెరుగైన గ్రూప్ ప్రైవసీ సెట్టింగులను తీసుకువచ్చింది. ఐఫోన్ వెర్షన్ 2.19.110 కోసం వాట్సాప్ ద్వారా గత నెల చివరిలో కొంతమంది ఐఫోన్ వినియోగదారులకు ఈ అప్డేట్ ను అనుమతించింది.

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో SMS ద్వారా మీ లొకేషన్ ను షేర్ చేయడం ఎలా?

వాట్సాప్

ఏదేమైనా వాట్సాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ వినియోగదారులకు అప్డేట్ గ్రూప్ ప్రైవసీ సెట్టింగులను ప్రవేశపెట్టింది. ఈ మార్పు సర్వర్ రోల్ అవుట్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే క్రొత్త అనుభవాన్ని పొందడానికి మీ డివైస్ లో మొదటిగా సరికొత్త వాట్సాప్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేయడం మంచిది.

Best Mobiles in India

English summary
WhatsApp New Updated Group Privacy Settings

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X